అవును! ఆశ్చర్యంగా అనిపించినా.. వివిధ తెలుగు టీవీ ఛానెళ్ల పరిస్థితి దారుణంగా ఉందట! ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని సమాచారం. తెలుగు వాకిట వార్తల సమాహారంతో సందడి చేసే ఈ న్యూస్ ఛానెళ్లలో ఓ నాలుగు తప్ప మిగిలినవి అన్నీ కూడా చాలా చాలా కష్ట నష్టాల్లో కూరుకుపోయాయని చెబుతున్నారు. ఇక, కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న వాటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీనికి ప్రధాన కారణం యాడ్ రెవెన్యూ లేకపోవడమే! సాధారణంగా ప్రింట్ […]
Category: Politics
నల్గొండ బైపోల్‌పై కేసీఆర్ పునరాలోచన!
నల్గొండ ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి రాజీనామాపై టీఆర్ఎస్ వర్గాల్లో భిన్న చర్చలు నడుస్తున్నాయి. ఆయనతో రాజీనామ చేయించి.. ఉప ఎన్నిక నిర్వహించి.. అందులో గెలిచి విపక్షాలకు షాక్‌తో పాటు టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపాలని తెలంగాణ సీఎం కేసీఆర్.. నిర్ణయించారనే వార్తలు పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే ఈలోగానే సింగరేణి ఎన్నికలు రావడం.. ఇక సార్వత్రిక ఎన్నికలు కూడా అనుకున్న సమయానికంటే ముందుగానే వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో.. ఇప్పుడు నల్గొండ ఉప ఎన్నికలపై కేసీఆర్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది! […]
చినబాబు డైరెక్షన్‌లో మంత్రికి వ్యూహాత్మక చెక్
యనమల రామకృష్ణుడు.. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు! ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. ఆయన వెంటనే నడుస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను శాసిస్తూ చక్రం తిప్పుతున్నారు. అయితే మంత్రి వర్గంలోకి చంద్రబాబు తనయుడు వచ్చాక.. పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయనే చర్చ మొదలైంది. ముఖ్యమైన నేతలందరూ ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పార్టీలోని సీనియర్లకు కొన్ని విషయాల్లో చెక్ తప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. లోకేష్ దెబ్బ ఇప్పుడు యనమలకు బాగా తగులుతోందట. జిల్లాలో ఆయన […]
కేసు పోయింది.. ఇక టీడీపీతో సంబంధమేంటి!!
అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్టీ కాదంటూ టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే! ఆ సమయంలో ఆమె చిక్కుల్లో పడ్డారు. అయితే ఆమె టీడీపీకి సానుకూలంగా వ్యవహరిస్తుండటంతో వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి.. సమస్యను పరిష్కరించారు. సంధ్యారాణి వేసిన పిటిషన్ వెనక్కుతీసుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమె టీడీపీ అధినేతకు షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆమె.. యూ టర్న్ […]
టీఆర్ ఎస్‌లో షాక్: ఈ 25 మంది సిట్టింగులు ఇంటికే!
అవునట! తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ డెసిషన్ తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి కేసీఆర్ ఒక డెసిషన్ తీసుకుంటే.. `అంతే!` అనే మాట ఉన్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2019 ఎన్నికలు త్వరలోనే రానున్నాయి. దీనికిగాను ఇప్పటి నుంచే హడావుడి మొదలైన విషయం తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్.. సిట్టింగులకు సీట్లు ఇవ్వాలా? లేక కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా? అని కేసీఆర్ […]
బాబు భయపడుతున్నారా..? బాబుకు ఎందుకు భయం..?
అవును! బాబు భయపడుతున్నారా? ఆయనకు ఎందుకు భయం? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలనే కాదు, ఉన్నతస్థాయి అధికారులను సైతం వేధిస్తున్నాయి. ఏ చిన్న తేడా వచ్చినా సొంత అన్నదమ్ములే.. తగువులు పెట్టుకుని న్యాయ పోరాటానికి దిగుతున్న రోజులు ఇవి! మరి అలాంటిది విశాల జన హితం ముడిపడిన ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీళ్లు వంటి వాటి విషయంలో బాబు ఎందుకు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మిత్రపక్షం అంటే […]
టీడీపీ కంచుకోటలో వైసీపీకి ఊపొచ్చిందే
వరుస వైఫల్యాలతో కునారిల్లుతున్న ఏపీ ప్రతిపక్షం వైసీపీలో అనూహ్యంగా ఊపొచ్చింది. అధికార టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేతలు ఇప్పుడు జగన్ చెంతకు చేరుతున్నారు. ఈ పరిణామాన్ని అసలు వైసీపీ నేతలు ఎవరూ ఊహించలేదు. దీంతో వారు ఒక్కసారిగా ఇప్పుడు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ హవా అంతా ఇంతా కాదు. వైసీపీ పెద్ద బలంగా లేదు. మొన్నటికి మొన్న తూర్పోగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన […]
ఏపీ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పార్టీలకు సంబంధించి నేతలు ఒక్కొక్కరు ఒకే విధంగా కామెంట్లు కుమ్మరిస్తున్నారు. పొత్తులపై ఇప్పటి నుంచే నేతలు పెద్ద పెద్ద చర్చలు కూడా చేపట్టారు. మొత్తంగా ఈ కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది అనే వార్తలైతే పెద్ద ఎత్తున వస్తున్నాయి. బీజేపీతో పొత్తు వద్దంటే వద్దని టీడీపీ నేతలు చెబుతున్నారట. ఇక, టీడీపీతో పొత్తు వద్దని ఇప్పటికే బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున […]
కేసీఆర్‌కు పోటీగా ప్రియాంక
విభజన తర్వాత ఏపీలో అస్థిత్వం కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే.. తెలంగాణలో మాత్రం అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ అంతా టీఆర్ఎస్‌కు దక్కడం కాంగ్రెస్ హైకమాండ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఈసారి ఎలాగైనా తెలంగాణ ప్రజల ఆదరణ సంపాదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు!! అయితే ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఐకమత్యం లోపించడంతో పాటు సీఎం కేసీఆర్ ను డీకొనే సరైన వ్యక్తి లేరని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ […]