సినీ నటుడిగా అగ్రస్థానంలో కొనసాగుతూనే… మరోపక్క పూర్తిస్థాయి రాజకీయవేత్తగానూ అవతారమెత్తేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నపవన్‌కల్యాణ్.. పశ్చిమగోదావరిని తన రాజకీయాలకు కేంద్రంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైదరాబాద్ నగరంలో ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి పవన్ సిద్ధం అయినట్టు కూడా తెలుస్తోంది. ఏలూరుకు తరలి రావాలన్న పవన్ తాజా నిర్ణయంతో రాజకీయవర్గాల్లో పలు ప్రశ్నలను , సందేహాలను లేవనెత్తుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. […]
Category: Politics
టీడీపీలో ఒక్కటైన బద్ధ శత్రువులు
కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లుగా జమ్మలమడుగు నియోజకవర్గాన్నిచెప్పుకోవాలి. ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న..ఆదినారాయణరెడ్డి, మొదటినుంచి టీడీపీనే నమ్ముకున్న మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాల వైరముంది. అందుకే ఆదినారాయణరెడ్డి టీడీపీ లోకి రావడాన్ని… రామసుబ్బారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. చంద్రబాబు రాజకీయ చాణక్యమో… లేక ఈ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు వ్యూహ చతురతో తెలియదుగానీ విపక్ష అధినేత జగన్ సొంత జిల్లాలో పరిణామాలు […]
మాజీ సీఎం కిరణ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబుతున్నారా!
ఓ ప్రధానమైన రాష్ట్రానికి ఎవరూ ఊహించనివిధంగా ముఖ్యమంత్రి స్థాయికెదిగిపోయి… ఆ తరువాత అంతే నాటకీయంగా… రాజకీయ యవనిక పైనుంచి దాదాపు తెరమరుగైపోయిన విచిత్ర గాథ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిది.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు నల్లారి ఆఖరి ముఖ్యమంత్రి. విభజన వద్దని గట్టిగా పోరాడి, ఆపై ‘సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నవైనం అందరికీ తెలిసిందే. ఈ పరిణామాల తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి దాదాపుగా రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామంలోనే వ్యవసాయ […]
తమ్ముళ్లకు చంద్రబాబు ఆఫర్ – వార్నింగ్
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలున్న పార్టీగా తెలుగుదేశం పార్టీకి దేశంలోనే ప్రత్యేక స్థానముంది. పార్టీ కోసం అహర్నిశలు సైనికుల్లా శ్రమించే వీరి అండదండలతోనే ఆ పార్టీ గత ముప్పై మూడేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులెదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు రాగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయపక్షంగా సుస్థిర స్థానం సంపాదించుకోగలిగింది. ఈ నేపథ్యంలో పార్టీనే నమ్ముకుని సొంత ఆస్తులను కూడా కరిగించుకుంటూ పనిచేసిన కార్యకర్తలను, నాయకులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు.. ఆ పార్టీ అధినేత – ఏపీ […]
కొత్త ట్విస్ట్ జగన్‌తో కాంగ్రెస్ దోస్తీ
ఎవరు కాదన్నా.. అవునన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులున్నాయి. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న చరిత్ర కూడా ఆ పార్టీ పేరునే లిఖించబడి ఉంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీ ఉనికి సైతం ఏపీలో ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే… అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అప్పటిదాకా బలంగా ఉంటూ వచ్చిన ఓటు బ్యాంకు అంతా ఏమైంది..? ఈ ప్రశ్న ఎవరిలోనైనా తలెత్తితే వెంటనే వారి చూపులు […]
జనసేనది ఒంటరి పోరే..
ప్రముఖ సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ ప్రతక్ష్య రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చి వారికి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు… బీజేపీపై కాస్త గట్టిగా… టీడీపీపై కాస్త సుతిమెత్తగా విమర్శలు చేస్తోన్న పవన్ వైఖరిని చూశాక మరి జనసేన వచ్చే ఎన్నికల్లో సొంతంగానే బరిలోకి దిగుతుందా..? లేక ఇప్పటిదాకా మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏ తో పొత్తు […]
టీఆర్ఎస్‌లో కొత్త కలరింగ్ చూస్తే షాకే
అవును! తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కి కొత్త కలరింగ్ ఇవ్వబోతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఆయన అనేక సంచనల నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంపై తన ముద్ర పడేలా జిల్లాల ఏర్పాటు చేసిన ఆయన.. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవ చేయాలని నిర్ణయించారు. అంతేకాదు, పార్టీ కేడర్ సహా మంత్రులు, నేతలు అందరూ నిత్యం ప్రజల్లో ఉండేలా పక్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు. వాస్తవానికి నిత్యం […]
టీడీపీ కంచుకోటపై జనసేన గురి
జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం ఏపీ పాలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతోంది. పవన్ కేవలం ఓటు హక్కు మాత్రమే ఏలూరులో నమోదు చేయించుకున్నట్టు పైకి కనిపించినా దీని వెనక అనేక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. పవన్ ఏలూరు నివాసం ఉండేందుకు తనకు అనువైన భవనం చూడాలని కూడా కార్యకర్తలకు చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ ఈ వ్యూహం వెనక టీడీపీ కంచుకోటను టార్గెట్ చేసినట్టు […]
పాదయాత్రకు రెడీ అవుతోన్న జగన్…
తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, నేతల పాదయాత్రలకు అవినాభావ సంబంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1600 కిలోమీటర్ల దూరం చేపట్టిన పాదయాత్ర ప్రజల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ను తేవడమే కాదు… ఆనాటికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నేతలందరినీ వైఎస్ ముందు మరుగుజ్జులుగా మార్చేసి ఆయనను ఏకంగా సీఎం పీఠం ఎక్కించేసింది. ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆరుపదులు దాటిన వయసులో […]