జేసీ బ్రదర్స్ పేరు చెపితే ఏపీలోని అనంతపురం జిల్లాలోనే కాదు ఏపీ, తెలంగాణలోను వీరిని గుర్తు పట్టని వారు ఉండరు. పలు వ్యాపారాల్లో ఆరితేరిన వీరు డేరిండ్ అండ్ డాషింగ్ పొలిటికల్ లీడర్లుగా పేరొందారు. ఇక జేసీ దివాకర్‌రెడ్డి అయితే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విశాఖ ఎయిర్‌పోర్టులో చేసిన హంగామాతో మరోసారి వార్తల్లోకెక్కారు. ఇదిలా ఉంటే జేసీ సోదరులు ఇద్దరూ తమ వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం అప్పుడే ప్రయత్నాలు […]
Category: Latest News
గోల్డ్‌స్డోన్ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులు..?
ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ దూకుడు ముందు విపక్షాలన్ని చెల్లా చెదురైపోతున్నాయి. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సైతం చేతులెత్తేసింది. ఇక అధికార పక్షంలో లోపాలు కాంగ్రెస్ వాళ్లకు ఎలాగూ దొరకవు..కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఏదైనా నెగిటివ్ వార్త వచ్చినప్పుడు కూడా దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఫోకస్ చేసే విషయంలో కూడా వాళ్లు ఘోరమైన డిజాస్టర్ షో వేస్తూ ప్లాప్ మీద ప్లాప్ పాలిటిక్స్ చేస్తున్నారు. […]
బాబుకు ఇద్దరు సీనియర్ల అల్టిమేటం
ఏపీ సీఎం చంద్రబాబుకు ఆపరేషన్ ఆకర్ష్ తలనొప్పి ఏంటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. నిన్నటి వరకు వైసీపీకి చెందిన నాయకులను, ఎమ్మెల్యేలను ఆయన ఎడాపెడా పార్టీలో చేర్చేసుకున్నారు. వీరి వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని టీడీపీలోని పాత కాపులు చెప్పినా ఆయన మాటే నెగ్గించుకున్నారు. ఇప్పుడు ఆయన లేనిపోని టెన్షన్లు కొని తెచ్చుకుంటున్నారు. నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లిన ఇష్యూ ఇంకా హాట్ హాట్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అక్కడ నంద్యాలలో మంత్రి అఖిలప్రియ తీరుపై చాలా […]
ఏపీ ఓటు కన్నా తెలంగాణ ఓటు వాల్యూ తగ్గిందే
తెలంగాణ అధికార పక్షాన్ని ఓ సమస్య ఇరకాటంలోకి నెట్టింది! ఇది ఏపీతో వచ్చిన సమస్యకాకపోయినా.. ఏపీ వల్లే వచ్చిందని నేతలు దిగులు పడుతున్నారు!! రాష్ట్ర విభజన కారణంగా తాము నష్టపోయామని ఇప్పుడు అనుకుంటున్నారట. అయితే, అదేదో.. ఆస్తుల పంపకాలు, ఆర్థిక విషయాల్లో కాదులెండి. ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తిని పోటీ లేకుండా నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పుడు అన్ని పార్టీలూ రాష్ట్ర […]
కోడెల కొడుక్కి, కూతురికి 2 అసెంబ్లీ సీట్లు కావాలా…
ఏపీ రాజకీయాల్లో గత మూడున్నర దశాబ్దాలుగా తనదైన స్టైల్లో రాణిస్తున్నారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కంటిన్యూ అవుతోన్న ఆయన రాజకీయంగా ఎత్తుపల్లాల జీవితాన్ని అనుభవించారు. నరసారావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన ఆయన గత ఎన్నికల్లో సత్తెనపల్లికి మారి అక్కడ నుంచి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. గతంలో హోం మంత్రిగా కూడా పని చేసిన కోడెల ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్నారు. ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన […]
బాబు వ్యూహం బెడిసి కొడుతోందా?!
ఒక్కొక్క సారి మనం తీసుకునే నిర్ణయాలు అనూహ్యంగా మనకే పరీక్ష పెడుతుంటాయి! ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఏపీలో సీఎం సీటులో కూర్చున్న ఆయన ఏ ముహూర్తాన.. ఇదే సీటులో మరో ముప్పై ఏళ్లపాటు శాశ్వతంగా కూర్చోవాలని డిసైడ్ చేసుకున్నారో ఏమోగాని.. ఆ క్షణం నుంచి ఆయన అనేక వ్యూహాలకు తెరదీశారు. ప్రధానంగా రాష్ట్రంలో విపక్షాన్ని లేకుండానే చేయడం ద్వారా అధికారాన్ని సుస్థిరం […]
కలకలం: వైసీపీలోకి కేశినేని నాని..!
ఈ వార్తలో నిజానిజాలు ఎంతన్నది పక్కన పెడితే విజయవాడలోని ఓ వర్గం నాయకులు మాత్రం ఇదే ప్రచారం హోరెత్తించేస్తున్నారు. నిన్నటి వరకు అధికార టీడీపీ చేపట్టిన ఆకర్ష్ దెబ్బకు విపక్ష వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు సైకిలెక్కేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొత్త నాయకులు, పాత నాయకుల మధ్య పొసగక పోవడంతో పాత టీడీపీ నాయకులు ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో […]
ప్రెసిడెంట్ ఎలక్షన్‌లోనూ.. కాషాయం మార్క్ పాలిటిక్సే!!
ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ.. రాష్ట్రపతి భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. జూలైలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్థానంలో మరో కొత్తవారిని కొలువుదీర్చాలి. దీనికి సంబంధించి ఇప్పుడు హస్తిన రాజకీయాలు బోగి మంట మాదిరిగా వేడెక్కాయి. అయితే, ఇక్కడే బీజేపీ సారధి అమిత్ షా, ప్రధాని మోడీల వ్యూహం వ్యూహాత్మకంగా సాగుతోంది! కరడుగట్టిన ఆర్ ఎస్ ఎస్ వాదులైన ఇద్దరూ తమకు అనుకూలురైన వ్యక్తిని రాష్ట్రపతి భవన్‌లో కూర్చోపెట్టాలని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్డీయే […]
రాజకీయాల్లో కొత్త సంస్కృతికి తెరతీసిన జగన్
గత ఎన్నికల్లో విజయానికి అడుగు దూరంలో నిలిచిపోయిన వైసీపీని ఈసారి ఎలాగైనా విజయతీరాలకు చేర్చాలని పార్టీ అధినేత జగన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏరికోరి ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని మైలేజ్ ఉన్న ప్రశాంత్ కిశోర్‌ను పక్కనపెట్టుకున్నారు. ఆయన రాకతో వైసీపీకి తిరుగులేదని నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అందుకు తగినట్టే ఆయన పని మొదలుపెట్టేశారు. సంప్రదాయాలకు భిన్నంగా సరికొత్త పంథాలో వెళుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గ్రామాల్లో సర్వేలు, ఎమ్మెల్యేలకు శిక్షణ శిబిరాలు, మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా […]
