ఎంసెట్-2 లీకేజీ తెలంగాణ ప్రభుత్వంలో ప్రకంపనాలు సృష్టించబోతున్నది. విద్యార్థుల బంగారు భవి ష్యత్‌కు సంబంధించిన అంశం కావడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ విష యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రెండేళ్లుగా ప్రజా సంక్షేమపథకాలు ప్రారంభిస్తూ దేశ, విదేశాలను ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సం బంధించిన అంశం కావడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో, అటు విపక్షాల నుంచి ప్రభు త్వం తీవ్ర […]
Category: Politics
సిఎం కుమారుడి మృతి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య (39) అనారోగ్యంతో మరణించారు. బెల్జియంలోని అంట్వెర్ప్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న రాకేష్ భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన శరీరంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. మంగళవారం నాడు అయన చికిత్స కోసం చేరారు. గతంలో రాకేష్ కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. ఇటీవలే రాకేష్ తన రాజకీయ ఎంట్రీ మీద వ్యాఖ్యలు చేసారు. తన […]
పదవి పోయినా డోన్ట్ కేర్: కేశినేని
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం తమ పదవులు పోయినా లెక్కచేయబోమని టిడిపి ఎంపీలు అంటున్నారు. బిజెపితో అమీ తుమీకి సిద్ధమని చెబుతూ అధినేత చంద్రబాబు సంకేతాల కోసం ఎదురుచూస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. అలాగే, పదవుల కోసం పాకులాడేవాళ్ళం కాదని రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఎలా పోరాటం చేయాలన్నదానిపై వ్యూహరచన చేస్తున్నామని చంద్రబాబు సూచనలతో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని […]
జగన్‌కి ఇదే వెపన్ అవుతుందా?
వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతిలో భారతీయ జనతా పార్టీ ‘ఆయుధం’ పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి చెప్పినా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆచి తూచి స్పందిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు ఆలోచనల్ని ఖండించడానికి లేదు. కేంద్రంతో విభేదాలు ఏ రాష్ట్రానికీ మంచిది కాదనేది ఆయన ఉద్దేశ్యం కావొచ్చు. అయితే ప్రతిపక్షంగా పోరాడేందుకు పూర్తి అవకాశం ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనీ అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ ఇరకాటంలో […]
బొంకురామాయణం బాబు వంతొచ్చింది
కట్టే విరగకూడదు పాము చావకూడదు అనే సామెత గుర్తుందా?అచ్చం అలాగే ఉంటుంది చంద్రబాబు వ్యవహారం.కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించ కూడదు అయితే ప్రశ్నించినట్టుండాలి.ఇప్పటికే టీడీపీ రాజ్యసభలో వ్యవహారశైలి పైన,బీజేపీ కి వంత పాడటం పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యం లో నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు పాపం బాబు గారు.ఎంతో హుందాగా..అంతకు మించి సీరియస్ గా బాధాతప్త హృదయంతో ప్రెస్ మీట్ మొత్తం రక్తి కట్టించారు బాబుగారు. పాపం ప్రెస్ మీట్ పెట్టి సుతి మెత్తగా కేంద్రాన్ని విమర్శిస్తూ, […]
కెసిఆర్ కి సిసలైన సవాల్!
రెండేళ్ల నుంచి అన్ని విషయాల్లో పైచేయి సాధించిన టీఆర్ ఎస్ ప్రభుత్వం- ఎంసెట్ లీకేజీ, 8మంది వీసీల రద్దు తీర్పుతో ఇరుకునపడింది. ఎంసెట్ స్కాంతో ఓ పక్క గందరగోళం కొనసాగుతుండగానే 8మంది వీసీల నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని దెబ్బమీద దెబ్బగానే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ప్రతిదీ నిశితంగా పరిశీలించి, నిఘాలతో ప్రభుత్వ వ్యవస్థను నడిపిస్తోన్న ప్రభుత్వం, ఎంసెట్ లీకేజీ అంశంలో దెబ్బతిన్నమాట నిజమేనని ఎమ్మెల్యేలు, నేతలు అంగీకరిస్తున్నారు. ఎంసెట్ కుంభకోణం లక్షలాది […]
ప్రత్యేక హోదానా వంకాయా:జైట్లీ
ప్రత్యేక హోదాపై అధికార పక్షం చాలా క్లారిటీగా వుంది.చెవిటోడి ముందు శంఖం ఊదిన ప్రయోజం ఉంటుందో లేదో కానీ ఇంత క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ వేదన అరణ్య రోదనే..నిన్న బొంకయ్య నాయుడుగారు బొంకిన బొంకులే ఈ రోజు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు కూడా ఇంకొంచెం పోలిష్ చేసి వల్లెవేశారు. అసలు చర్చే ప్రత్యేక హోదా గురించి అయితే ఎంతసేపు దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం […]
లోకేష్ ఉత్తమాటలా? గట్టిమాటలా?
టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ గడ్డ మీద నుంచి లోకేష్ సహా తెలుగుదేశం పార్టీని తరిమేసినట్లయ్యింది పరిస్థితి ఇప్పటికే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే కాకుండా ఖమ్మం, వరంగల్, నారాయణ్‌ఖేడ్, మెదక్ ఉప ఎన్నికల్లో ఫలితాలు తెలుగుదేశం పార్టీని వెక్కిరించాయి. దాంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇంకా నీరసించిపోయింది. అయితే పార్టీలు […]
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి కత్తిమీద సాము. అలాగే ప్రవేశ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకైతే మళ్ళీ పరీక్ష రాయడం అనేది కష్టసాధ్యం. విద్యార్థి లోకం పోటీ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతోంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్ని ఎందర్నో చూస్తున్నాం. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని తెలంగాణ సిఐడి స్పష్టం చేయడంతో ఇంకోసారి ఎంసెట్ నిర్వహణ జరుగుతుందనే ప్రచారం కారణంగా విద్యార్థి […]