జనసేన అధినేత పవన్‌కల్యాణ్ `ఉద్దానం` సమస్యపై మరోసారి ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆయన డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే! అయితే ఈ సమస్యపై సీఎం వెంటనే స్పందించినా.. ఆ జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడంపై పవన్ తీవ్రంగా స్పందించారు. ఇదే సమయంలో అ చ్చెన్నపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సమస్య తీవ్రతను మంత్రి కంటే సీఎం బాగా అర్థం చేసుకున్నారని విమర్శించాడు. శ్రీకాకుళంలోని ఉద్దానంలోని కిడ్నీ సమస్యపై […]
Category: Politics
తమిళ సీఎం దీపానే…! శశికళకు షాకే
`అమ్మ`ను కోల్పోయిన తమిళవాసులకు సరికొత్త ఆశా`దీపం` దొరికింది. తమిళ రాజకీయాలను శాశించాలని కోరుకుంటున్న పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు దీప రూపంలో ఊహించని షాక్ ఎదురైంది. జయ అన్న కూతురు దీపకు ఆదరణ పెరుగుతోంది. రాజకీయాల్లోకి రావాలని ఆమెపై రోజురోజుకూ ఒత్తిడి అధికమవుతోంది. చెన్నై టీనగర్‌లోని ఆమె ఇంటికి ప్రతిరోజూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వచ్చి.. రాజకీయాల్లోకి రావాలని ఆమెను బతిమాలుతున్నారు. చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన `చిన్నమ్మ` […]
పవన్ ఉద్దానం టూర్‌కు టీడీపీ ఎమ్మెల్యే సాయం
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులను పరామర్శించేందుకు పర్యటించిన సంగతి తెలిసిందే. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం ఏదైనా చేయకపోతే తాను ప్రజా ఉద్యమాన్ని లేవదీసి…దానిని తానే స్వయంగా లీడ్ చేస్తానని కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే పవన్ శ్రీకాకుళం పర్యటనలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సాయం చేసినట్టు వార్తలు రావడం ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచలనమైంది. ఈ వార్తలు అధికార పార్టీలో పెద్ద కలకలం రేపాయి. […]
హేమ వైకాపా ఎంట్రీ ప్లాన్ ఇదేనా..
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ.. త్వరలోనే రాజకీయ రీ ఎంట్రీ చేస్తోందట. ఏపీ విపక్షం వైకాపాలోకి జంప్ చేయాలని ఆమె పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సన్నాహకంగానే ఆమె ఇప్పటి నుంచే రాజకీయ విమర్శలు ప్రారంభించేశారు. అది కూడా చిన్నా చితకా నేతను కాకుండా స్టేట్ వైడ్ పాపులర్ అవ్వాలని అనుకుందో ఏమో.. నేరుగా ఏపీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తూ.. విమర్శల బాణాలు సంధించింది. హేమ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి […]
గంటా పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
ఏపీ మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. దీనికి ఏ చంద్రబాబో. లేక మంత్రి వర్గ సహచరులో కారణం అనుకుంటే పొరపాటే. అసలు మంత్రి వర్గంతో సంబంధం లేని మెగాస్టార్‌తో ఇప్పుడు గంటాకు ఇబ్బందులు ఎదురు కానున్నాయట. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం గంటా పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందంగా మారిందట. ఇంతకీ విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ మూవీ ఖైదీ నెంబర్ 150.. […]
చిన్నమ్మను ఇరుకున పడేస్తున్న తమిళనాట రాజకీయాలు
తమిళనాడు అంతా ఇప్పుడు `చిన్నమ్మ` నామం జపిస్తోంది. దివంగత సీఎం జయలలిత తర్వాత.. ఆమె నెచ్చెలి శశికళ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎన్నుకున్న తర్వాత.. శశికళ సీఎం కావాలని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అందుకు రంగం కూడా సిద్ధమవుతున్న తరుణంలో శశికళకు ఊహించని, దిమ్మతిరిగే షాకులు తగిలాయి. ఇందులో ఒకటి జయ నియోజకవర్గమైన ఆర్ కే నగర్ నుంచి కాగా.. మరొకటి అమ్మ వీరాభిమాని నటరాజన్ నుంచి కావడం విశేషం!! జయ […]
ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి జగన్ అదిరిపోయే షాక్
వైకాపా అధ్యక్షుడు జగన్ ఏరి కోరి ఎంచుకున్న విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌పై జగన్ తీవ్రంగా సీరియస్ అయ్యారనే వార్తలు చాలా ఆలస్యంగా వెలుగు చూశాయి. వాస్తవానికి ఎంతో మంది వ్యతిరేకిస్తున్నా.. జగన్ అమర్‌నాథ్‌కి జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఎందరో సీనియర్లను కాదని విశాఖ వంటి మేజర్ సిటీని అమర్‌నాథ్ చేతుల్లో పెట్టారు. అయితే, మొదట్లో సౌమ్యంగానే ఉన్న అమర్‌నాథ్.. ఇప్పడు మాత్రం.. ఏకు మేకైన చందంగా మారిపోయాడని, దీంతో జగన్ క్లాస్ ఇచ్చాడని […]
సీఐడీ ఉచ్చులో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు
ప్రతిపక్ష వైసీపీకి చుక్కలు చూపించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. ఒకపక్క పార్టీ అధ్యక్షుడు జగన్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే! మరోపక్క ఆ పార్టీ బలంగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఐడీ ఉచ్చులో చిక్కుకున్నారు. కల్తీ మద్యం కేసులో వీరిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఎన్నికల్లో మద్యం పంపిణీ చేశారని ఇందులో పేర్కొంది. దీంతో ఏ క్షణమైనా వీరిని అరెస్టు చేయవచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇది వైసీపీలో తీవ్ర […]
కేసీఆర్‌కి మరోసారి హైకోర్టు జలక్!
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హైకోర్టు నుంచి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాష్ట్ర భూసేకరణ చట్టంపై హైకోర్టు అక్షింతలు వేసింది. ఏకపక్షంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతులకు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించడంతోపాటు దీని అమలుపై స్టే విధించింది. ఇది కేసీఆర్ సర్కారుకు శరాఘాతమనే చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే.. రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత తన దంటూ ప్రత్యేక పాలన ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే […]