బిగ్ ట్విస్ట్..టీడీపీతో బీజేపీ పొత్తు..పక్కా క్లారిటీ..!

బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో భారీ సభ పెట్టి మళ్ళీ..టీడీపీని యాక్టివ్ చేస్తున్నారు. ఇంకా తమ బలం తగ్గలేదని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో తమకు బలం ఉందని చూపించి..బీజేపీతో పొత్తు పెట్టుకుని, తెలంగాణలో బీజేపీకి సహకరించి..ఏపీలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని బాబు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నిజానికి ఏపీలో బీజేపీ బలం జీరో..కాకపోతే […]

తిరువూరు వైసీపీలో సెగలు..ఎమ్మెల్యేని ఓడిస్తామని సవాల్!

రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. అటు టీడీపీలో కూడా ఇలాంటి రచ్చ ఉంది..కానీ వైసీపీలో మరింత ఎక్కువ కనబడుతోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సీట్ల కోసం నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు వైసీపీలో అసమ్మతి రాగం తారస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే రక్షణనిధి, ఆయన బామ్మర్ది, వారి అనుచరుల అరాచకాలు పెరిగిపోయాయని..వైసీపీలో కొందరు నేతలు రగిలిపోతున్నారు. […]

రేవంత్ పాదయాత్ర..సీనియర్లు బ్రేక్ వేస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతున్న విషయం తెలిసిందే. బలంగా ఉన్న పార్టీ కాస్త అంతర్గత విభేదాలు వల్ల దెబ్బతింది. ఇటీవల పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు పోరు నడిచింది. పార్టీ పదవుల పంపకాల విషయంలో రచ్చ నడిచింది. దీంతో దిగ్విజయ్ సింగ్ వచ్చి పార్టీలోని విభేదాలని తగ్గించడానికి చూశారు. దిగ్విజయ్ వచ్చాక..కాస్త పార్టీలో పరిస్తితులు సద్దుమణిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడమే […]

కోవూరులో బాబు జోరు..దినేష్‌కు కలిసోచ్చేనా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అది కూడా నల్లపురెడ్డి ఫ్యామిలీ టీడీపీలో ఉన్నంతకాలం…ఆ పార్టీ హవా కొనసాగింది. ఇక ఎప్పుడైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లారో, అప్పటినుంచి టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఇదే సమయంలో పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి నాయకుడు వల్ల కాస్త పార్టీ పట్టు జారలేదు. 2014 ఎన్నికల్లో పొలంరెడ్డి..నల్లపురెడ్డికి చెక్ పెట్టగలిగారు. కానీ 2019 ఎన్నికల్లో నల్లపురెడ్డి సత్తా చాటారు..పైగా వైసీపీ […]

మాజీ మంత్రికి బాబు హ్యాండ్..జంపింగ్ తప్పదా!

వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు..ఇప్పటికే పలుమార్లు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. యువ ఓటర్లని ఆకర్షించడం, నారా లోకేష్ నాయకత్వాన్ని బలపర్చేలా యువ నాయకత్వాన్ని పెంచే దిశగా చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో పలు నియోజకవర్గాల్లో సీనియర్లని పక్కన పెట్టి యువ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి సీటులో సైతం సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ […]

సైకిల్‌ని గుర్తుచేసుకుంటున్న కారులోని మాజీ తమ్ముళ్ళు.!

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో సగానికి సగం పైనే టీడీపీ నుంచి వచ్చిన వారే..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆఖరికి కేసీఆర్ సైతం టీడీపీ నుంచి బయటకొచ్చిన నాయకుడే. ఇక రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా టీడీపీని కేసీఆర్ లాగేసుకున్నారు. టీడీపీ నేతలనే కాదు..కార్యకర్తలని కూడా లాక్కున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టమైంది. అయితే ఇటీవల చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి..పార్టీ వీడి వెళ్ళిన నాయకులని మళ్ళీ పార్టీలోకి రావాలని కోరిన విషయం […]

కర్నూలు సిటీ వైసీపీలో రచ్చ..టీడీపీలో భరత్‌ ఫిక్స్?

కర్నూలు సిటీ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కంచుకోట..ఇప్పుడు వైసీపీ అడ్డా. గతంలో టీడీపీ ఇక్కడ రెండుసార్లు, సి‌పి‌ఎం రెండుసార్లు గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. అయితే వైసీపీ భారీ విజయాలు ఏమి సాధించడం లేదు. 2014 ఎన్నికల్లో కేవలం 3479 ఓట్ల తేడాతో టీడీపీపై వైసీపీ గెలిచింది. జగన్ వేవ్ ఉన్న 2019 ఎన్నికల్లో సైతం 5353 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. అంటే రెండు […]

ఆనం సీటుకు ఎసరు..అంతా జగనే అంటున్న బొత్స..!

అధికార వైసీపీలో ఊహించని విధంగా కొందరు నేతలు అసంతృప్తి గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి వైసీపీపై తిరుగుబాటు చేసి ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్ నేతగా మారిపోయారు. ఆయన మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి సైతం తమ ప్రభుత్వంపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. అలాగే ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ మధ్య మద్దిశెట్టి వేణుగోపాల్..అటు డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు తమ ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం […]

కావలిపై పట్టు..ప్రతాప్ టార్గెట్‌గా టీడీపీ స్కెచ్!

కందుకూరులో విషాద ఘటన నుంచి తేరుకుని టీడీపీ అధినేత చంద్రబాబు..కావలి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కందుకూరు రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. ఇక చనిపోయిన కుటుంబాలకు టీడీపీ నుంచి 15 లక్షలు, టీడీపీ నేతల నుంచి 10 లక్షలు మొత్తం ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇచ్చారు..ఇంకా కొంతమంది నేతలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కుటుంబాల్లో ఉన్న పిల్లలని చదివించే బాధ్యత తాను […]