కరోనా విపత్కర సమయంలోనూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక నేడు పేదల కోసం జగన్ మరో మహత్తర పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేడు వర్చువల్ విధానంలో జగన్ `వైఎస్సార్ జగనన్న కాలనీ`ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే స్తోమత […]
Category: Politics
వైఎస్ఆర్ వాహనమిత్రలో కొత్త నిబంధనలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించడం కోసం వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తోంది. అయితే ఈ ఏడాది ఆర్థికసాయానికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం లబ్ధిదారులతో పాటు, కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం పలు నిబంధనలు […]
మాగంటి బాబు ఇంట మరో విషాదం..రెండో కుమారుడు మృతి!
ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న రవింద్ర హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు చికిత్స తీసుకున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసి హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఉంటున్నారు. అయితే […]
బ్రేకింగ్ : ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్…!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన పంపిణీ చేసే వాటిలో కంట్లో వేసే ముందు తప్ప మిగతా మందులను పంపిణీ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీసీఆర్ఏఏస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విజయవాడకు చెందిన ఆయుష్ విభాగం వైద్యులు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద విశ్వవిద్యాలయం వైద్యులు ఆనందయ్య ముందు తీసుకున్న […]
బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. !?
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ ను పొడగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడగించనున్నట్లు సమాచారం అందుతోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు […]
ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు..!
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,232 సాంపిల్స్ ను పరీక్షించగా 13,400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,133 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 94 మంది కరోనాతో మృతిచెందారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1,68,5142కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 1,50,8515 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,65,795 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం […]
తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు.. కానీ..?
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించగా.. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ మే 12 నుంచి లాక్‌డౌన్ విధించారు. ఇక అప్పటి నుంచి కరోనా కేసులు అదుపులోకి రావడం మొదలయ్యాయి. అయితే నేటితో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలోనే నేటి మధ్యాహ్నం రాష్ట్ర […]
రహస్య ప్రాంతంలో ఆనందయ్య..సోమవారం రానున్న నివేదిక!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయుర్వేద పద్దతులతో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో.. జనాలు ఆ మందు కోసం ఎగబడ్డారు. దీంతో ఆ నాటు మందుపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే వరకు పంపిణీని ఏపీ సర్కార్ నిలిపివేసింది. అలాగే ఆనందయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. శుక్రవారం ఇంటి వద్ద దించారు. అయితే మళ్లీ నేటి తెల్లవారుజామున […]
వాడుకుని వదిలేశాడు..మాజీ మంత్రిపై నటి ఫిర్యాదు!
సినీ తారలకు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉండటం, పెళ్లిళ్లు చేసుకోవడం సర్వ సాధారణం. కానీ, తాజాగా మాజీ మంత్రి మోసం చేశాడు.. వాడుకుని వదిలేశాడు అంటూ ఓ సినీ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ధుమారం రేపుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మణికందన్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వర్ధమాన నటి చాందిని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మణికందన్‌కు, తనకు ఐదేళ్ల పరిచయం […]