చిరు,గంటా మళ్ళీ దోస్తీ అందుకేనా?

చిరంజీవితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సాన్నిహిత్యం ఈనాటిది కాదు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినదగ్గరినుండి గంటా తో చిరుకి మంచి అనుబంధం ఉంది.అయితే ఆ తదనంతర పరిణామాల్లో చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాడం తో గంటా కాంగ్రెస్ లో మంత్రి పదవి కొట్టేశారు.ఇక 2014 లో వ్యూహాత్మకంగా టీడీపీ లో చేరి మళ్ళీ మంత్రయ్యారు.చిరు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. తాజాగా గంటా కొడుకు రవితేజ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది.ఈ చిత్రానికి జయంత్ సి […]

అందుకే జనసేన పార్టీని రద్దుచేసెయ్యాలట

పవన్‌కళ్యాణ్‌ కొన్నాళ్ళ క్రితం జనసేన పార్టీని స్థాపించారు. ఆ పార్టీని స్థాపించిన పవన్‌కళ్యాణే జనసేన అనే పార్టీ ఒకటుందన్న విషయాన్ని మర్చిపోయారు. డబ్బుల్లేవు కాబట్టి పార్టీని నడపలేకపోతున్నట్లు ఓ సందర్భంలో ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేనకి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించినప్పటికీ ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇప్పటిదాకా పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లోనే పోటీ చేయాల్సిన జనసేన, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లోనూ మొహం చాటేసింది. జనసేన అనే పేరుతో ఓ […]

క్రిష్‌ కి బాలయ్య బంపర్ ఆఫర్!

చారిత్రకమైన కథలకి తెర రూపం ఇవ్వడంలో యంగ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ ముందుంటాడు. రెండో ప్రపంచ యుద్ధ ఘట్టాన్ని వరుణ్‌ తేజ్‌ వంటి కొత్త హీరోతో అద్భుతంగా తెరకెక్కించాడంటేనే క్రిష్‌ గొప్పతనం ఏంటో అందరికీ అర్ధమయ్యింది. ఎంతమంది విమర్శకుల ప్రశంసలనో అందుకుంది ఈ చిత్రం. అలాగే ఇప్పుడు బాలకృష్ణ వంటి సీనియర్‌ నటుడితో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో సెన్సేషన్‌కు కంకణం కట్టాడు ఈ సెన్సేషనల్‌ డైరెక్టర్‌. బాలకృష్ణ కెరీర్‌లో […]

షాక్ ఇస్తున్న అమరావతి ఇటుకలు!

అమరావతి అని రాజధాని పేరును ప్రకటించిన దగ్గరినుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తో ఊడగొట్టేసింది.అమరావతి పేరులోనే రాజసం ఉట్టిపడుతోంది.అమరావతి అంటే ప్రజలది..ప్రజలంటేనే అమరావతే అన్నంతగా ప్రచారాన్ని హోరెత్తించారు.అసలు శంకుస్థాపనయితే ఓ చారిత్రాత్మక ఘట్టంలా నిర్వహించారు.దాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ ఓ వైపు లోటు బడ్జెట్ సన్నాయి నొక్కులు నొక్కుతూనే మరో వైపు శంకుస్థాపన ఆర్భాటాలు చూసి జనం విస్తుపోయారు. మొదట్లో స్వచ్ఛందంగానే ప్రజలంతా మన అమరావతి అనే నినాదం తోనే ముందుకెళ్లారు.అప్పట్లో ఆహా అమరావతి […]

బిచ్చగాడు బాహుబలిని క్రాస్ చేసినట్టే!

100 కోట్ల బడ్జెట్ తో భారీ కాస్టింగ్ తో సినిమా తీసి 150 కోట్లు కలెక్ట్ చేయడంలో కిక్కేముంది!అదే ఓ డబ్బింగ్ సినిమా,ఎవరూ పేరున్న నటులు లేరు,టెక్నిషియన్స్ అంత కన్నా లేని ఓ సాదా సీదా సినిమా తెలుగులో 25 కోట్లు కలెక్ట్ చెయ్యడం అంటేనే అది బాహుబలి కంటే పెద్ద హిట్ అయినట్టే లెక్క.ఈపాటికే అర్థం అయుంటుంది కదా..అది తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’ అని. మే 13న విడుదలైన బిచ్చగాడు సినిమా 63 […]

ఇప్పుడనుకొని ఏమా లాభం జైరాం గారూ!

కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ పెద్దల్లో ఒకరైన జయరాం రమేష్ గారిగి పాపం ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయినట్టుంది.రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కి జరిగిన నష్టం పూడ్చలేనిది నిట్టూర్చారు పాపం.ఎం చేస్తాం జైరాం గారూ ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారన్న నానుడి గుర్తుంది గా..అచ్చం అలాగే జరిగినదన్నమాట కాంగ్రెస్ కి. వైఎస్ఆర్ మరణించకుండా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థులు వేరుగా వుండేయని అన్నారు.అయినా ఈయనకు ఈ నిజం ఇప్పటికి తెలిసిందేమో కానీ వైఎస్ఆర్ మరణించిన తరువాత […]

సునీల్‌ తొందరపడుతున్నాడు

‘కృష్ణాష్టమి’ సినిమాతో నిరాశపడ్డాడు సునీల్‌. దాని నుంచి వెంటనే తేరుకుని వరుసగా రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు. ఒకటి ‘జక్కన్న’, రెండోది ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమాలు. శరవేగంగా ఈ సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెఢీ అయ్యాయి. అయితే ‘జక్కన్న’ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తారని ఎప్పుడో అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు. కానీ ఇంకా కన్నా ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమాకి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ కాలేదు. వాస్తవానికి ఎన్టీఆర్‌ హీరోగా వస్తోన్న […]

మేడమ్‌కి మోడీ షాక్‌లే షాక్‌లు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మానవ వనరుల శాఖ మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించిన మోడీ, ఆమెకు తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నుంచి ఉద్వాసన పలికారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏ కమిటీల్లోనూ స్మృతి ఇరానీకి చోటు కల్పించలేదు నరేంద్రమోడీ. ఒకానొక సమయంలో కేంద్ర క్యాబినెట్‌లో స్మృతి ఇరానీ అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్‌ […]

‘జనతా గ్యారేజ్‌’కి టింకరింగ్స్‌

జనతా గ్యారేజ్‌ సినిమా ఆగస్ట్‌ 12న విడుదలవ్వాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా విడుదలను సెప్టెంబర్‌ 2కి పోస్ట్‌పోన్‌ చేశారు. అయితే ప్లానింగ్‌తో సినిమాలు చేసే కొరటాల శివ ఈ సినిమా విషయంలో ఎందుకిలా ‘ఇన్‌ టైమ్‌’లో పూర్తి చెయ్యలేకపోయాడో తెలియరావడంలేదు. సినిమా అంతా అనుకున్నట్లుగానే చేశారనీ అయితే ఫైనల్‌ టచప్స్‌ తప్పవని భావించి, ఇప్పుడు ఆ పనుల్ని హుటాహుటిన చేపట్టారనీ తెలియవస్తోంది. ఈ టింకరింగ్స్‌తో సినిమా ఇంకా అందంగా తయారవనుందట. ఇంకో వైపున ఔట్‌ […]