దేశవ్యాప్తంగా అందరి చూపు ప్రస్తుతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైనే ఉన్నాయి. అక్కడ ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగాయి. బీజేపీ, టీఎంసీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడుస్తున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఇరు పార్టీల మధ్య స్వల్ప సంఖ్యలోనే తేడాలు ఉండడంతో మరింత ఉత్కంఠత రేపుతున్నది. మొత్తంగా 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర కాక రేపుతున్నాయి. క్షణం క్షణం ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఆది నుంచి టీఎంసీ […]
Category: Politics
తమిళనాడులో జోరుగా కౌంటింగ్..వార్ వన్‌సైడ్ చేస్తున్న డీఎంకే కూటమి!
తమిళనాడు రాష్ట్రంలో ఎవరు సీఎం పీఠం ఎక్కించబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. కొద్ది సేపటి క్రీతమే కౌంటింగ్ ప్రారంభం కాగా.. మరి కొన్ని గంటల్లో ఫలితాలపై స్పష్టత రాబోతుంది. తమిళనాడులో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో నిలిచాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(దినకరన్ పార్టీ) గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశాయి. అలాగే సినీ నటుడు కమల్‌హాసన్ కూడా మకల్క నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి.. బరిలోకి దిగారు. అయితే వార్ […]
ఫస్ట్ రౌండ్ రిజల్ట్ తో పనబాక షాక్.. కౌంటింగ్ కేంద్రం నుంచి..
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. వార్ వన్ సైడే అన్నట్లుగా ఉంది పరిస్థితి. వైఎస్ ఆర్సీపీ దూసుకుపోతున్నది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, […]
కేసీఆర్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు..!
అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఒక్కసారిగా మంత్రి ఈటల రాజేందర్ హాట్ టాపిక్‌గా మారారు. దీంతో కేసీఆర్‌తో దీర్ఘకాలంగా ఉన్న అనుబంధం ఒక్కసారిగా తెగిపోయింది. పైకి గంభీరంగా కనిపిస్తున్నా అనూహ్య పరిణామాలతో ఆయన దిక్కుతోచని స్థితికి గురయ్యారు. షామీర్‌పేట ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన మంత్రి ఈటల రాజేందర్ ఒక పత్రికతో తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదని, కానీ వంద శాతం […]
టీడీపీలో తీవ్ర విషాదం.. కరోనాతో మాజీ ఎమ్మెల్సీ మృతి!
కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరూ బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తెలుగు దేశంలో పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది కరోనా. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఇటీవలె ఈయన కరోనా బారిన పడతా.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో […]
తిరుపతి ఉప ఎన్నిక..షురూ అయిన కౌంటింగ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి ఉపఎన్నికల ఫలితాలు ఈ రోజే వెలువడనున్నాయి. కొద్ది సేపటి క్రితమే కౌంటింగ్ షురూ అయింది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ ప్రక్రియను నిర్వహిస్తామని.. సాధ్యమైనంత తక్కువ మందిని మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొంది. అందుకే అనుగుణంగానే […]
నేడే ఓట్ల లెక్కింపు..అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే?!
దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరిచి లెక్కించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్‌కు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఎన్నికలు జరిగిన […]
ఈటలకు బీజేపీ అమిత్‌షా ఫోన్..?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురైన మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతలు అప్పుడే సంప్రదింపులకు తెరలేపారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు షామిర్‌పేట్‌లోని తన ఫామ్ హౌస్‌కే పరిమితమైన ఈటల అక్కడ తన నియోజకవర్గ అభిమానులతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. […]
కేసీఆర్‌కు మరోసారి కరోనా టెస్ట్‌లు..ఏం తేలిందంటే?
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా సామాన్య ప్రజలపై మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులుపై కూడా పంజా విసురుతోంది. ఇటీవలె తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స […]