దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేటి ఉదయం మొదలైన సంగతి తెలిసిందే. అయితే అందరి చూపు తమిళనాడుపైనే ఉంది. రాష్ట్రంలోని 234 స్థానాలకూ నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా.. నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ అయింది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ జోరు జోరుగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ […]
Category: Politics
వైరల్: తీన్మార్ స్టెప్పుతో రెచ్చిపోయిన శృతి..!?
త్వరలో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేశారు. విశ్వనటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. అయితే కమల్‌కు మద్దతుగా సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ […]
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్!
కంటికి కనిపించకుండా ప్రజలను నానా తంటాలు పెడుతున్న కరోనా వైరస్.. మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ క్యార్యక్రమం కూడా జోరుగానే జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్ […]
ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన బాలయ్య..ఎందుకోసమంటే?
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫోన్ చేశారు. ఎందుకూ.. ఏమిటీ.. అన్న వివరాలు తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవల రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ కూడా రోజా కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. […]
సొంత పార్టీ గుర్తునే విసిరికొట్టిన కమల్..నెటిజన్లు ఫైర్!
తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతా హడావుడి నెలకొంది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుండగా.. రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కమల్ కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కోయంబత్తూరు నియోజకవర్గంలో తరచూ ఆయన పర్యటిస్తున్నారు. మంగళవారం భారీ […]
టీడీపీలోకి ఎన్టీఆర్..బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..తన ప్రసంగాలతో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు తమ్ముళ్లతో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల వైపు మొగ్గు చూపడం లేదు. […]
కేసీఆర్ భారీ వ్యూహం.. మంత్రివర్గంలోకి కవిత..?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత అఖండ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్ఎస్ మొదటి నుంచీ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. దీంతో మొత్తం స్థానిక సంస్థలకు చెందిన ఓటర్లు 824 మంది ఉన్నారు. అయితే ఇందులో 821 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వాటిలో టీఆర్ఎస్ […]
నందుల గోల.. లోకేష్‌పై నిప్పులు చెరిగిన పోసాని
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలు తీవ్ర వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. నందులకు కులాలను కూడా ముడిపెడుతూ కామెంట్లు వచ్చాయి. ఇక, రాజకీయాలతోనూ నందులను ముడిపెట్టి ఏకేశారు. ఇక, ఈ వివాదం సర్దుమణుగుతుందని అనుకుంటున్న తరుణంలో సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్.. చేసిన కామెంట్లు చల్లారుతున్న మంటను ఎగదోసినట్టయింది! సోమవారం ఆయన నంది అవార్డులపై కామెంట్లు చేశాడు. ఎక్కడో(హైదరాబాద్)లో ఉండి నందులపై కామెంట్లు చేయడం కాదు అంటూ హీరోలు, దర్శకులు, నిర్మాతలపై కామెంట్లు కుమ్మరించాడు. […]
అమ్మా లక్ష్మీపార్వతీ… డబుల్ టంగ్ కామెంట్లు ఎందుకమ్మా?!
అన్నగారు ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన పై సినిమా తీస్తున్న వారి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంలోనే లక్ష్మీపార్వతి రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. విషయంలోకి వెళ్తే.. అన్నగారి జీవిత చరిత్ర ఆధారంగా మొత్తం మూడు సినిమాలు తెరంగేట్రం చేయనున్నాయి. వీటిలో ఒకటి బాలయ్య, రెండు వర్మ, మూడు కేతిరెడ్డి ఉన్నారు. వీరంతా ఎన్టీఆర్ జీవితంలో వివిధ కోణాలను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు […]