అపార రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబుతో నాయకులు పోటీ పడాలంటే కొంత ఆలోచించక తప్పదు! మరి ఇప్పుడు కొంతమంది నాయకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఏ విషయంలో అంటారా? వారసులను రంగంలోకి దించడంలో!! ప్రస్తుతం వారస్వత రాజకీయాలు ఏపీలో జోరందుకున్నాయి! ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండటంతో.. తమ వారసులను రంగంలోకి దించేస్తున్నారు నాయకులు! ముఖ్యంగా టీడీపీలో తరాలు మారే సమయం వచ్చిందేమో అనిపించక మానదు! యువరక్తాన్ని నింపేందుకు సీఎం చంద్రబాబుతో సహా ఇతర నేతలు […]
Category: Politics
జగన్ నయా ప్లాన్‌కు సూపర్ రెస్పాన్స్
వైసీపీ అధినేత, ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ఏపీ ప్రజలకు చేరువ కావాలనుకుని వేసిన ప్లాన్ అదిరిందనే టాక్ వినిపిస్తోంది. 2014లో కొంచెంలో మిస్సయిపోయిన సీఎం పీఠాన్ని 2019లో ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాది నుంచి ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్‌ను ఇంపోర్టు చేసుకుని మరీ ఇప్పటి నుంచే అప్పటి ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పీకే ఇచ్చే సలహాలను తూ.చ. తప్పక పాటిస్తున్నారు. ఈ […]
టీడీపీ-బీజేపీ పొత్తు చిత్తు… ఆ టీడీపీ లీడరే కారణమా..!
టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అటు టీడీపీ పెద్దలతో పాటు.. బీజేపీ నేతలకు తలనొప్పులు తెచ్చిపెడు తోంది. ఆయన దూకుడిగా వ్యవహరిస్తున్న తీరు.. మిత్ర బంధానికి బీటలు వారేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా రో లేదా సొంతంగానే బరిలోకి దిగుతారో తెలియని సందిగ్ధంలో ఉంటే ఉరుములేని పిడుగులా ఆయన చేసిన వ్యాఖ్యా లు.. పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసేస్తున్నాయి! టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని ఆయన విమర్శిస్తున్న తీరు ఇప్పు డు టీడీపీ, […]
ఏపీలో ఆ మంత్రిగారి శాఖలో అవినీతి కంపు..!
ప్రతిష్టాత్మక వైద్య విద్యా శాఖలో అవినీతి కంపు కొడుతోందని సోషల్ మీడియా సహా పలు వెబ్ సైట్లలో కథనాలు తండోప తండాలుగా వస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే అవినీతి తాండవిస్తోందని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్న సదరు సైట్లు ఇప్పుడు టీడీపీ మిత్ర పక్షం బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ చూస్తున్న వైద్య విద్యా శాఖలోనూ అవినీతి మలేరియాలా విస్తరిస్తోందని కథనాలను పోస్ట్ చేశాయి. నిజానికి అవినీతికి, ఆరోపణలకు ఆమడం […]
టీడీపీలో ఎంపీ వర్సెస్ లేడీ ఎమ్మెల్యే నువ్వా… నేనా..!
ఏపీలో అధికార టీడీపీలో నాయకుల మధ్య కుమ్ములాటలు పీక్స్‌కు చేరిపోయాయి. ఇటు చంద్రబాబు నిత్యం ఇతరత్రా పనులు, సమీక్షలతో బిజీగా ఉంటే నాయకుల, ప్రజాప్రతినిధులు మాత్రం నిత్య కలహాలతో బిజీగా ఉంటున్నారు. చివరకు చంద్రబాబు సైతం వీరి మధ్య కుమ్మలాటలు పరిష్కరించేలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందంటే ఈ అంతర్గత కలహాలు ఎంతవరకు వెళ్లాయో అర్థమవుతోంది. ఏపీలోని 13 జిల్లాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు మధ్య […]
బాబుకు షాక్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ
ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత రాజకీయ తూకంలో ముల్లు మొగ్గంతా టీడీపీ వైపే ఉంది. వైసీపీకి చెందిన ఓ 15 మంది వరకు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లిస్టులో చాలా మంది పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ స్టోరీ ఇలా ఉంటే ఇప్పుడు టీడీపీకి ఓ రివర్స్ గేర్ వార్త షాక్ ఇస్తోంది. వైసీపీ కంచుకోట లాంటి జిల్లాలో టీడీపీ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ […]
మహాటీవీ అమ్మేశారు…. డీల్ ఇదే
ఏ వ్యక్తినైనా ఆకాశానికి ఎత్తేయాలన్నా.. అదే వ్యక్తిని పాతాళానికి తొక్కేయాలన్నా.. ప్రసార మాధ్యమం ఒక్కటి చాలు! ఇప్పుడు దాదాపు తెలుగులో ఉన్న టీవీ చానెళ్లు అన్నీ అదే పనిచేస్తున్నాయి. దీంతో పొలిటికల్‌గా టీవీలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తాము ఎలివేట్ అయ్యేందుకు ఏకైక ప్రసార మాధ్యమంగా ఎక్కువ మంది టీవీలనే నమ్ముకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో విచ్చలవిడిగా టీవీ ఛానళ్ల రాక ప్రారంభమైన కొత్తలో తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులతో అడుగు పెట్టింది మహా టీవీ. […]
స్వీయ పరీక్షకు కేసీఆర్ వెనక్కి!
తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేసినా సంచలనమే. గొర్రెలు, బర్రెలు పంచి జనాన్ని ఉద్యోగాల గోల నుంచి తప్పించినా.. మహిళలకు చీరలు పంచి అనేక సమస్యలకు మసి పూసినా.. కేసీఆర్‌కే చెల్లింది. ఇక,తాజాగా తనపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్, బీజేపీ సహా విపక్షాలకు ఫీజు పీకేయాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. ఈ క్రమంలో తనకు తానే పరీక్ష పెట్టుకోవాలని భావించారు. నల్లగొండ ఎంపీ సీటును ఖాళీ చేయించి ఉప ఎన్నిక నిర్వహించడం ద్వారా తన సత్తా […]
చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే
ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవల కాలంలో మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా సదావర్తి భూముల విషయంలో తీవ్ర వివాదానికి కారణమైన ఈ వైసీపీ నేత ప్రభుత్వంతో మూడు చెరువుల నీళ్లు తాగించారు. 86 ఎకరాల సత్రం భూములను రూ.22 కోట్లకు విక్రయించడాన్ని తప్పుబడుతూ.. ఆయనే స్వయంగా రూ.5 కోట్లు అదనంగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో.. హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టులు కూడా జోక్యం చేసుకుని తిరిగి వేలం నిర్వహించడం తెలిసిందే. అలా.. ప్రభుత్వం […]