ఎన్ని సార్లు చెప్పాలి యువరానర్ పెంచము..పెంచము..పెంచము గాక పెంచము..ఇది తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం వైఖరి.అయినా పట్టువదలని విక్రమార్కుల్లా పాపం ఆంధ్ర,తెలంగాణా పాలకులు పోరాడుతూనే వున్నారు.ఇదేదో ప్రజా ప్రయోజనం కోసం అనుకుంటే పొరపాటే..కేవలం పార్టీ ఫిరాయించి నిస్సిగ్గుగా అధికార పార్టీ లో చేరిన వారిని కాపాడుకుందుకే ఇంత తాపత్రయం. ఇప్పటికే కేంద్రం ఎన్నో సార్లు నియోజక వర్గాల పెంపు 2024 వరకు సాధ్యమయ్యే పరిస్థితి లేదని డంకా బజాయించి మరీ చెప్పింది.అయినా ప్రజా ప్రతినిధుల […]
Category: Politics
కెసియార్ టీడీపీని ఇలా కూడా దెబ్బకొడుతున్నారా?
గ్యాంగ్‌స్టర్ నయీం బతికొచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేడు. పోలీసులు ఏం చెబితే అదే నిజం అనుకోవాలి. ప్రభుత్వం ఎలా చెబితే పోలీసులు అలా నివేదిక ఇస్తారు. ఇదీ విపక్షాల ఆరోపణ. గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత పోలీసు, రాజకీయ వర్గాల్లో సునామీ మొదలైంది. ఈ సునామీలో ఎవరు కొట్టుకుపోతారో తెలియడంలేదు. పోలీసులు సేఫ్ అవ్వాలంటే అధికార పార్టీ చెప్పినట్లు పోలీసులు వ్యవహరించాలని హుకూం జారీ అయినట్లుగా పరిస్తుతులు కానవస్తున్నాయంటూ రాజకీయ వర్గాలలో […]
ఉలిక్కి పడ్డ ఉమా మాధవరెడ్డి!
తీగ లాగితే డొంక కదిలింది అన్న చందాగా రౌడీ షీటర్ నయీమ్ ఎన్కౌంటర్ తరువాత రాజకీయ,పొలిసు వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.తాము పాలు పోసి పెంచిన పామే తమను కరుస్తుంది అన్న చందాగా తయారైంది నయీమ్ వ్యవహారం.చివరికి ఎవరికీ వారు మాకేపాపం తెలియదు అని బహిరంగంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే నయీమ్ తో సంబంధాలపై అందరికంటే ముందు వరుసలో వినిపిస్తోన్న పేరు మాజీ హోమ్ మంత్రి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పేరే.మాధవరెడ్డి ని ఎవరు,ఎలా […]
ఆన్ లైన్ పైనే మోజు అందని ఫించన్లు
ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఆన్ లైన్ మోజులో ఆఫ్ లైన్ పై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో […]
మాగంటి గారి గెడ్డం నిరసన
స్వతంత్ర దేశంలో అహింసాయుత నిరసనల్లో ఇదో ట్రెండ్… మాగంటి గారి గెడ్డం నిరసన. ..ఏపీకి ప్రత్యేక హోదా విషయం రాష్ట్ర ఎంపీలను ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్… హోదాపై ఇప్పటి వరకు అనేక రూపాల్లో అధికార పక్ష ఎంపీలు, విపక్ష వైకాపా ఎంపీలు తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ఇక, వ్యక్తిగతంగా కూడా కేంద్రంపై నిరసన తెలిపేందుకు సిద్ధమైపోయారు అధికార పక్ష ఎంపీలు. ఇప్పటికే చిత్తూరు ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్.. […]
ట్విట్టర్ లో షాక్ ఇచ్చిన సుష్మా స్వరాజ్
ఈ మధ్య కాలంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను ట్విట్టర్ ద్వారా సమస్యల పరిష్కారం కోరడం ఎక్కువయిపోయింది. పాకిస్థాన్ కు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ కు ఆమె సాయపడడం, ఓ ముస్లిం జంటను కలపడంలో ఆమె సహకరించడం .. ఇవన్నీ చూసి ఓ కుర్రాడికి ఆమెను టీజ్ చెయ్యాలనిపించింది.. అంతే.. “నా కొత్త కారు పాడయిపోయింది, పొగ వస్తోంది, షాపు తీసికెళితే వాడు రీప్లేస్ చేయనంటున్నాడు.. నన్నేం చేయమంటారు, మీరో మాట చెబితే నాకు […]
గ్యాంగ్‌స్టర్ నయీమ్ వెనుక అసలు దొంగలెవరు!
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఒక్కడే వేల కోట్ల ఆస్తుల్ని కూడగట్టలేడు. పెద్దల అండదండలు ఆయనకు పుష్కలంగా ఉండే ఉండాలి. వందలాది డాక్యుమెంట్లు ఆయన ఇంట్లో లభ్యమయ్యాయి. ఇంకా ఆయన అనుచరుల ఇళ్ళలో డాక్యుమెంట్లు దొరుకుతున్నాయి. నయీమ్ అనుచరులెందరో లెక్క తేల్చడమే పోలీసులకు కష్టంగా మారింది. తవ్వుతున్న కొద్దీ నయీమ్ బాగోతాలు కొత్త కొత్తగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. నయీమ్ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి అనేంతలా ఆయన చుట్టూ ఓ పెద్ద కోట ఉంది. ఆ కోటని […]
జగన్ కొత్త గెటప్ వెనుక రాజకీయ కోణం
అధికారంలో ఉన్నవారెవరైనాసరే కులమతాలకతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని మతాల పండుగల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఆయా మతాచారాల ప్రకారం వ్యవహరిస్తారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నవారికి అవన్నీ చేయాలని రూలు ఏమీ లేదు. ఆయా మతాల పండుగల్లో పాల్గొనడం వేరు, ఆ మతాచారాల్ని పాటించడం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, క్రిస్టియానిటీని విశ్వసిస్తారు. అలాగని ఆయన ఇతరమతాలకి వ్యతిరేకి కాదు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లి, ‘విశ్వాసం’ తెలపలేదనే […]
కాశ్మీర్ ఉగ్రవాది పాక్ లో హీరో
భారత భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్‌బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ బుర్హాన్ వనీ.. హీరోలా చూస్తోంది పాకిస్థాన్. ఇండియా ఎంత చెబుతున్నా వినకుండా.. వనీ విషయంలో కలగచేసుకుంటోంది. అతను యువతకి స్ఫూర్తి అంటూ.. ప్రచారం చేస్తోంది. గురువారం ‘ఆజాదీ ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఓ రైలును ప్రారంభిస్తోంది పాకిస్థాన్. ఈ రైలు బోగీలపై వనీ ఫొటోలను అంటించింది. వనీతోపాటు కాశ్మీర్‌లో హింస బాధితుల ఫొటోలనూ రైలు బోగీలకు అంటించింది. ఈ రైలును పాక్ రైల్వే మంత్రి ఖాజా సాద్ […]