ఏపీలో ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా లార్జెస్ట్ సెర్క్యులేషన్‌తో ఎదురు లేకుండా ముందుకు సాగుతున్న ఈనాడుకు ఇప్పడు జ్యోతి రూపంలో చాపకింద నీరులా పోటీదారు పేట్రేగిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్ నేతృత్వంలోని సాక్షి ఈనాడుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే, రానురాను రామోజీ దెబ్బకి మెత్తబడి ఎలాంటి పోటీ గీటీ లేకుండానే తన మానాన తను పని కానిస్తోంది. కానీ, ఆర్కే నేతృత్వంలోని ఆంధ్రజ్యోతి […]
Category: Latest News
భూ కుంభకోణంలో డీఎస్.. కేసీఆర్‌కి మరో తలనొప్పి!
తెలంగాణలో అధికార పార్టీ ఇప్పుడు భూ కుంభకోణాలతో సతమతమవుతోంది. ఆయా కుంభకోణాల్లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల పేర్లు ఉండడం మరింతగా ఆందోళనకు గురి చేస్తోంది. మియాపూర్ భూ కుంభకోణం కేసలో టీఆర్ ఎ స్ సెక్రటరీ జనరల్ కేకే పేరు బాహాటంగానే వినిపించింది. దీంతో ఏకంగా కేసును తానే బదలాయించుకుని పర్యవేక్షిస్తున్నారు కేసీఆర్. ఇక, ఇప్పుడు తాజాగా ప్రభుత్వ సలహాదారు, కేసీఆర్‌కి అత్యంత ఆప్తుడు సీనియర్ పొలిటీషియన్ అయిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)పైనే భూ ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.నాలుగు […]
విశాఖలో వీధికెక్కిన మంత్రుల కీచులాట .. బాబుకు గంటా లేఖ
ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రుల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆ పార్టీ, ఈ పార్టీ తిరిగి చివరాఖరికి 2014లో టీడీపీ లో చేరి మంత్రి పదవి కొట్టేసిన గంటా శ్రీనివాసరావుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ఇటీవల వెలుగు చూసిన విశాఖ భూ కుంభకోణం తో వీరిద్దరి మధ్య మరింతగా గొడవలు రాజుకుని, అవి అధినేత చంద్రబాబు వరకు చేరాయి. మొన్నామధ్య […]
ఏపీ పాలిటిక్స్‌లో సీన్ రివర్స్
ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పార్టీ బలోపేతం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నిన్నటి వరకు విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను వరుసపెట్టి సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. వైసీపీ నుంచి వచ్చిన కొత్త నాయకులకు అప్పటి వరకు టీడీపీలో ఉన్న పాత నాయకులకు మధ్య కూల్‌వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. దీంతో కొత్త నాయకులతో పొసగని పాత నాయకులు ఇప్పుడు రివర్స్ జంప్ చేస్తున్నారు. వారంతా టీడీపీకి […]
ట్విస్ట్: నంద్యాల వైసీపీలో ఫైటింగ్
ఏపీలోని నంద్యాల నియోజకవర్గంలో రాజకీయాలు థ్రిల్లర్ పాలిటిక్స్‌ను తలపిస్తున్నాయి. నిన్నటి వరకు టీడీపీలో ఉప ఎన్నికల్లో సీటు కోసం భూమా వర్గం వర్సెస్ శిల్పా వర్గాల మధ్య ఓ రేంజ్‌లో ఫైట్ నడిచింది. చివరకు చంద్రబాబు సైతం వీరిలో ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలో తెలియక నాన్చుతూ వచ్చారు. తాజాగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. నిన్నటి వరకు నంద్యాల టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలో తెలియక […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వివాహేతర సంబంధం ఆరోపణలు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గత నాలుగైదు రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు గోల్డ్‌స్టోన్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆయన కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి సైతం ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో సీఎం కేసీఆర్ కేకేపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అదే టీఆర్ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యేపై […]
వారసుల ఫ్యూచరే ముఖ్యం….వైసీపీలోకి సీనియర్లు
ఏపీలో టీడీపీ బండి లోడ్ ఎక్కువైనట్టే కనిపిస్తోంది. డీ లిమిటేషన్ ఆశ చూపి చంద్రబాబు విపక్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చేసుకున్నారు. డీ లిమిటేషన్ జరిగితే ఓకే…లేనిపక్షంలో ఇప్పుడు వాళ్లకు టిక్కెట్ల కేటాయింపు చంద్రబాబుకు పెద్ద తలపోటే అవుతుంది. దీంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్లంతా రివర్స్‌గేర్‌లో వైసీపీలోకి వెళుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రస్తుతం అదే జరిగింది. వీళ్ల సంగతి ఇలా ఉంటే కొందరు సీనియర్లు సైతం తమ, తమ […]
ఆ మంత్రి ఇంకా పట్టు సాధించలేదా?!
ఏపీ సీఎం చంద్రబాబు అంటే.. లీడర్ షిప్ క్వాలిటీకి కేరాఫ్. ఆయన పాలన అంటే.. అన్ని రంగాలపైనా పట్టు గ్యారెంటీ! అదేవిధంగా ఆయన టీం మంత్రులకు కూడా బాబు ఇదే ఫిలాసఫీ నేర్పిస్తారు. ముందు వారివారి విభాగాలపై పట్టుసాధించాలని చెబుతారు. దీంతో వారు స్వల్ప కాలంలోనే బాబు సూచనల మేరకు పాలనపై పట్టు బిగిస్తారు. అయితే, ఇప్పుడు ఓ మంత్రి మాత్రం ఇంకా పాలనపై పట్టు సాధించలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో […]
టీడీపీ కంచుకోటలో ఇద్దరి ఎమ్మెల్యేల ఫైట్
టీడీపీకి కంచుకోట వంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేలు వీధుల్లోకి వచ్చి కొట్టుకునే, చంపుకొనే పరిస్థతి ఏర్పడుతోంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా లో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ క్రమంలో జిల్లా టీడీపీ నేతల మాటకు విలువ పెరిగిపోయింది. ఇలా తమకు ఎదురు లేకుండా పోయిందని టీడీపీ నేతలు భావించారు. ఇంత వరకు నిజమే అయినా.. పరిస్థితులు ఇప్పుడు చేయిదాటుతున్నాయి. నేతలంతా ఒక్కటై పార్టీని మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. పార్టీని […]
