సింహాద్రి అనుకుంటే చాగంటిగా మారిన ఎన్టీఆర్

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తన సతీమణి పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం పట్ల నందమూరి కుటుంబం కూడా తీవ్రంగా స్పందించింది. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ,పురందేశ్వరి, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వైసీపీ నేతలు […]

కాంగ్రెస్సోళ్లు.. అంతన్నారు.. ఇంతన్నారు.. మరి..

వందేళ్ల చరిత్రగల పార్టీ.. ఇదే ఆ పార్టీ నాయకులు ఎప్పుడూ చెప్పుకునే మాటలు.. అంతే.. కేవలం మాటలే.. వారి మాటలు మాత్రమే గొప్ప.. చేతలు అంతంతే.. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇదేం పార్టీనే.. అదే కాంగ్రెస్ పార్టీ.. పార్టీలో కార్యకర్తలు తక్కువ.. నాయకులు ఎక్కువ.. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో వారికే తెలియదు.. ఏమైనా అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ వచ్చిన తరువాత పార్టీలో అంతర్గతంగా […]

నవ్వు తెప్పిస్తున్న ‘జూనియర్ నారా’ వారి మాటలు

రాజకీయాలు రాకపోతే నేర్చుకోవాలి..ఇంకా ముందుకువెళ్లి వంటబట్టించుకోవాలి.. ఎప్పుడేం మాట్లాడాలో తెలియాలి.. లౌక్యంగా ఉండాలి..ఇలా ఉంటాయి సాధారణంగా రాజకీయ నాయకుల వ్యవహారాలు..అయితే నారా లోకేష్ మాత్రం ఇంకా రాజకీయాలు వంటబట్టించుకున్నట్లు లేదు. తన తండ్రి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోన్నట్టు ఉన్నాడు.. ఇంకా తండ్రి చాటు బిడ్డలాగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన మాటలు.. చేతలు చూసి తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారట. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ బుధవారం పర్యటించారు. కోవిడ్ కాటుకు బలైన వారి కుటుంబాలను పరామర్శించారు. మంచిదే.. […]

జగన్ స్క్రిప్ట్ .. మొత్తం సస్పెన్స్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు.. సీనియర్ రాజకీయవేత్తగా ఆలోచిస్తూ ప్రతిపక్షాలకు కాదు.. సొంత పార్టీ నాయకులకే షాక్ ఇస్తున్నాడు. అనుకున్నది అందరికీ చెప్పడు.. ఇక చెబితే అది జరగి తీరాల్సిందే.. ఇదీ జగన్ స్టైల్. అసెంబ్లీలో ఇటీవల మూడు రాజధానుల బిల్లు విషయంపై మాట్లాడుతూ ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఆనందపడదామనుకునేలోపే మరో బాంబు పేల్చాడు. పకడ్బందీగా బిల్లును మరోసారి ప్రవేశపెడతామని చెప్పడంతో టీడీపీ […]

చంద్రబాబు.. అదే అరిగిపోయిన రికార్డు

చంద్రబాబు నాయుడు.. సీనియర్ పొలిటీషియన్.. దేశంలో ఉన్న సూపర్ సీనియర్ నాయకుల్లో ఈయనా ఒకరు.. అన్నీ తానై పార్టీని ఒంటిచేత్తో నడిపించిన నాయకుడు.. అయితే అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు నాయుడికి ఏమీ పాలుపోతున్నట్లు లేదు.. ఎప్పుడూ అదే అరిగిపోయిన రికార్డు వేస్తూ జనాలను, కార్యకర్తల ఓపికకు సహనాన్ని పెడుతుంటారు. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నా.. ఎన్నో చూశా.. నన్ను వీళ్లేమి చేస్తారు.. ఎన్ని కేసులు పెట్టలేదు.. ఒక్క దానిని కూడా నిరూపించలేకపోయారు.. 40 ఏళ్ల రాజకీయ […]

మూడు రోజులైంది.. ఇంకా ఎవ్వరినీ కలవలే..

‘‘మోదీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోంది.. రైతులను పట్టించుకోవడం లేదు.. అరె.. వరి కొంటారో, కొనరా చెప్పండయ్యా అంటే సమాధానం లేదు.. ఈ లొల్లేంది.. ఢిల్లీకి పోతాం.. అక్కడే తేల్చుకుంటాం’’ అని ధర్నా చౌకలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతున్నాయి. శభాష్.. సారు రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. అన్నదాతకు మేలు జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సారు చెప్పినట్లుగానే తన టీమ్ తో ఆదివారం ఢిల్లీకి బయలుదేరాడు. అంతే.. పోయి ఇంట్లో కూసున్నడు. ఇప్పటికి […]

మూడున్నర గంటల పాటు వెయిట్ చేయించారు

తెలంగాణలో వరి ధన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేసీఆర్ ధర్నా కూడా చేశారు. పార్టీ శ్రేణులు మొత్తం ప్రభుత్వానికి అండగా నిలిచాయి. అంతటితో ఆగం.. ఢిల్లీ వెళ్లి మాట్లాడతాం.. కొంటారా? కొనరా? అని అడుగుతాం అని కేసీఆర్ బలంగా చెప్పారు. అన్నట్లుగానే కేసీఆర్ అండ్ టీమ్ ఢిల్లీకి వెళ్లింది. ఆదివారం హస్తినకు వెళ్లిన ప్రభుత్వ పెద్దలు అక్కడ ఏమేం చేయాలో రూట్ మ్యాప్ […]

జగన్ కు షాక్ కాని షాక్..

ఏపీలోని అధికార వైసీపీ లో ఏదో జరుగుతోంది.. ఎక్కడో అసంత్రుప్తి గూడు కట్టుకుంటోంది.. బయటకు చెబితే ఒక సమస్య.. చెప్పకపోతే ఒక సమస్య.. అధినేతకు కోపమొస్తే ఇబ్బందులు..దీంతో కడప జిల్లాలో వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ సర్పంచులు మదనపడుతున్నారట. వైసీపీ మద్దతు దారులు సర్పంచుల స్థానాల్లో కూర్చున్నారు. చాలా మంది సొంత డబ్బుతో పల్లెల్లో పనులు చేయిస్తున్నారు. చాలా రోజులైంది చేసిన పనులకు డబ్బు రాలేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఏమైనా కానీ అని ఓ […]

మేడం వస్తారు.. ఆ వైపు వెళ్లకండి

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబసభ్యులదే హవా.. ఇది అందరికీ తెలిసిందే. నెహ్రూ నుంచి ఇది కొనసాగుతోంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా వస్తోంది ప్రాధాన్యతల తీరు. రాజకీయంగా సోనియా పెద్ద నిర్ణయాలేం తీసుకోవడం లేదు. పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు అంతే.. ముఖ్యమైన నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ, ఈయన సోదరి ప్రియాంక గాంధీ తీసుకుంటున్నారు. పార్టీ నాయకులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ […]