ఏపీలో రాజకీయాలు రోజుకో విధంగా మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేంద్రంపై నిప్పులు చెరిగిన జగన్ ఇప్పుడు మోడీ పక్షం అయిపోయాడు. తమకు ఏదో ఒక ఆ ధారం దొరక్కపోతుందా అని ఎదురు చూసే వామపక్షాలు ఇప్పుడు కొత్తగా జనంలోకి వచ్చిన జనసేనకి జై కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు అధికార పార్టీ టీడీపీకి ఇదే విషయమై చెమటలు పడుతున్నాయట. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు ఇప్పటికే తన పార్టీ తమ్ముళ్లకు […]
Category: Latest News
దాసరి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి గొడవలా..?
దర్శకుడు దాసరి నారాయణరావు మరణాన్ని ప్రస్తుతం తెలుగు వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఈ దిగ్గజదర్శకుడు ఆకస్మిక మరణంతో తెలుగు ప్రజలందరూ ఓ వైపు బాధపడుతుంటూ మరోవైపు దాసరి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి చిచ్చు మొదలైనట్టు ఆ ఫ్యామిలీ మెంబర్స్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. దాసరి మృతిపట్ల ఓ వైపు దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతుంటే దాసరి పెద్ద కోడలు సుశీల మాత్రం దాసరిది సహజ మరణం కాదని…ఆయన మరణం ఆస్తి కోసం జరిగి ఉండవచ్చన్న […]
ఓ బలమైన రాజకీయ పార్టీ పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు ..అడ్డుకుందెవరు?
దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు పాలిటిక్స్‌లో ఓ సంచలనం. తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడికి ఓ ఇమేజ్ తెచ్చిన ఘనత దాసరిదే. ప్రపంచ సినిమా చరిత్రలో ఓ దర్శకుడు 100 సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ముందుగా దాసరికే దక్కింది. అలాగే 150 సినిమాలు చేసిన ఏకైక దర్శకుడు కూడా దాసరే. దాసరి కెరీర్లో మొత్తం 151 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక సినిమా రంగంలో గురువుగా శాసించిన దాసరి ఎంతోమందిని వెండితెరకు పరిచయం చేసిన ఘనత […]
వైసీపీలో ఆ ఇద్దరు సిట్టింగ్‌లకు నో టిక్కెట్
గత ఎన్నికలకు ముందు వరకు ఎన్నికల్లో తానే గెలుస్తానని తిరుగులేని మెజార్టీతో సీఎం అవుతానని వైసీపీ అధినేత జగన్ ఎంతో ధీమాతో ఉండేవారు. ఎన్నికల ముందు వరకు ఎంతో ధీమాతో ఉన్న జగన్ ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లాపడ్డాడు. ప్రతిపక్ష నేతగా సరిపెట్టుకున్నాడు. ఎన్నికల తర్వాత కూడా జగన్ రోజు రోజుకు రాజకీయంగా వీక్ అవుతూ వస్తున్నాడు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 21 మంది అధికార టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్రమంలోనే […]
రజనీ పార్టీలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు..
తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే అక్కడ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రజనీ పార్టీలోకి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చేరేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక కోలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్లు నమిత, మీనా కూడా తాము రజనీకి మద్దతుగా ఉంటామని ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఇలా ఉండగానే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రజనీ పార్టీ ప్రకటన […]
టిక్కెట్లుతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తాం
బుల్లి తెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పైకి అటు నుంచి రాజకీయల్లోకి వచ్చిన వారిని మనం చూశాం… చూస్తున్నాం.. అయితే, తాజాగా తెలంగాణలో మాత్రం బుల్లి తెర నుంచే నేరుగా పోలిటికల్ ఆఫర్ సంపాయించేసిన యాంకర్లను చూస్తే.. వారి లక్కే లక్కని ముక్కున వేలేసుకోకుండా ఎవరూ ఉండలేరు. మరి విషయం ఏంటో చూద్దాం.. తెలంగాణలో బిత్తిరి సత్తి.. సావిత్రిలు మంచి పాపులర్ ఫిగర్స్. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. ఇక సత్తి […]
చంద్రబాబు అభివృద్ధిని పరోక్షంగా ఒప్పుకున్న అంబటి
ఏపీ సీఎం చంద్రబాబుపై ఎప్పటికప్పుడు ఫైరయ్యే వైసీపీ అధికార ప్రతినిధ అంబటి రాంబాబు తాజాగా చేసిన కామెంట్లు కలకలం రేపాయి. బాబును తిట్టిపోస్తున్నాను అని అనుకుంటూనే.. ఆయన ప్రభుత్వాన్ని పరోక్షంగా పొడిగేశాడు అంబటి. నాలుగు రోజుల కిందట ముగిసిన మహానాడులో లోకేష్, చంద్రబాబు ల ప్రసంగాలకు కౌంటర్‌గా అంబటి మాట్లాడారు. అయితే, ఆయన తిడుతున్నాను అనుకుని బాబు పాలనను పెద్ద ఎత్తున పొగడడమేకా కుండా బాబు చెబుతున్న విషయాలను పరోక్షంగా అంగీకరించేశాడు. అవేంటో చూద్దాం. హైదరాబాద్ లో […]
గుంటూరు జిల్లా హత్య కేసు.. పరారీలో ఆ పార్టీ ఎమ్మెల్యే
గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్య కేసుకు సంబంధించి విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పరారీలో ఉన్నారు. పల్నాడులోని మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పాపిరెడ్డి హత్య కేసులో పదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన తాడిపర్తి పాపిరెడ్డిని ఈ నెల 17న వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు కత్తులు, రాడ్లతో తీవ్రగా గాయపరచడంతో ఆయన మృతి చెందారు. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గత ఎన్నికల టైంలో కండ్లకుంట గ్రామం రెండు […]
రేవంత్ రెడ్డి పాలిటిక్స్.. అదిరాయి! ఏపీలో ముద్దు.. తెలంగాణలో వద్దు!
పాలిటిక్స్ అన్నాక ఎక్కడేసే తాళం అక్కడ వేయాల్సందే! అయితే, అది సృతి తప్పకుండా మాత్రం చూసుకోవాలి. ఏ మాత్రం సృతి తప్పినా.. నాటకం బయటపడిపోవడ ఖాయం! ఇప్పుడివన్నీ ఎందుకంటే.. టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి.. చేస్తున్న వ్యాఖ్యలు డబుల్ రోల్ పాలిటిక్స్‌ని తలపిస్తున్నాయి. ఏపీలో ఉంటే ఒకలాగా, తెలంగాణలో ఉంటే మరోలాగా మాట్లాడడం రేవంత్‌కి అలవాటైపోయిందట! ఇప్పుడు ఆయన వైఖరిపై తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు. నాలుగు రోజుల కిందట విశాఖలో జరిగిన టీడీపీ మహానాడుకు రేవంత్ […]