నిన్నటి వరకు తన పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వరుసగా జంప్ చేసేయడంతో షాక్‌ల మీద షాక్‌లతో బెంబేలెత్తిన వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఇప్పడిప్పుడే కాస్త జోష్‌లోకి వస్తున్నారు. కీలక జిల్లాలకు చెందిన ఇతర పార్టీల నేతలు, మాజీ మంత్రులు వైసీపీలోకి రావడంతో పాటు..మరికొందరు వైసీపీ వైపు చూస్తుండడంతో జగన్‌లో కొత్త జోష్ కనపడుతోంది. ఈ జోష్ అలా వచ్చిందే లేదో పార్టీలో ఓ మాజీ మంత్రి చిచ్చు జగన్‌కు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. బొత్స […]
Category: Politics
టీ అసెంబ్లీలో కేసీఆర్‌ను అడిగేవాడేడి..!
తెలంగాణ అసెంబ్లీలో హిట్ ఎవరు? ఫ్లాప్ ఎవరు? తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల అనంతరం పొలిటికల్ పండితులు పెట్టిన దృష్టి దీనిపైనే. వాస్తవానికి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలపై సభ వెలుపల కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. మల్లన్నసాగర్ మొదలుకుని ప్రగతి భవన్, డబుల్ బెడ్ రూం, హైదరాబాద్ రోడ్లు, రైతుల మరణాలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ఇలా అనేక విషయాలపై మీడియా గొట్టాలు పగిలిపోయేలా కేసీఆర్, ఆయన టీంపై విపక్ష […]
చంద్రబాబు – జగన్‌ను మేనేజ్ చేస్తోన్న ” మెగా “
ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం, దాని విధానాలపై విరుచుకుపడే జగన్.. తాజాగా ఓ విషయంలో మాత్రం ఎంతో మౌనాన్ని పాటిస్తున్నారు. అసలు ఆ విషయం తనకు తెలీదు అన్న విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయమే స్టేట్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలోకి వెళ్లిపోతే.. ఏపీ చేపడుతున్న ప్రతి పథకం, ప్రతి పనిపైనా వైకాపా అధినేత జగన్.. అండ్ కో పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయిందనే ఆరోపణలతో మైకు […]
టీ కాంగ్రెస్‌లో ఆ పదవి అంటేనే భయం…భయం
పదవి అంటే ఎవరికైనా ఎంత ఆశ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదవి వస్తుందంటే చాలు అది పార్టీ పదవి అయినా… ప్రభుత్వ పదవి అయినా నాయకులు ఆనందానికి అవధులు ఉండవు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఓ పదవి విషయంలో భయం భయంగా ఉంటున్నారట. ఆ పదవి మాకు వద్దే వద్దని తెగేసి చెప్పేస్తున్నారట. ఆ పదవి ఏంటో ? ఆ పదవి చేపట్టేందుకు ఎందుకు భయపడుతున్నారో చూద్దాం. ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్‌పర్సన్ […]
టీడీపీలోకి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు
పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వరుసగా జంప్ చేస్తున్నా వారిని ఆపే ప్రయత్నాలు చేయకుండా విపక్ష వైసీపీ అధినేత జగన్ మాత్రం దేవుడు కరుణిస్తే మరో ఆరు నెలల్లోనో, యేడాదిలోనో సీఎం అవుతానని మాత్రం చెపుతూ కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే తాము సొంతంగా ఎదగడం మానేసి, అధికార టీడీపీ మీద వ్యతిరేకత పెరగకపోదా…అదే మాకు కలిసొస్తుందన్న స్థితికి దిగజారిపోయింది. ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి అధికార పార్టీ […]
చంద్రబాబు ఎత్తును చిత్తు చేసిన కొడాలి నాని
కొడాలి నాని ఈ పేరు చెపితేనే ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్లలో ఒకడిగా రాజకీయవర్గాలకు గుర్తుకు వస్తాడు. కృష్ణా జిల్లా గుడివాడను దశాబ్దంన్నరగా శాసిస్తోన్న నానిది అక్కడ ఓన్లీ వన్ మ్యాన్ షో. పార్టీ ఏదైనా..పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా గెలుపు మాత్రం నానీదే. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు, ప్రస్తుతం వైకాపా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాని టీడీపీ వర్గాలకు బద్ధ శత్రువుగా మారాడు. నాని టీడీపీని వీడినప్పుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పటి […]
శశికళను తొక్కేందుకు బిగ్ స్కెచ్
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత అక్కడ రాజకీయం రోజుకో రంగు మారుతోంది. తెర మీద కనిపించే వార్తలకు.. తెర వెనుక జరిగే పనులకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. ముందుగా పన్నీర్ సెల్వం ఆఘమేఘాల మీద సీఎం అయ్యారు. తర్వాత జయ నెచ్చెలి శశికళ క్రమక్రమంగా పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సాధిస్తున్నారు. ఆమె సీఎం అయ్యే ప్లాన్‌లో భాగంగానే ఇదంతా చేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు […]
ఆ ఒక్క స్టెప్‌తో జగన్ చేతిలో చంద్రబాబు బుక్
ప్రపంచానికే మేధావినని, బిల్‌గేట్స్ లాంటి వాళ్లకి సైతం తాను గైడ్ చేసే రేంజ్‌లో ఉంటానని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఓ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు. అదికూడా నిత్యం తిట్టిపోసే వైకాపా అధినేత, విపక్ష నేత జగన్‌కి! ఇంకేముంది జగన్ ఊరుకుంటాడా? మరింతగా రెచ్చిపోయాడు. బాబు చేసిన తప్పును ఎత్తి చూపుతూ.. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా? అంటూ జగన్ విరుచుకుపడ్డాడు. విషయంలోకి వెళ్లిపోతే.. పెద్ద నోట్ల రద్దు అనంతరం […]
మాటలు సరే… రియల్ పాలిటిక్స్ ఎప్పుడు పవన్?!
ప్రశ్నిస్తాను! అంటూ 2014లో పొలిటికల్ అరంగేట్రం చేసిన పవన్.. ఈ రెండున్నరేళ్లలో ప్రశ్నించక.. ప్రశ్నించక.. ప్రశ్నిస్తున్న ప్రశ్నలు అందరికీ బోరుకొట్టిస్తున్నాయట!! ఏపీ పాలిటిక్స్‌లో గట్టి నేత దొరికాడురా దేవుడా అని అనుకుంటున్న జనానికి ఈ ప్రశ్నలు, ట్వీట్లు అర్ధం కాక.. జుట్టుపీక్కుంటున్నారట. వాస్తవానికి రాష్ట్రంలో నెట్ వాడేవారు పట్టణాల్లోనే అంతంత మాత్రం. ఇక, పల్లెటూళ్లలో పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో పొలిటిక్ పార్టీలను ఉద్దేశించి పవన్ చేస్తున్న ట్వీట్లను ఎంతమంది చూస్తున్నారు? ఎంతమందికి అవి అర్ధమవుతున్నాయి? […]