చిరు-పవన్ రాజకీయ లెక్క ఇదే

`ఇక నుంచి సంవ‌త్స‌రానికి ఒక సినిమా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నా. ఇప్ప‌టికే రెండు సినిమాలు కూడా చేయ‌బోతున్నాను.` అని అన్న‌య్య చిరంజీవి ప్ర‌క‌టించారు. `ఇక సినిమాలు చేయ‌ను. త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తా` అంటూ త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వెల్ల‌డించాడు! ఒక‌రు.. పార్టీని స్థాపించి సీట్లు గెలుచుకుని రాజ‌కీయ కార‌ణాల‌తో అధికార పార్టీలో ఆ పార్టీ క‌లిపేస్తే.. మ‌రొక‌రు పార్టీ స్థాపించి పోటీచేయ‌కుండా టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి ఇప్పుడు నెమ్మ‌దిగా ఆయా […]

టీడీపీ టైగర్ పై సొంత పార్టీలోనే సెగలు

కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే చింత‌మ‌నేనిపై సొంత పార్టీలోని నేత‌లే భ‌గ్గుమంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జిల్లాలో ఎదురులేకుండా పోతున్న చింత‌మ‌నేనికి సొంత నేత‌ల నుంచి ఎదురుదెబ్బ‌ ఎదురైంది! నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ఈ ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు. అధికారులు, ప్ర‌జ‌ల‌పై నోరు పారేసుకుంటూ దురుసుగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌నపై ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అధికార ప్ర‌తినిధి తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు చింత‌మ‌నేని అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆరోపించారు. టీడీపీ టైగ‌ర్‌గా పేరున్న చింత‌మ‌నేనిపై అధికార పార్టీకే చెందిన […]

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా..!

ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు రాజ‌కీయ నాయ‌కులు ర‌క‌ర‌కాల వ్యూహాలు ర‌చిస్తారు. వాటిలో కొన్ని అనూహ్యంగా, ఆశ్చ‌ర్యంగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వ్యూహాన్నే ఆప్ అధినేత కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు. ఢిల్లీతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఆప్‌ను విస్తృతం చేసేందుకు ఆయ‌న ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు. అందుకే పంజాబ్ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో ఆప్ సీఎం అభ్య‌ర్థిగా ఆయ‌న కేజ్రీవాల్ బ‌రిలోకి దిగుతార‌నే ప్ర‌చారం జోరందుకుంది. అయితే దీని వెనుక పెద్ద రీజ‌న్ ఉంద‌ట‌. సామాన్యుడిగా […]

ముద్ర‌గ‌డ దూకుడుకు బ్రేకులు

కాపు ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం దూకుడుకి సీఎం చంద్ర‌బాబు త‌న‌దైన స్టైల్‌లో బ్రేకులు వేస్తున్నారు. అడుగ‌డుగునా ముద్ర‌గ‌డ‌కు చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని వ్యూహాల‌ను అనుస‌రిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావ్ స‌హా కొంద‌రు సీనియ‌ర్ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించిన చంద్ర‌బాబు తాజా గా ఈ డ్యూటీని మంత్రుల‌కే అప్ప‌గించార‌ని అనిపిస్తోంది. మూకుమ్మ‌డిగా రాష్ట్ర మంత్రులు ముద్ర‌గ‌డ‌పై విరుచుకుప‌డ‌డం దీనికి బ‌లం చేకూరుస్తోంది. వాస్త‌వానికి మంత్రుల స్థాయిలో ముద్ర‌గ‌డ‌పై […]

ప‌రిటాల అనుచ‌రుడికి షాక్ త‌ప్ప‌దా..!

అనంత‌పురం టీడీపీలో ఆధిప‌త్య రాజ‌కీయాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి ప‌రిటాల సునీత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు.. పీక్ స్టేజ్‌కి చేరే టైం వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంపై టీడీపీ స్థానిక నేత‌ల్లో అంత‌ర్గ‌త యుద్ధం రాజుకుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది? ఈ పోరులో కాల్వ వ‌ర్గం పైచేయి సాధిస్తుందా? ప‌రిటాల పైచేయి సాధిస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. 2014లో జ‌రిగిన జడ్‌పీటీసీ ఎన్నిక‌ల్లో […]

కేసీఆర్‌పై తెలంగాణ డైరెక్ట‌ర్ ఫైర్‌

తెలంగాణ ఉద్య‌మ నేత‌, సీఎం కేసీఆర్‌పై టాలీవుడ్‌లోని తెలంగాణ వ‌ర్గం తీవ్ర‌స్థాయిలో ఫైరైపోతోంది. తాము ఏ ల‌క్ష్యంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామో సీఎం కేసీఆర్ మ‌రిచిపోతున్నార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు సంధించింది. తాజాగా బాల‌య్య న‌టించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి మూవీకి సీఎం కేసీఆర్ వినోద ప‌న్నును మిన‌హాయించ‌డంపై తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మండిప‌డుతోంది. ఆంధ్రావాళ్ల‌పై సీఎం కేసీఆర్‌కి రోజురోజుకీ ప్రేమ పెరిగిపోతోంద‌ని, వాళ్లు ఏదైనా ప్ర‌పోజ‌ల్‌తో సీఎం క‌లిస్తే.. వెంట‌నే ప‌నులు అయిపోతున్నాయ‌ని, తెలంగాణ కోసం […]

ప‌వ‌న్ దెబ్బ‌కు కేంద్రం కూడా దిగివ‌చ్చింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఏంటో రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడిప్పుడే తెలిసి వ‌స్తోంది. వెండితెర మీద ప‌వ‌న్ తిరుగులేని రారాజు అయినా పాలిటిక్స్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ప్ర‌త్యేక హోదా కోసం స‌మావేశాలు పెట్టి జ‌నాల్లోకి చొచ్చుకుపోతోన్న ప‌వ‌న్ తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆ జిల్లాలో ప‌ర్య‌టించి వారితో స‌మావేశ‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ బాధితుల‌కు ఏం చేస్తుందో చెప్పాలంటూ 48 గంట‌ల పాటు అల్టిమేటం జారీ చేశారు. వెంట‌నే […]

ములాయం – అఖిలేష్ మ‌ధ్య వియ్యంకుడి రాజీ

ఎన్నిక‌లు ముంచుకొచ్చిన వేళ‌.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అధికార పార్టీ ఎస్పీలో నెల‌కొన్న ముస‌లానికి పార్టీ చీఫ్ ములాయం సింగ్ ఉర‌ఫ్ నేతాజీ ముగింపు ప‌ల‌కాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. త‌న పెద్ద కొడుకు.. యూపీ సీఎం అఖిలేష్‌ను మొండివాడిగా పేర్కొంటూ.. తాను ఓ ప‌రిష్కారానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి గ‌డిచిన ఆరు నెలలుగా ఎస్పీ అధికార పార్టీలో పెద్ద ఎత్తున ఆధిప‌త్య పోరు పెరిగింది. మంత్రిగా ఉన్న సొంత బాబాయి శివ‌పాల్ యాద‌వ్‌ను తొల‌గిస్తూ.. అఖిలేష్‌ తీసుకున్న‌ నిర్ణ‌యం […]

ఏపీ మండ‌లికి చైర్మ‌న్‌గా రెడ్డి వ్య‌క్తి..!

కొన్ని రోజులుగా వైసీపీ నేత కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌ రెడ్డికి పెద్ద పద‌వి క‌ట్ట‌బెట్టేందుకు అధినేత చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రెడ్డి సామాజిక‌వర్గానికి చెందిన నేత‌కు ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా వారికి కూడా త‌గినంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని తెలియ‌జేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నార‌ట‌. అలాగే నెల్లూరులో వైకాపాకి చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. దీంతో శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ అభ్య‌ర్థిగా సోమిరెడ్డిని ఎంపిక చేయ‌నున్న‌ట్లు […]