బాధ్యత మోదీది అయినా.. ఎఫెక్ట్ కేసీఆర్ పైనే..

తెలంగాణలో ఈరోజు (సోమవారం) రైతులు అత్యంత ఆసక్తిగా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు. సాయంత్రం దాదాపు రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చుంటుంది. ఎందుకంటే వరి కొనుగోలు వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తోంది. వరి కొనుగోలు చేయాలని కేసీఆర్..మేము కొనం అని కేంద్రం అంటోంది. ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసి ఢిల్లీకి వెళ్లొచ్చిన కేసీఆర్ ఇంతవరకు వరి సమస్యపై నోరు విప్పలేదు. సోమవారం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం […]

మూడేళ్లలో ముగ్గురు..

రెండంటే రెండే రోజులు గడిస్తే.. ఆ తరువాత ఆయన మాజీ.. అంతే ఇంతకాలం ఉన్న హోదా.. దర్పం.. ప్రభుత్వ అధికారులపై అజమాయిషీ ఇక ఏవీ ఉండవు.. అందరిలాగానే ఆయన కూడా మాజీ అధికారుల జాబితాలో చేరిపోతారు. అంతలోపే ఓ సంతోషకరమైన వార్త అతనిని పలకరంచింది. మీ సేవలు బాగున్నాయి.. మరికొంతకాలం మీరు సర్వీసులో ఉంటారు.. అని ఆయనకు సమాచారం వచ్చింది. ఇంకేముంది.. ఆయన హ్యాపీ.. ఆయనతో పాటు అధినేత కూడా హ్యాపీ.. ఆ వ్యక్తి ఎవరంటే సమీర్ […]

టీడీపీకి నైతికబలం ఇస్తున్న ఉండవల్లి మాటలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న విలువ అందరికీ తెలుసు. తాను నమ్మిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిగా, దాని కోసం ఎంతవరకైనా తెగించి పోరాడే వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులైన మేధావి నాయకులలో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ముందు వరుసలో ఉంటారు. వైఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన మార్గదర్శి వ్యవహారాలకు సంబంధించి ‘ఈనాడు’ రామోజీరావు మీద కేసులు […]

నా కన్నీళ్లను ఢిల్లీలో చెప్పండి.. ఎంపీలకు బాబు హుకుం

పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో ఏయే అంశాలపై మాట్లాడాలో ఆయన వారికి సూచనలు చేశారు. ఇది ప్రతిసారీ జరిగే తంతే. సాధారణంగా ఢిల్లీ పాలనకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఈ సూచనలుగా వస్తుంటాయి. అయితే ఈసారి చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అన్నీ.. పార్లముంటలో చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వార్తల్లో […]

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు…

తెలంగాణలో రాజకీయం ఊపందుకుంది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మీరలా చేశారు.. వారలా చేశారు.. అనుకుంటూ కాలం గడుపుతున్నారు. అసలే రైతులు వరి కొనుగోలు సమస్యతో ప్రాణాలు కోల్పోతుంటే ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి మానాన వారు చేశామంటే.. చేశామని నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నగరంలో ప్రారంభమయ్యాయి. బీజేపీ అగ్రనాయకుడు, […]

తెరాస,కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ మైండ్ గేమ్..!

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించిన తరువాత కాస్త వేగంగా పావులు కదుపుతోంది. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. వరి కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. జీహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహించడం లేదని నిన్న ఆందోళనలు చేస్తూ టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీలో తమ పార్టీ బలాన్ని 3 నుంచి 30 వరకు.. వీలైతే అధికారం చేజిక్కించుకునేంతవరకు పోరాడాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నగరంలో రాష్ట్రస్థాయి సమావేశాలు […]

అరె సార్.. జర మాట్లాడరాదె..

వరి కొనుగోలు సమస్య వచ్చిన వెంటనే అలర్ట్ అయిన సీఎం కేసీఆర్.. గంటలకొద్దీ వరుస ప్రెస్ మీట్లు.. ఇక్కడ బండి సంజయ్ మొదలు ఢిల్లీలో మోదీ మీద వరకు విమర్శలు.. కేంద్రం ఏం చేస్తలేదు.. బండి సంజయ్ నాటకాలాడుతున్నాడు.. అంటూ డైలాగుల మీద డైలాగులు.. మీరు కొంటరా..కొనరా చెప్పాలని డిమాండ్.. ఇక ఇందిరా పార్కులో ధర్నా.. కేంద్రం చెప్పి తీరాలె.. లేకపోతే ఢిల్లీ బోతం.. మెడలు వంచుతాం అంటూ ఆవేశపూరిత ప్రసంగం.. చెప్పినట్టుగానే ఢిల్లీ వెళ్లడం.. అక్కడ […]

కెసిఆర్,బండి అయిపోయారు …ఇక రేవంత్ వంతు..

వరి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము సైతం రైతు వెంటే.. అంటూ ముందకు వచ్చింది. మంచిదే.. రైతుల సమస్య పరిష్కారానికి ఎవరు పోరాడినా అందరూ మద్దతు పలకాల్సిందే. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీ వరి దీక్షను ఈరోజు (శనివారం) […]

టాలీవుడ్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..!

నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమలోని కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి, తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ముందుకు […]