ఏపీలో రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దారాఘవరావు చుట్టూ పలు ఆరోపణలు ముసురుకుంటున్నాయి. ఇంజనీర్ ఇన్ చీఫ్ చేస్తున్న అక్రమాలపై శిద్దా చర్యలు తీసుకోకపోగా, ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అసలు ఆ ఇంజనీర్ ఇన్ చీఫ్ అంటే మంత్రి శిద్ధా కు ఎందుకంత ప్రేమ అనేస్థాయిలో ప్రస్తుతం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఇక విషయంలో వెళ్తే.. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలో పలు రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. దీనికి అటు […]
Category: Latest News
చంద్రబాబు అక్కౌంట్లో మరో బురిడీ స్కెచ్..!
తెలుగువారు.. అందులోనూ ప్రత్యేకించి సీమాంధ్రులు చేసుకున్న పాపమేమోకాని… ఇప్పటిదాకా రాజధాని స్థాయి నగరం ఒకదానిని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారు. రెండువందలేళ్లు కష్టపడి మద్రాసును అభివృద్ధి చేస్తే అది తమిళతంబీలు తమదన్నారు. మళ్ళీ అరవై ఏళ్లు కష్టపడి హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా మారిస్తే… దానిపై మీకు హక్కులేదంటూ తెలంగాణ తమ్ముళ్లు తరిమేశారు. దీంతో సీమాంధ్రలోనూ మద్రాసు, హైదరాబాద్, బెంగళూరులను తలదన్నే నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నది ప్రస్తుతం సీమాంధ్రులకు బలమైన సెంటిమెంట్‌గా మారిపోయింది. వాస్తవానికి.. ప్రజల్లో ఉన్న ఈ సెంటిమెంటే.. ఏపీలోని […]
పెళ్లాం చేతిలో కీలుబొమ్మగా మారిన ఏపీ మంత్రి
తాను ఎంతగా శ్రమించినా…, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లోనూ.. తలకు మించిన స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా… ప్రజల్లో మాత్రం తన ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో మైలేజీ రావడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెగ ఇదైపోతున్నారట.. ఈ పరిస్థితికి అసలు కారణమేంటో తేల్చుకునేందుకు పనిలో పనిగా తన మంత్రివర్గ సహచరుల పనితీరుపై రహస్యంగా విచారణ కూడా జరిపించిన ముఖ్యమంత్రికి అందులో వెల్లడైన సమాచారం చూసి దిమ్మతిరిగిపోయినట్టు సమాచారం. రాజధాని రాకతో అనూహ్యంగా ప్రాధాన్యం […]
అమరావతిలో నాలుగేళ్ల ఖర్చు చూస్తే షాకే
ఏపీ రాజధాని అమరావతి కోసం వచ్చే నాలుగేళ్లలో ఖర్చు చేయాలని భావిస్తున్న డబ్బెంతో తెలిస్తే.. షాకే! ఒక వెయ్యి కోట్లు కాదు పది వేల కొట్లు కాదు ఏకంగా 32 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, ఇప్పటికే సీఎం చంద్రబాబు కలల రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఏ పని సాకారం కావాలన్నా డబ్బుతోనే పని. అలాంటిది ఏమీలేని చోట అంతర్జాతీయ స్థాయి […]
ఏపీలో వైకాపా-కాంగ్రెస్ కలుస్తాయా..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఫలితాలు దేశరాజకీయ ముఖ చిత్రాన్నేమార్చిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. హస్తిన పీఠాన్నికాంగ్రెస్కు దూరం చేసిన జాతీయ స్థాయి విపక్ష కూటమి ఏదైనా.. అందులో టీడీపీ పోషించిన కీలక పాత్రను గుర్తుకు తెచ్చేదే. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ పంతం పట్టి మరీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కూడా టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైనా.. ఆ పార్టీలో పేరుకుపోయిన కక్షే కారణమని భావించేవారి సంఖ్య తక్కువేమీ కాదు. రాష్ట్ర విభజన […]
తెలుగు న్యూస్ ఛానెల్స్ రూటు మారనుందా
ఎవరు కాదన్నా, అవునన్నా… ప్రస్తుతం నడుస్తున్నరాజకీయాల్లో ప్రసార మాధ్యమాలు పోషిస్తున్న పాత్రను తక్కువ చేసి చూడలేం. అధికారంలో ఉన్న పార్టీలు తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, విపక్షాలు చేసే ప్రభుత్వ వ్యతిరేకపోరాటాలు విజయవంతం కావాలన్నామీడియా సహకారం అత్యవసరంగా మారిపోయిందిప్పుడు. ఇప్పటికీ పత్రికల హవా తగ్గకున్నా… ప్రజల మీద ప్రభావం చూపించే మీడియా మాధ్యమాల్లో టీవీ ఛానళ్లు మరింత కీలకంగా మారిపోయిన సంగతి కూడా గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా అది విద్యావంతులకు మాత్రమే […]
చంద్రబాబులో నాటి జోష్ నేడు ఏమైంది…
వర్తమాన రాజకీయాల్లో… పరిపాలనాధక్షుడిగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సామర్థ్యం ఏంటో ఆయన ట్రాక్ రికార్డ్ చెప్పకనే చెవుతుందనేది టీడీపీ వర్గాలు తరచూ చెప్పే మాట. పైకి ఏం చెప్పినా ఇందులో వాస్తవముందని ప్రతిపక్ష నాయకులు కూడా ఒప్పుకునే విషయమే. అయితే ఈ వాదన చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలానికి వర్తిస్తుంది కాని… ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ స్థాయిలో పని చేయలేక పోతోందని ఇపుడు ఏ పార్టీకి సంబంధం లేని తటస్థుల్లో ఎక్కువగా వినిపిస్తున్న […]
ఏపీ సీఎం ఫ్యామిలీ ఆస్తులెన్నో తెలుసా
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తులను ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు బుధవారం ప్రకటించారు. ఇలా పొలిటికల్‌గా ఓ రేంజ్లో ఉన్న నేత తన కుటుంబ ఆస్తులు ప్రకటించడం దేశంలో చాలా అరుదు. అయితే, చంద్రాబాబు కుటుంబం మాత్రం తమ ఆస్తుల వివరాలను వరుసగా ఎనిమిదోసారి ప్రకటించండం గమనించాల్సిన విషయం. ఇక, లోకేష్ చెప్పిన దానిని బట్టి.. చంద్రాబాబు, ఆయన కుటుంబానికి ఒక్క హెరిటేజ్ ఫ్రెష్ మాత్రమే ఆధారంగా కనిపిస్తోంది. దీంతో […]
ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా..!
రాజధాని హైదరాబాద్‌లో చెరువులు, నల్లాలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి తాట తీస్తామని ఇటీవల కురిసిన కుంభ వృష్టితో హైదరాబాద్ మునిగిపోయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలు అయినా సరే..ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు ఇలాంటి కేసు విషయంలోనే అధికార టీఆర్ ఎస్కి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కి హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అయితే, ఆయనకు హైదరాబాద్‌లో కాకుండా తన సొంత […]