అమ‌రావ‌తి పూలింగ్‌పై ప్ర‌పంచ బ్యాంకు త‌నిఖీలు!

సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి క‌ల‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా లేవు. ఏ ముహూర్తాన ఆయ‌న అమ‌రావ‌తికి ప్లేస్ డిసైడ్ చేసుకున్నాడో.. అప్ప‌టి నుంచి క‌ష్టాలు ప‌డుతూనే ఉన్నాడు. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి కోసం చేసిన ల్యాండ్ పూలింగ్‌పై ప్ర‌పంచ బ్యాంకు త‌నిఖీ కొర‌డా ఝ‌ళిపిస్తోంది. బాబు చేసిన ల్యాండ్ పూలింగ్‌తో తాము న‌ష్ట‌పోయామ‌ని పేర్కొంటూ రాజ‌ధాని ప్రాంత రైతులు ఇప్ప‌టికే ప్ర‌పంచ బ్యాంకుకు లేఖ రాశారు. మొద‌ట్లో బ్యాంకు అధికారులు ఇది మామూలే క‌దా అనుకున్నా.. లేఖ‌ల ప‌రంప‌ర […]

నంద్యాల ఓట‌ర్ల‌కు టీడీపీ బంప‌ర్ ఆఫ‌ర్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ.. ఇప్ప‌టినుంచే ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు నేత‌లు ప్రచారం ప్రారంభించేశారు. ఇంకా ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా ప్రారంభం కాక‌ముందే.. వాగ్థానాలు జోరందుకున్నాయి. పట్ట‌ణ‌ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు టీడీపీ కేబుల్ కనెక్ష‌న్ ఫ్రీ అంటూ ప్ర‌క‌టించ‌డం.. దీనికి కౌంట‌ర్‌గా వైసీపీ కూడా బ‌దులివ్వ‌డం ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇంకా ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఈసీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌ముందే.. ఇలా హామీలు గుప్పిస్తుంటే.. […]

రామోజీ – రాధాకృష్ణ చంద్ర‌బాబుకు ఎవ‌రు ఎక్కువ‌..!

మీడియా మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేర‌నే చెప్పుకోవాలి! ముఖ్యంగా అల‌నాడు ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ఈనాడుతోనే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాయించి.. ప‌ద‌వి నుంచి దింపించేశారు. ఆ త‌ర్వాత అదే ప‌త్రిక ఆయ‌న‌కు అండ‌గా నిలబడుతూ వ‌స్తున్న విషయం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు ఈనాడు ప‌త్రికను ప‌క్క‌న పెట్టేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. దాని కంటే మిన్న‌గా, ప్ర‌భుత్వాన్ని భుజాల‌పై మోస్తున్న ఆంధ్ర‌జ్యోతిని అంద‌లం ఎక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి […]

ఆ ఓట్లు ఎవ‌రివైపు ఉంటే వారిదే నంద్యాల‌

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్ధిగా శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. గత ఎన్నికలను పరిశీలిస్తే… అప్పటి వైసీపీ అభ్యర్ధి భూమా నాగిరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. దీంతో […]

ఒకరు రాజకీయ పండితుడు మరొకరు వర్గ బలం ఉన్నవాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సీట్ల ఖ‌ర్చీఫ్ వేట అప్పుడే మొద‌లైంది. ఈ ఫైటింగ్ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను, అన్ని పార్టీల‌కు చెందిన నాయ‌కుల్లోను క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన రాజ‌మండ్రి లోక్‌స‌భ వైసీపీ సీటు కోసం ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల మ‌ధ్య ఫైట్ న‌డుస్తోంది. టిక్కెట్ విష‌యంలో వీరిద్ద‌రు నేరుగా త‌ల‌ప‌డ‌కున్నా త‌మ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వీరిద్ద‌రు అదే స్థానంపై క‌న్నేశారు. వైసీపీలో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయిన పిల్లి […]

ఏలూరు టీడీపీ ఎంపీ సీటు మాగంటిదా ?  రాజీవ్‌దా ?

ప‌శ్చిమగోదావ‌రి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట‌. ఈ కంచుకోట‌లో జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు ఎంపీ సీటు కోసం ఇప్పుడు పార్టీలో ఆస‌క్తిక‌ర ఫైటింగ్ జ‌రుగుతోంది. ఇది పైకి పెద్ద‌గా క‌నిపించ‌క‌పోయినా ఈ ఎంపీ సీటుపై క‌న్నేసిన ఓ యంగ్ లీడ‌ర్ తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు తాను చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుత సిట్టింగ్ ఎంపీ మాగంటిబాబు వివాద ర‌హిత రాజ‌కీయాలు చేస్తూ సౌమ్యుడిగా పేరున్న వ్య‌క్తి. త‌న ఫ్యామిలీకి కాంగ్రెస్‌తో ఉన్న ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న మాగంటి టీడీపీలోకి వ‌చ్చారు. […]

శిల్పా జ‌గ‌న్ నుంచి టిక్కెట్ ఎలా!

నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి ముందే ఖ‌రార‌య్యాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. దీనిని ఏక‌గ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. మ‌రోప‌క్క వైసీపీ నుంచి అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్ రెడ్డి పేరును జ‌గ‌న్ ప్ర‌క‌టించేశాడు. అయితే, ఇక్క‌డే అంద‌రికీ అర్ధం కాని ఓ విష‌యం ఉంది. వాస్త‌వానికి ఈ సీటును నంద్యాల వైసీపీ ఇంచార్జ్ రాజ‌గోపాల్ రెడ్డి ఆశించారు. ఆయ‌న‌కు ఇస్తాన‌ని జ‌గ‌న్ కూడా హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో […]

ఎంఐఎంకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్నాయి. తొలుత ఏక‌గ్రీవం చేయాల‌ని బీజ‌పీ నేతృత్వంలోని ఎన్‌డీఏ భావించినా.. అనూహ్యంగా కాంగ్రెస్ ఇత‌ర ప‌క్షాలు సైతం అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంతో పోటీ అనివార్య‌మైపోయింది. ద‌ళితుడు, రాజ్యాంగ కోవిదుడు అంటూ.. ఎన్‌డీఏ బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్ర‌క‌టించింది. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క‌సారిగా మ‌తిపోయింది. ఇంత‌లోనే తేరుకుని, ఆయ‌నకు కూడా ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం ఉంద‌ని, కాబ‌ట్టి ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ప్ర‌స‌క్తిలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలోనే మాజీ […]

బ్రాహ్మ‌ణుల‌ను వాడేస్తున్న పొలిటిక‌ల్ నేత‌లు! 

రాష్ట్రంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్య‌వ‌హారంతో పాలిటిక్స్ అన్నీ ఒక్క‌సారిగా బ్రాహ్మ‌ణుల చుట్టూ చేరిపోయాయి. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ నుంచి ఐవైఆర్‌ను తొల‌గించ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌డుతున్న విపక్షం వైసీపీ.. ఈ విష‌యానికి కాస్త పొలిటిక‌ల్ క‌ల‌రింగ్ ఇచ్చి బెనిఫిట్ పొందేందుకు తీవ్రంగా య‌త్నిస్తోంది. మ‌రోప‌క్క‌, చంద్ర‌బాబుపై పీక‌ల్లోతు ఆగ్ర‌హంతో ఉన్న కాపు ఉద్య‌మ నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కూడా ఇప్పుడు బ్రాహ్మ‌ణుల‌ను సెంట్రిక్‌గా తీసుకుని కామెంట్లు చేశారు. 2019లో బ్రాహ్మ‌ణులు అంతా ఏక‌మై బాబుకు […]