టీడీపీని నమ్ముకుని ఎన్నో త్యాగాలు చేసిన సీనియర్లకు చంద్రబాబు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉండడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ల కోసం తమ సీట్లు వదులుకుని త్యాగాలు చేసిన వాళ్లకు చంద్రబాబు సింపుల్‌గా కార్పొరేషన్ పదవులతో సరిపెట్టేశారు. తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆహార భద్రత కమిషన్‌కు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జె.ఆర్.పుష్పరాజ్‌ను నియమించాలని […]
Category: Latest News
నంద్యాలలో గెలుపునకు చంద్రబాబు పదవుల అస్త్రం
ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏ ఒక్క పదవి భర్తీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఏవైనా పదవులు భర్తీ చేయాలంటే నాన్చి నాన్చి మరీ చేస్తున్నారు. తాజాగా ఆయన 8 కార్పొరేషన్ల పదవులు భర్తీ చేశారు. ఇదిలా ఉంటే నంద్యాల ఉప ఎన్నిక వేళ ఆ నియోజకవర్గ టీడీపీ నేతల పంట పండనుంది. ఇక్కడ గెలుపు కోసం చంద్రబాబు ఏకంగా పదవులు అస్త్రాన్నే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల వరద పారిస్తోన్న […]
జనసేన టాపిక్‌లో పవన్ కళ్యాణ్ సీరియస్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అందరితోను చాలా కలుపుగోలుగా ఉండడంతో పాటు అందరిని ఆదరిస్తారన్న సదభిప్రాయం ఆయనపై అందరికి ఉంది. పవన్ ఏ విషయంలోను ఎవ్వరిని నొప్పించకుండా ఉంటారు. అయితే అలాంటి పవన్‌కు ఓ వ్యక్తి చాలా కోపం తెప్పించడంతో పాటు పవన్ ఆగ్రహానికి గురయ్యాడని తెలుస్తోంది. పవన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఓ […]
ఆంధ్రజ్యోతితో క్లోజ్‌గా ఉండే వైసీపీ నాయకుల పని అంతే..!
ప్రస్తుతం తెలుగు మీడియాలో చాలా పత్రికలు పార్టీలకు కరపత్రికలుగా మారిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలు – పత్రికలు కరపత్రికలు అన్న అంశంపై తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా చర్చ జరుగుతోంది. ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీకి అనుకూలంగా మీడియా చీలిపోయిందన్నది నిజం. ఈ క్రమంలోనే వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను టీడీపీ వాళ్లు తమ సభలు, సమావేశాలకు అనుమతించడం లేదు. ఇక టీడీపీకి అనుకూలంగా కొమ్ముకాస్తోన్న మీడియా సంస్థలను వైసీపీ వాళ్లు అలాగే చేస్తున్నారు. గతంలో […]
టీడీపీ జంపింగ్‌కు కేసీఆర్ షాక్ తప్పదా..!
రెండు తెలుగు రాష్ట్రాల్లోను జంపింగ్‌ల జోరు ఎక్కువగానే కొనసాగుతోంది. ఈ జంపింగ్‌ల పర్వం ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువుగా కొనసాగుతోంది. తెలంగాణలో కేసీఆర్ దెబ్బతో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైసీపీ, సీపీఐలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు గులాబి గూటికి చేరిపోయారు. అత్తెసరు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల దెబ్బతో తిరుగులేని మెజార్టీతో ఉంది. ఇదిలా ఉంటే ఇతర పార్టీల నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలందరికి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామన్న హామీతో […]
టీడీపీ ఎమ్మెల్యేపై కమిషనర్‌కు ఫిర్యాదు
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే! నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం! ఆయన గీసిన గీత దాటితే ఇక అంతే సంగతులు! భూవివాదాలా, ఆర్థిక వివాదాలా, వ్యక్తిగత సమస్యలా.. ఇలా సమస్య ఏదైనా ఆయన తీర్పు ఇచ్చాక ఇక దానికి తిరుగుండదు! నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకుని.. అన్ని వ్యవస్థలను అదుపాజ్ఞల్లో పెట్టుకుని సెటిల్‌మెంట్లు, దందాలకు మారుపేరుగా మారిన ఆ `రాయుడి`కి ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. వడ్డీ వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపుతామంటూ ఒక పక్క చంద్రబాబు ప్రకటనలు చేస్తూ, […]
`నంద్యాల`పైనే వైసీపీ ఆశలు
విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడని నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి సీఎం పీఠమెక్కించారు. మరి మూడేళ్లు గడిచిపోయాయి. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారా? ప‌్రతిపక్ష నేత జగన్‌ను ఈసారి ప్రజలు ఎంత వరకూ నమ్ముతారు? ప‌్రజా నాడి ఎలా ఉందనేది ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల ద్వారా వీటికి కొంతవరకూ సమాధానం దొరకవచ్చని అంతా భావిస్తున్నారు. అందుకే టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని […]
వెంకన్నను కూడా పట్టించుకోలేనంత బిజీనా బాబూ..!
వరుస సమీక్షలు, సమావేశాలు, రాజకీయ వ్యవహారాలు.. ఇలా నిత్యం తలమునకలై ఉండే సీఎం చంద్రబాబు.. తిరుమల వేంకటేశ్వరుడి పాలనా వ్యవహారాలు మాత్రం పట్టించుకోవడం లేదు. టీటీడీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలో తెలియక.. సతమతమవుతున్న ఆయన.. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీని కూడా నియమించుకుండా మీనమేషాలు లెక్కిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే! ఇదే సమయంలో అథారిటీని కూడా నియమించకుండా కాలయాపన చేస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది. సాక్ష్యాత్తూ […]
ఒకే జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!
ఈ హెడ్డింగే చాలా షాకింగ్‌గా ఉన్నట్టు కనిపిస్తోందా ? ఒకే జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేయడమా ? ఇది నిజమేనా ? అన్న అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతాయి. అయితే ఆ జిల్లాలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలు మాత్రం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న సంకేతాలే ఇస్తున్నాయి. ఆ జిల్లా రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లా కాగా….ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మాజీ మంత్రి, ప్రత్తిపాడు […]