ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్ళీ ఆ చిరుని చూస్తున్నాము..

కళామతల్లి ముద్దుబిడ్డ అంటే మన మెగా స్టార్ చిరంజీవేనేమో అనిపిస్తుంది.లేకపోతే ఆయనేంటి ఆయన వయసేంటి..ఆయన ఈ కళామతల్లికి దూరమై ఎన్నాళ్ళయింది..ఇంకా ఆయనకి నటనపై వున్న తపనని చూస్తే నిజంగా చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికే పుట్టాడా అనిపిస్తుంది.చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మెగా అభిమానులందరూ మాత్రమే కాదు సామాన్య సినీ అభిమాని కూడా చిరులోని నటుడ్ని ఎంతో మిస్ అయ్యారు.మళ్ళీ చిరంజీవి 150 వ సినిమా సందడి మొదలవ్వ గానే ఎన్నేళ్లయినా చిరుపై వుండే అభిమానం మాత్రం ఇసుమంతైనా […]

భాగ్యనగరం మైనస్‌ బెగ్గర్స్‌ 

భాగ్యనగరం హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడా బిచ్చగాళ్ళు లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు ప్రాణాళికలు రచించుకున్న జిహెచ్‌ఎంసి ఇప్పటికే యాచకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘బిచ్చం వెయ్యొద్దు’ అంటూ పౌరులకు అవగాహన కల్పిస్తోంది. యాచకుల్ని సంరక్షణ కేంద్రాలకు తరలించి, వారి బాగోగుల్ని చూడటంతోపాటుగా పౌరులకు అవగాహన కల్పించడం ఇక్కడ చాలా ముఖ్యం. అలాగే, మాఫియా ముఠాలు యాచకుల్ని పావులుగా వాడుకోవడంపైనా దృష్టిపెట్టవలసి వస్తుంది. నగరం మొత్తం మీద ఉన్న […]

రవితేజ కి ఏమైంది!!

ఒకప్పుడు రవితేజా అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యాన్ ల ఉండేవాడు. తన తోటి స్టార్ హీరోల్లో అందరికంటే వేగంగా పని చేసే రవితేజా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని శరవేగంగా సినిమాలు చేస్తూ పోయాడు. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఆ వేగమే రవితేజా ని సరైన ఆలోచన లేకుండా ఏదొఇపడితే ఆ కథని ఎంచుకునేలా చేసింది. వేగం పెరిగి.. క్వాలిటీ తగ్గిపోవడంతో ఓ దశలో వరుసగా సినిమాలు దెబ్బ […]

త్వరలో రెడ్డిగారి రాజకీయ సన్యాసం?

తెలంగాణ కాంగ్రెస్ భీష్ముడు జానా రెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేయబోతున్నాడా?అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.దీనికి బలం చేకూరుస్తూ తాజాగా రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పదవి ముఖ్యంకాదు… పార్టీ బలోపేతమే నా లక్ష్యం… ఏ పదవీ లేకుండానే మహాత్ముడు స్వరాజ్యం సాధించారు.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై జానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.. తమ పార్టీ నేతలకు అధికార టిఆర్ఎస్ […]

బాబు మళ్ళీ రుణమాఫీ అన్నాడోచ్..

చంద్రబాబు కి ఎన్నికల హామీలు ఇచ్చి ఇచ్చి ఎక్కడికెళ్లినా హామీలివ్వటం అలవాటుగా మారిపోయింది.ఆచరణ సంగతి దేవుడెరుగు హామీలదేముంది చెప్పటమే కదా అన్న చందాగా తయారైంది బాబు వ్యవహారం.రుణమాఫీ విషయంలో మీరెవ్వరు చిల్లి గవ్వ కూడా చెల్లించొద్దు మా ప్రభుత్వం రాగానే మీ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాం అన్న చంద్రబాబే ఈ రోజు నా దగ్గర డబ్బుల్లేవు,అప్పు కూడా దొరకడం లేదని బీద ఏడుపులు ఏడవడం విడ్డురంగా ఉంది.అపార రాజకీయానుభవం వున్న చంద్రబాబు కి ఇన్నాళ్ళకి తత్వం […]

ముద్రగడ ఏం సాధించారు?

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. నిరాహార దీక్ష ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందోనని చంద్రబాబు సర్కార్‌ ఇప్పటిదాకా ఆందోళనతో ఉండేది. ఇప్పుడు ఆ ఆందోళన అక్కర్లేదు. దీక్ష విరమించడం కూడా నాటకీయ పరిణామాల మధ్యనే జరిగింది. అయితే దీక్షతో ముద్రగడ పద్మనాభం ఏం సాధించారు? అని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ప్రశ్నించుకుంటోంది. కేసులు నమోదు కావడం, అరెస్టవడం, బెయిల్‌ రావడం ఇదంతా ఓ ప్రక్రియ. పద్ధతి […]

పతాక సన్నివేశాల్లో ‘బాబు బంగారం’

కొంత గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ బాబు బంగారంగా వస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ లో ఆయన మార్క్ వినోదం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక చివర్లో ఆయన పలికిన “అయ్యో అయ్యో అయ్యయ్యో..” డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ హైదరాబాద్ – గచ్చీబౌలీలో సాగుతోంది. వెంకటేశ్, నయనతార, ప్రధాన తారాగణం పాల్గొన్న పతాక సన్నివేశాలను దర్శకుడు మారుతి […]

ఇంటి వేటలో సమంతా!

అమాయకత్వం, చిలిపితనం, మరికొంచెం గడుసుతనం తెరపై పండించాలంటే సమంతాకు మించినవారులేరు. టాలీవుడ్, కోలీవుడ్ ల్లో బ్లాక్ బస్టర్స్ ను ఖాతాలో వేసుకుని జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇంటి వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ లో ఆమె ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆమె ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నది భాగ్యనగరంలో కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో ఎక్కువ అవకాశాలు ఉండడం […]

మల్లన్న సాగర్ మీద రేవంత్ ఉద్యమం

మల్లన్న సాగర్ సమస్యను ఆయుధంగా అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని టీటీడీపీ సిద్ధమవుతోంది, ముంపు బాధితుల తరుపున పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించింది. రైతుల తరపున దీక్ష చేయడానికి టీటీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యపై టీడీపీ ఉద్యమ బాటపట్టి చాలా రోజులైంది. ఈ నెల ఒక‌ట‌వ తేదీన తెలుగుదేశం ముఖ్య నేత‌లు మెద‌క్ జిల్లా ఏటిగ‌డ్డ కిష్టాపూర్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని బాధితుల తరుపున […]