టీడీపీ జిల్లా విభాగాలకు కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన అలా వెలువడిందో లేదో పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి సెగలు – పొగలు రేగాయి. చంద్రబాబు జిల్లాల వారీగా ప్రకటించిన జాబితాలో శ్రీకాకుళం-గౌతు శిరీష, విజయనగరం-చిన్నమనాయుడు, విశాఖ అర్బన్- వాసుపల్లి గణేష్, విశాఖ రూరల్- పంచకర్ల రమేశ్‌బాబు, తూర్పుగోదావరి-నామన రాంబాబు, పశ్చిమ గోదావరి-తోట సీతారామలక్ష్మి, కృష్ణా-బచ్చుల అర్జునుడు, గుంటూరు-జీవీఎస్ ఆంజనేయులు, ప్రకాశం-దామచర్ల జనార్దన్, నెల్లూరు-బీద రవిచంద్రయాదవ్, చిత్తూరు-వెంకటమణి […]
Category: Latest News
`నంద్యాల`లో అఖిలప్రియను ఒంటరి చేస్తున్నారా?
నంద్యాల ఉప ఎన్నిక మంత్రి భూమా అఖిలప్రియకు పరీక్ష పెట్టబోతోందనే చర్చ టీడీపీలో మొదలైంది. తమ వర్గానికే సీటు కేటాయించాలని అధిష్టానం వద్ద తీవ్రంగా పట్టుబట్టి.. చివరకు తన మాటే నెగ్గించుకున్నారు. అయితే ఇక్కడితోనే అయిపోలేదని.. ఆ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ఆమె బలం తెలుస్తుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని తీవ్ర పట్టుదలతో ఉన్న తరుణంలో.. అఖిలప్రియ రాజకీయ పరిణితి, వ్యూహాలకు ఇదొక పరీక్షలా మారబోతోందని అంతా భావిస్తున్నారు. […]
ఏపీలో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమా..!
తెలుగు మాట్లాడే ప్రజలందరికి ఒకే రాష్ట్రం ఉండాలన్న ఉద్దేశంతో ఒకే భాష – ఒకే రాష్ట్రం నినాదంతో తెలుగు ప్రజలంతా మద్రాసోళ్లపై ఫైటింగ్ చేసి, చివరకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో మనం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం సాధించుకున్నాం. తెలుగు భాషమాట్లాడే వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కల ఏర్పాటు అయిన కొద్ది సంవత్సరాలకే ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ నినాదాలు, ఉద్యమాలు హీటెక్కాయి. అవి కాస్త చల్లారినా 2014లో రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోక తప్పలేదు. వెనకబాటు తనమే తెలుగు […]
ఐదోసారి నియోజకవర్గం మారుతోన్న గంటా..!
చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు రాజకీయ ఊసరవెల్లి అనే బిరుదు నూటికి నూరుశాతం వర్తిస్తుంది అనడంలో సందేహమే లేదు. ఆయనకు రాజకీయాల్లో పార్టీ, నైతిక విలువలు ఏ కోశాన ఉన్నట్టు కనపడవు. ఆయనకు కావాల్సింది పదవీ, డబ్బే అన్నచందంగా ఆయన రాజకీయం చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు గత దశాబ్దంన్నర కాలంలో చూసుకుంటే టీడీపీ – ప్రజారాజ్యం – కాంగ్రెస్ – తిరిగి టీడీపీ ఇలా అన్ని పార్టీలు మారారు. ఒక్క వైసీపీలోకే ఆయన వెళ్లలేదు. […]
నెల్లూరు వైసీపీలో టిక్కెట్ల రగడ
వైసీపీకి ముందునుంచి బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీలో నాయకుల మధ్య కాక రేగుతోంది. వచ్చే ఎన్నికలకు మరో 20 నెలల టైం ఉన్న వేళ వైసీపీ పార్టీ బలోపేతానికి గడప గడపకు వైసీపీతో పాటు ప్లీనరీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కావలి నియోజకవర్గ ప్లీనరీలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోను కావలి టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందని ప్రకటించారు. ప్రతాప్‌కుమార్ రెడ్డి కష్టకాలంలో వైసీపీ అధినేత జగన్‌కు […]
మియాపూర్ కుంభకోణం: బ్రోకర్‌గా మారిన దమ్మున్న మీడియా ఎండీ
తెలంగాణ రాజకీయాల్లో మియాపూర్ భూకుంభకోణం కేసు ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. నిన్నటి వరకు అక్కడ టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనేందుకు కూడా ప్రతిపక్షాలు సాహసించని పరిస్థితి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మియాపూర్ భూకుంభకోణం ఇష్యూలో టీఆర్ఎస్ నాయకుల పేర్లు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అది అక్కడ నిద్రాణంగా ఉన్న ప్రతిపక్షాలకు పెద్ద వరంలా మారింది. దీనిని బేస్ చేసుకుని టీఆర్ఎస్‌తో పాటు సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విరుచుకుపడుతున్నాయి. ఈ ఇష్యూలో టీఆర్ఎస్ […]
చేతులు కలిసినా…మనస్సులు కలవని ఎంపీ -ఎమ్మెల్యే
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు ఓ ప్రాధాన్యత ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉంటోన్న ఈ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ప్రధాన పార్టీల నాయకుల మధ్య చేతులు కలిసినా…మనస్సులు మాత్రం కలవడం లేదు. అధికార టీడీపీ విషయానికే వస్తే ఇక్కడ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత వర్గాలు ఉన్నాయి. ఈ రెండు వర్గాలకు అస్సలు పొసగడం లేదు. ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డం అనే […]
టీటీడీ చైర్మన్ ఎంపికలో బాబు నయా వ్యూహం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం లభించడమే ఎన్నో జన్మ ల పుణ్యం ఉండాలంటారు పెద్దలు. అలాంటి శ్రీవారికి ఆయన సన్నిధిలో సేవచేసే భాగ్యం వస్తే.. అది కూడా పాలక మండలి చైర్మన్ గా పనిచేసే భాగ్యం లభిస్తే.. అందుకే.. చాలా మంది ఒక్కసారైనా టీటీడీ చైర్మన్ అయితే చాలు! అనుకుంటారు ఇప్పుడు ఆ చైర్మన్ పదవి త్వరలోనే ఖాళీ కాబోతోంది. ప్రస్తుతం ఉన్న చదలవాడ కృష్ణమూర్తి పదవి కాలం త్వరలోనే ముగియనుంది. […]
ఆ ఏపీ మంత్రి వసూళ్ల దందా
ఏపీలో సీఎం చంద్రబాబు తర్వాత ఆ రేంజ్‌లో క్రేజ్ తానొక్కడికే ఉందని ఆ మంత్రి ఎప్పుడూ గొప్పలు పోతుంటారు. మీడియా వర్గాల్లోను ఆయన పదే పదే అలాగే చెప్పుకుంటూ ఉంటారు సుమా..! ఆ స్వయం ప్రకటిత నిప్పు మంత్రి జిల్లాలో తాను తప్ప పార్టీలోనే ఎవ్వరిని ఎదగనీయరన్న విమర్శ ఉంది. ఇది విమర్శే కాదు నిజమే. ఇక అవినీతి అనేది తన ఇంటా వంటా లేదని గొప్పలు పోయే ఆ మంత్రి ఇప్పుడు చిన్నా చితకా స్థాయిలో […]
