“ఏడాదికి రూ.5 వేల కోట్లు ఇస్తున్నాను. ఇంత భారీ బడ్జెట్ ఇస్తున్న శాఖ ఏదైనా ఉంటే చూపించండి. అయినా కూడా మీరు కష్టపడడం లేదు. స్కూళ్లు ప్రారంభమై నాలుగు నెలలు పూర్తవుతున్నాయి. అయినా కూడా కనీసం బయో మెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేయలేక పోయారు. బయోమెట్రిక్ మిషన్ల టెండర్ల విషయంలోనూ మీకు క్లారిటీ లేదు. మధ్యా హ్న భోజనం వండే ఏజెన్సీలకు సిలెండర్లను సరఫరా చేయమన్నాం అది కూడా మీరు పట్టించుకోలేదు. ఇంత చిన్న చిన్న విషయాలకే […]
Category: Politics
యనమలను టెన్షన్ పెడుతున్న రెడ్డి గారు ఎవరు..!
టీడీపీని బలోపేతం చేయాలని ఆపార్టీ అధినేత చంద్రబాబు ఒకపక్క పిలుపునిస్తున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కూడా ఆహ్వానం పలకాలని, ఈ విషయంలో సీనియర్లు సహకరించాలని పార్టీ వర్క్ షాపు పెట్టి మరీ ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్, వైసీపీల నుంచి వచ్చే వారికి ఎలాంటి పరిస్థితిలోనూ అడ్డు చెప్పొద్దని ఆయన అన్నారు. అయితే, సాక్షాత్తూ.. ఆర్థిక మంత్రి, బాబుకు రైట్ అని పిలిపించుకునే యనమల […]
చంద్రబాబు డెసిషన్… పయ్యావుల ఇగో హర్ట్
టీడీపీ సీనియర్‌నేత, అనంతపురం ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు సొంత పార్టీలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అనంత పురం జెడ్పీ చైర్మన్ విషయంలో పయ్యావుల పావులు కదిపి.. దానిని తన అనుచరుడి చేతిలోనే పదిలంగా ఉంచాలని ప్రయత్నించినా.. ఆయన ప్రయత్నాలు ఒక్కటీ సాగకపోగా.. ఎదురు దెబ్బే తగిలింది. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. దీనిని ఇన్‌చార్జి చైర్మన్ నిర్వహిస్తున్నాడు. ఈ ఇన్‌చార్జ్ పయ్యావుల ప్రధాన అనుచరులు. ఈ క్రమంలోనే దీనికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించి […]
జేసీ రాజానామాకు ఆ ఇద్దరే కారణమా..!
పొలిటికల్ ఫైర్ బ్రాండ్, అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సృష్టించిన సంచలనం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తన పదవికి నిన్నటికి నిన్నే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యానని, అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో వెనక్కి తగ్గానని, తనకు అస్సలు ఈ పదవిలో ఒక్క క్షణం కూడా ఉండేందుకు ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం లేదా వీలైతే మంగళవారే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి పెద్ద సంచలనానికి తెరదీశారు. […]
బాలయ్య ఎమ్మెల్యేగా గ్రాఫ్ ఎలా వుంది..2019లో గెలుస్తాడా?
తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్ వజ్రపుకోట. పార్టీ పెట్టిన ఈ మూడున్నర దశాబ్దాల్లో ఇక్కడ పార్టీ ఒక్కసారిగా కూడా ఓడిపోలేదు. కర్ణాటకకు సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో హిందూపూర్ పురపాలక సంఘంతో పాటు మండలం, చిలమత్తూరు, లేపాక్షి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2.16 లక్షలు. ఇక్కడ మైనార్టీలు, బీసీల ప్రాబల్యం ఎక్కువ. 1952లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గ రాజకీయం గురించి మాట్లాడుకోవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు […]
గుడివాడలో పండగ చేస్కొంటోన్న కొడాలి నాని… అసలు కథ ఇదే
అధికార పార్టీ నేతలు తన్నుకుంటుంటే.. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పండగ చేసుకుంటన్నారు. పాలిటిక్స్‌లో మనం బలపడాలంటే.. ఒక్క మన బలమే అక్కర్లేదు.. ఎదుటి వాడి వీక్ నెస్ కూడా మనకు బలమే! ఇప్పుడు నాని.. ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో ఈయనపై స్థానికంగా వ్యతిరేకత వచ్చింది. పార్టీ కార్యాలయం కోసం అద్దె కు తీసుకున్న ఇంటిని ఖాళీ చేయకపోగా యజమానిపై దౌర్జన్యానికి పాల్పడ్డ విషయం రచ్చ రచ్చ చేసింది. దీనివల్ల […]
అమరావతిపై అబద్ధపు ప్రచారానికి రాజమౌళి చెక్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైనింగ్ కోసం ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళిని ఏపీ సీఎం చంద్రబాబు కన్సల్టెంట్‌గా, డిజైనర్‌గా నియమించారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా రాజమౌళి చంద్రబాబును కలవడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. రాజమౌళి చంద్రబాబుతో పాటు లండన్ వెళతారని, రాజమౌళికి చంద్రబాబు ఇందుకోసం భారీ డీల్ ఇచ్చారని ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అమరావతిని రాజమౌళికి ఇచ్చేసిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును మరో టాప్ దర్శకుడు వి.వి.వినాయక్‌కు అప్పగిస్తారంటూ సెటైర్లు కూడా పడ్డాయి. తనపై వస్తోన్న […]
ఉత్తమ్‌కి పదవీ గండమా?
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు పదవీ గండం భయం పట్టుకుందట. దీంతో ఆయన వాస్తు నియమాలు పాటిస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వాస్తును నమ్మిన విషయం తెలిసిందే. వాస్తు భయంతోనే ఆయన బంగారాలంటి సచివాలయాన్ని త్వరలోనే కూలగొట్టి అధునాతనంగా నిర్మించుకుంటున్నారు. ఇక, ఇప్పుడు ఇలాంటి వాస్తు భయమే ఉత్తమ్‌నీ వెంటాడుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన పీసీసీ పదవికి […]
షాక్.. ఎంపీ పదవికి జేసీ రాజీనామా!
అనంతపురం ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వార్త ప్రకటించారు. వచ్చే మంగళ లేదా బుధవారాల్లో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన బాంబు పేల్చారు. ఎవరూ ఎన్నడూ ఊహించని విధంగా జేసీ ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉలికిపాటు వచ్చింది. ఈ సంచలన ప్రకటన వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ ప్రతి ఒక్కరూ ఆలోచించారు. అయితే, ఇది తన సొంత నిర్ణయమని, దీనిలో ఎవరి ఒత్తిడీ లేదని జేసీ […]