బాబు టూర్.. కన్నీళ్లు తుడవడానికా.. పెట్టుకోవడానికా..

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధితుల కష్టాలను చూడడానికి స్వయంగా బయలుదేరి వెళ్లారు. కడప జిల్లాలో ఒక రోజంతా పర్యటించారు. చిత్తూరు జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాలలో వరద తాకిడికి దెబ్బతిని నానా కష్టాలు పడిన ప్రజలను ఆయన పరామర్శిస్తారు. షెడ్యూలు ప్రకారం వరద బాధితుల కన్నీళ్లు తుడవడానికి చంద్రబాబునాయుడు వెళ్లినట్లే కనిపిస్తూ ఉంది కానీ, వాస్తవంలో ఊరూరూ తిరిగి తాను కన్నీళ్లు పెట్టుకోవడానికి ఆయన వెళుతున్నట్లుగా ఉంది! వరద బాధిత ప్రాంతాల్లో […]

జగన్: నిన్న బుకాయించి.. నేడు దొరికిపోయారు..!

జగన్ మడమ తిప్పని నాయకుడు అని ఆ పార్టీ వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆయన అంతే దృఢంగా మొండిగా ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణం మారుతోంది. జగన్ తరహా కూడా మారుతోంది. తీసుకునే నిర్ణయాలు, ప్రవర్తించే తీరు కూడా మారుతోంది. మడమ తిప్పుతున్నారు.. అందులో ఏమీ సదేహం లేదు. అయితే నిన్న ఈ విషయంలో బుకాయించేలా పార్టీ వాళ్లు ఏదో కొంత సమర్థించుకున్నారు గానీ.. నేడు అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ రాష్ట్రమతా […]

కొత్త బిల్లు కోసం ఢిల్లీ స్పెషలిస్టులకు పిలుపు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి అనే లక్ష్యంతో మూడు రాజధానులు పెట్టి తీరుతానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పట్టుదలను శాసనసభ సాక్షిగా ప్రకటించేశారు. రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి ఏ బిల్లు మీద అయితే హైకోర్టులో విచారణ జరుతున్నదో ఆ బిల్లును రద్దు చేశారు. దానితో పాటు సీఆర్డీయేను పునరుద్ధరించారు. న్యాయపరమైన లొసుగులు లేకుండా కొత్త బిల్లు రూపొందించి సభ ముందుకు తెస్తా అని ఆయన ప్రకటించారు. ఇప్పుడు లోపభూయిష్టమైన రాజధాని వికేంద్రీకరణ బిల్లును కొత్తగా […]

జగన్ వెనుకడుగు వెనుక- బ్రెయిన్ ఎవరిది..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అని అందరూ ఎడాపెడా రాసేశారు. అలాంటి మాటలను దృష్టిలో ఉంచుకునే ఏమో.. కొన్ని గంట లతర్వాత సభలోకి వచ్చినప్పుడు ‘తగ్గేదే లే’ అని జగన్ తెగేసి చెప్పారు. మూడు రాజధానుల విషయంలో చాలా కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా వెల్లడించారు. అయితే ఎందుకు వెనుకంజ వేసినట్టు? సింహం కూడా వేటాడే ముందు ఒక అడుగు వెనక్కి వేస్తుంది.. ఆ తర్వాత.. ఉన్నపళంగా ముందుకు దూకి పంజా విసురుతుంది.. అని జగన్మోహన్ రెడ్డి […]

ఎగసిపడిన సంతోషం.. అంతలోనే దుఃఖం..!

అమరావతి రాష్ట్రం కోసం పోరాడుతున్న రైతులు సోమవారం నాడు రెండు రకాల భావోద్వేగాలకు గురయ్యారు. ఒక ప్రకటన రాగానే.. తాము అపురూపమైన విజయం సాధించేశాం అని మురిసిపోయారు. పండగ చేసేసుకున్నారు. స్వీట్లు తినిపించేసుకున్నారు. ఒక్క అమరావతి రైతులు మాత్రమే కాదు.. వారి వెనుక నుంచి నడిపిస్తున్నారనే ముద్రను ఎదుర్కొంటున్న తెలుగుదేశం వారు కూడా రాష్ట్రంలో పలు చోట్ల స్వీట్లు తినిపించుకున్నారు. అయితే అంతలోనే.. అతి తక్కువ సేపటికే సీన్ మారిపోయింది. మోదం స్థానే ఖేదం వచ్చింది. సంతోషం […]

మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ.. వెనకడుగు కాదా.. మరో ముందడుగు కోసమేనా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని […]

గెలిచింది బీజేపీనా..ఈటలనా..?కమలం నేతల మదిలో అంతర్మథనం

హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిశాయి.. ఈటల రాజేందర్ విజయం సాధించాడు.. ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది.. అయినా కమలం నేతల్లో ఏదో అసంత్రుప్తి.. ఎన్నికల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీనా.. లేక ఈటల రాజేందరా అనే ప్రశ్న కమలం నాయకులకు నిద్రలేకుండా చేస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం అంటే ఈటల.. ఈటల అంటే హుజూరాబాద్ నియోజకవర్గం.. అటువంటి చోట అనుకోకుండా ఉప ఎన్నికలు వచ్చాయి.. హోరా హోరీ ప్రచారం నిర్వహించారు.. అధికార పార్టీ తరపున హరీశ్ రావు, ఇతర […]

తెలివిగా మాట్లాడిన తారక్

ఏపీలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్వడం ప్రపంచమంతా చూసింది.. దాదాపు రెండు నిమిషాల పాటు ఆయన రోదించారు. ఆ తరువాత ఏడుస్తూనే మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో అప్పుడు పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు. భార్యను రాజకీయాల్లోకి లాగుతారా అని బాబు ప్రశ్నించడంతో.. ఓహో అసెంబ్లీలో ఏదో జరిగిందని జనాలు అనుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఆ రోజు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ […]

సీఎం కేసీఆర్ బిజీ..బిజీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో బాగా బిజీ అయ్యారు. రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసి పరాజయం మూటగట్టుకున్న తరువాత ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈటల అనంతరం తన వద్దే ఉంచుకున్న వైద్య ఆరోగ్య శాఖను అల్లుడు హరీశ్ కు అప్పగించడమే నిదర్శనం. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు ఏకంగా కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేశారు. హుజూరాబాద్ లో ఈటల గెలవడంతో బీజేపీ జోష్ లోఉంది. ఇక పుండు మీద […]