జ‌యకు వ్య‌తిరేకంగా శ‌శిక‌ళ కుటుంబం కుట్ర‌!

త‌మిళ‌నాడులో అమ్మ‌గా పూజ‌లందుకున్న మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఇప్పుడు లేరు. కానీ, ఆమె జ్ఞాప‌కాలు ఉన్నాయి. ఆమె వ‌దిలి వెళ్లిన వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమె ఎంత‌గానో ఇష్ట‌ప‌డిన మ‌నుషులు ఉన్నారు. ఇంత వ‌ర‌కే అంద‌రికీ తెలుసు! కానీ, ఆన‌మ్మిన మ‌నుషులే అమ్మ వెనుక కుట్ర‌లకు తెర‌దీశార‌ని, అమ్మ ప‌త‌నాన్ని కోరుకున్నార‌ని, అమ్మ అధికారం కోల్పోతే తాము అధికారంలోకి రావాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నార‌ని తెలుసా?? కానీ, ఇది నిజ‌మ‌ట‌! అమ్మ‌ను ఎంతో అభిమానిస్తున్నామ‌ని, […]

జ‌గ‌న్ మ‌ళ్లీ సేమ్ మిస్టేక్ రిపీట్‌

ఏపీ ఏకైక విప‌క్షం వైకాపా అధినేత జ‌గ‌న్‌.. వైఖ‌రిలో ఎక్క‌డా మార్పు క‌నిపించ‌డం లేదు. సాధార‌ణంగా ఎవరికైనా ఒక‌టి రెండు దెబ్బ‌లు త‌గిలితే వెంట‌నే వారిని వారు స‌రిచేసుకుంటారు. త‌మ పంథా మార్చుకుంటారు. కానీ, వైకాపా అధ్య‌క్షుడి విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ రావ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఎక్క‌డిక‌క్క‌డ.. ఆయ‌న అధికార పీఠ‌మే ల‌క్ష్యంగా చేస్తున్న వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే విసుగు పుట్టిస్తున్నాయి. ఏడాది కింద‌ట రాజ్ భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయిన […]

జయలలిత మరణంపై ఎన్నో సందేహాలు

జయలలిత మరణం తరువాత ప్రజలలో ఎన్నో సందేహాలు, అంతుపట్టని ప్రశ్నలు వెలుగు లోకి వస్తున్నాయి. వాటిలో భాగంగా జయలలిత మరణం సహజ మరణం కాదని, తన నమ్మిన బంటు అయిన శశికళ జయ హత్యకు కుట్ర పన్నారు అని వినికిడి. వాటిలో నిజం ఎంత వరకు ఎవరికీ తెలియదు, అలాగే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న 75 రోజులు జయ సొంత వారిని కుడా చూడనియ్యకుండా శశికళ అంత తానే అన్నట్టుగా వ్యవహరించింది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది […]

అమ‌రావ‌తి కోసం రాజ‌మౌళి డిజైన్లు

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో ఇంట‌ర్నేష‌న‌ల్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు. బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసింది. ఓ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో పేరు రావడం ఇదే మొదటి సారి. బాహుబలి సినిమాలోని మ‌హిష్మ‌తి సామ్రాజ్యం సెట్టింగులు, గ్రాఫిక్స్ అన్ని రాజ‌మౌళి విజ‌న్‌కు నిద‌ర్శ‌నంగా నిలిచాయి. భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై రాజ‌మౌళికి ఎంతో ప‌ట్టుంది. రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా చెపుతోన్న మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కిస్తే […]

క‌ళ త‌ప్పిన న‌ర‌సారావుపేట రాజ‌కీయం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఉన్న గుంటూరు జిల్లాలోని న‌ర‌సారావుపేట నియోజ‌క‌వ‌ర్గానికి రాజ‌కీయంగా ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. గ‌తంలో దివంగ‌త మాజీ సీఎం కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి లాంటి ప్ర‌ముఖులు ప్రాథినిత్యం వ‌హించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం…టీడీపీ ఆవిర్భావంతో మాజీ మంత్రి, ప్ర‌స్తుత స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావుకు కంచుకోట‌గా మారింది. కోడెల అక్క‌డ నుంచి 1983 నుంచి 2004 వ‌ర‌కు వ‌రుస‌గానే గెలుస్తూనే ఉన్నారు. ఆ త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లోను కోడెల ఓడిపోయి, కాసు వెంక‌ట కృష్ణారెడ్డి విజ‌యం సాధించి…కాంగ్రెస్ ప్ర‌భుత్వ […]

సీఎంగా జ‌య జీతం ఎంతో తెలుసా…ఇదీ ఓ రికార్డు

ప్ర‌భుత్వాధినేత‌లంటే వారి జీతాలు ల‌క్ష‌ల్లోనే ఉంటాయి. వారు ఎప్ప‌టిక‌ప్పుడు శాస‌న‌స‌భ‌లు, లోక్‌స‌భ‌ల్లో తీర్మానాలు చేయించుకుని మ‌రీ జీతాలు పెంచేసుకుంటారు. వారికి అన్నింట్లోను రాయితీలు ఉన్నా జీతాలు మాత్రం స‌రిపోవ‌ట‌. వీరి లెక్క ఎలా ఉన్నా త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మాత్రం ఈ విష‌యంలో ఎంతో ఉన్న‌త‌మైన వ్య‌క్తిత్వాన్ని చాటుకున్నారు. ఆమె సీఎంగా ప‌నిచేసిన‌న్ని రోజులు ఆమె నెల‌కు కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే జీతం తీసుకున్నారు. ఆమె సీఎం అయిన తొలినాళ్ల‌లో త‌న‌కు జీత‌మే వ‌ద్ద‌ని […]

తానాకి నారా కుటుంబంపై అంత ప్రేమెందుకో?!

అమెరికాలోని తెలుగు ఎన్నారైల‌లో ఓ వ‌ర్గం వారు పెట్టుకున్న తెలుగు అసోసియేష‌న్ తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా). ఈ సంస్థ అమెరికాలోని తెలుగు వారి సంక్షేమంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. దీంతో తానా సంస్థ‌కు ఎంతో పాపులారిటీ ఉంది. ఇక‌, ఈ తానాలో కార్య‌నిర్వాహ‌క స‌భ్యులుగా ఉండాలంటే పెద్ద క‌స‌ర‌త్తే ఉంటుంది. ఏదైనా రంగంలో నిష్ణాతులై.. తెలుగు భాష ప‌ట్ల ఎంతో కొంత సేవ చేసిన వారికి మాత్ర‌మే తానా స‌భ్య‌త్వం […]

అన్నాడీఎంకేలో భారీ చీలిక…!

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వేగంగా మారిపోయాయి! పూర్తి ఆరోగ్యంతో ఆస్ప‌త్రి నుంచి తిరిగి వ‌చ్చి అధికార ప‌గ్గాలు చేప‌డుతుంద‌ని భావించిన అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత క‌న్నుమూయ‌డం రాష్ట్రానికి ముఖ్యంగా పార్టీకి పెను దెబ్బ‌గా ప‌రిణ‌మించింది. మ‌రోప‌క్క‌, అధికార పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌డ‌మే త‌ప్ప త‌న త‌ర్వాత ఎవ‌రు ఈ పార్టీని లీడ్ చేయాలి? ఎవ‌రు న‌డిపించాలి? ఎవ‌రికి అన్నాడీఎంకే ప‌గ్గాలు అప్ప‌గించాలి? అనే అంశంపై జ‌య దృష్టి పెట్ట‌లేక‌పోవ‌డం కూడా ఇప్పుడు పెను ప‌రిణామాల‌కు, అన్నాడీఎంకే పార్టీ […]

శ‌శిక‌ళ సీఎం కాకుండా అడ్డుకుంది ఎవ‌రు..?

త‌మిళ‌నాడు సీఎంగా ఉన్న జ‌య‌ల‌లిత మృతి చెంద‌డంతో ఆమె స్థానంలో ఆమెకు న‌మ్మిన‌బంటు ప‌న్నీరు సెల్వం సీఎం అయ్యారు. జ‌య‌ల‌లిత త‌ర్వాత ఆమెకు ఎంతో స‌న్నిహితురాలు, అమ్మ నెచ్చెలిగా ఉన్న శ‌శిక‌ళ అమ్మ ప్లేస్‌ను ఎందుకు ఆక్ర‌మించ‌లేదు అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌మిళ‌నాట పెద్ద చ‌ర్చ‌కు తెర‌దీశాయి. ఎంజీఆర్ చ‌నిపోయిన‌ప్పుడు ప‌క్క‌నే ఉన్న జ‌య పార్టీలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. ముందుగా జ‌య‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఎంజీఆర్ స‌తీమ‌ణి జాన‌కీ రాంచంద్ర‌న్ సీఎం అయ్యారు. ఆ త‌ర్వాత […]