2019లో ఎలాగైనా సరే ఏపీలో సీఎం సీటును కైవసం చేసుకుని తీరాలని గట్టి పట్టుమీదున్న వైసీపీ అధినేత జగన్ అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన ఐఐటీయెన్, గతంలో 2014 ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్‌ను ఖరీదు ఎక్కువైనా భరాయించి మరీ జగన్ తన సలహాదారుగా నియమించుకున్నాడు. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలకు రెండేళ్లకు పైగానే సమయం ఉండగా… పీకే మాత్రం రంగంలోకి దిగిపోయాడు. జగన్‌కి పలు […]
Category: Latest News
డ్రగ్స్ విచారణ మీకెందుకు…మంత్రులపై కేసీఆర్ ఫైర్
హైదరాబాద్‌లో డ్రగ్స్ విచారణ టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నా కేసీఆర్ మాత్రం ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. విచారణలో ఎవరి జోక్యం లేకుండా చూస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసిన సిట్ రోజుకు ఒక్కరి చొప్పున విచారిస్తోంది. ఇప్పటికే 9 మందిని విచారించిన సిట్ మరో ముగ్గురిని విచారించనుంది. ఇక వీరు చెప్పిన ఆధారాలను బేస్ చేసుకుని […]
కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఇంత కుట్ర ఉందా?
`అమరావతి నిర్మాణానికి మా వంతు సహకారం అందిస్తాం. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా అందిస్తాం` ఇదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు!! కానీ ఇప్పుడు ఆయనే ఏపీ అభివృద్ధికి మోకాలడ్డే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇందుకు బీజేపీ నేతలు కూడా అంతర్గతంగా చేయూతనిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు! ఇటీవల ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఏపీలోని రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వీటి […]
టీడీపీకి మరో షాక్… వైసీపీ గూటికి కీలక నేత
నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు, జగన్ ఇద్దరు తమ టీంను అంతా ఇక్కడ మోహరించారు. టీడీపీ నుంచి ఆరుగురు మంత్రులు, 13 మంది ఎమ్మెల్యేలను బాబు ఇక్కడ మోహరిస్తే జగన్ ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి రంగంలోకి దించారు. ఇక ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందే నంద్యాలలో మంచి పేరున్న మాజీ ఎమ్మెల్యే […]
టీడీపీలో మళ్లీ పాత రోజులు.. నేతలకు బాబు దూరం!
టీడీపీలో కథ మళ్లీ మొదటికి వస్తోందా? చంద్రబాబు నేతలకు దూరం అవుతున్నారా? కేడర్‌ను అస్సలు పట్టించుకోవడం లేదా? 1990ల నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఉమ్మడి ఏపీలో 23 జిల్లాలకు సీఎంగా ఉన్న సమయంలోనూ ఇప్పుడు కేవలం 13 జిల్లాలకు సీఎం గా ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు అప్పట్లో ఎంత బిజీగా ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే బిజీగా ఉండడం గమనార్హం. అయితే, ఇక్కడ విషయంలోకి వచ్చేసరికి ఆయన అప్పట్లో […]
నంద్యాల వార్ భూమా, శిల్పాది కాదు బాబు-జగన్ మధ్యే
భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నిక త్వరలోనే జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే, ఈ ఉప ఎన్నికపై అంచనాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. వాస్తవానికి ఈ ఉప ఎన్నిక పార్టీ ల మధ్య కాకుండా పార్టీ అధినేత ల మధ్య ఫైట్‌గా మారిపోయింది. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేతగా బాబుకు, యువనేతగా జగన్‌కు మధ్య సాగుతున్న పోరుగా నంద్యాల […]
సిట్ విచారణలో మాస్ మహరాజ్ ఏం చెప్పాడంటే
టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోన్న డ్రగ్స్ ఉదంతంలో తొమ్మిదో రోజు టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. శుక్రవారం రవితేజ జూబ్లిహిల్స్‌లోని తన ఇంటి నుంచి నాంపల్లిలోని అబ్కారీ భవనానికి చేరుకున్నాడు. ఉదయం 10.30 గంటలకు రవితేజ విచారణ ప్రారంభమైంది. కెల్విన్ మొబైల్ కాల్ డేటాలో రవితేజ ఫోన్ నంబర్ ఉండటం.. విచారణలో కెల్విన్ రవితేజ పేరు చెప్పడంతో సిట్ అధికారులు రవితేజకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక రవితేజకు కెల్విన్‌కు […]
బీజేపీలోకి చిరు.. ఏపీలో పొలిటికల్ తుఫాన్?
మెగాస్టార్ చిరంజీవి పార్టీ మారబోతున్నారా? ఆయనను బీజేపీ దువ్వుతోందా? ఏపీలో 2019లో జరగబోయే ఎన్నికల బాధ్యతను సైతం ఆయనకు అప్పగించాలని హైకమాండ్‌కు మెసేజ్‌లు వెళ్తున్నాయా? రాబోయే కొద్ది రోజుల్లోనే చిరు కాషాయ దళంలో చేరడం ఖాయమా? అంటే ఔననే సమాధానమే వస్తోంది బీజేపీ నేతల నుంచి! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్రజారాజ్యం పార్టీతో ఎంట్రీ ఇచ్చిన చిరు.. తర్వాత కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనం చేసి.. ఏకంగా రాజ్యసభకు వెళ్లిపోయారు. […]
ఏపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా లోకేష్..!
చంద్రబాబు ప్రభుత్వంలో కాసింత లేటుగా అరంగేట్రం చేసినప్పటికీ.. ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రేంజ్ మాత్రం ప్రస్తుతం పీక్ స్టేజ్‌కి చేరిపోయిందట! ప్రస్తుతం ఆయన ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు. అయినా కూడా ప్రజలు అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమస్యలను లోకేష్‌కే విన్నవిస్తున్నారట. అంతేకాదు, సచివాలయానికి వెళ్తున్న ప్రజలు పనున్నా లేకపోయినా.. లోకేష్‌ను చూడందే బయటకు రావడం లేదట. దీంతో ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ సెంటరాఫ్‌ది మేటర్‌గా మారిపోయాడని అంటున్నారు […]
