ఇటీవల నగరంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ‘భారత రాజ్యాంగం’ నిర్మాణం పై చిత్రించిన ‘ప్రవేశిక’లో పలు కీలక పదాలను విస్మరించి రాజ్యాంగాన్ని అవమానించారంటూ ‘కుడా’ వైస్-చైర్మన్ కు నగరానికి చెందిన న్యాయవాది ఎన్నంశెట్టి అఖిల్ లీగల్ నోటీసు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రవేశిక లోని కీలకమైన ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’, ‘మరియు ఇంటెగ్రిటీ’ పదాలు భారత రాజ్యాంగం యొక్క ‘ప్రాథమిక నిర్మాణం’లో భాగమని, వాటిని మార్చగలిగే అధికారం పార్లమెంటుకు కూడా లేదని […]
Category: Latest News
ఫీజయినా చెల్లించండి.. లేదంటే కిడ్నీల అమ్మకానికి అనుమతివ్వండి..!
పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతారు. ప్రాణాలను సైతం ఫణంగా పెడతారు. తమ చెమటనే కాదు రక్తాన్ని కూడా ధార పోసేందుకు వెనకాడారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. తమ కూతురు ఎంబీబీఎస్ చదువు కొనసాగించడానికి పరీక్ష పీజు కట్టేందుకు డబ్బులు లేకుండా పోయాయని, ఏకంగా తమ అవయవాలను అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు ఆ తల్లిదండ్రులు. అందుకోసం అనుమతి ఇవ్వాలని వారు ఏకంగా అధికారులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. తల్లిదండ్రుల దయనీయ పరిస్థితికి అద్దం […]
కేటీఆర్‌పై హెచ్ఆర్‌సీలో మహిళ ఫిర్యాదు..! ఎందుకంటే..
ఇటీవల మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. రూ.1700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైనా దృష్టిసారించారు. గులాబీ నేతలతో సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయమే పురపాలక ఎన్నికల నిర్వహణకు నగారా మోగడం గమనార్హం. అదలా ఉంచితే మంత్రి కేటీఆర్ పై ఓ మహిళ ఏకంగా మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం సంతరించుకుంది. ఎన్నికల వేళ ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల్లోకి […]
కరోనా టీకా వికటించి సర్పంచ్ మృతి..!
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్ 18న […]
తెలంగాణలో పురపోరకు మోగిన నగారా..
తెలంగాణ రాష్ట్రంలో పురపోరు మొదలైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలుకానుంది. అదే రోజున రిటర్నింగ్ అధికారులు తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. 19న నామినేషన్ల పరిశీలన ఉండగా… 20న తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 21న […]
సుదీప్ “విక్రాంత్ రోణ” రిలీజ్ డేట్ ఖరారు..!
కన్నడ పాపులర్ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ. సుదీప్ ఫాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ తేదీని తాజాగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ మూవీ నుంచి ఏప్రిల్ 15న ఒక సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా, మూవీ టీజర్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ మేకర్స్ సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. […]
తెలంగాణ కు మరో కేంద్ర అవార్డు..!
కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థలకు జాతీయ స్థాయిలో 12 అవార్డులు దక్కాయి. అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇలా ఈ మధ్య అవార్డుల మీద అవార్డులు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ తాజాగా మరో అవార్డును కైవసం చేసుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం […]
‘బోర్డర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అయిన అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో సినిమాలు చేసాడు. అందులో కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ, ప్రభాస్ సాహో చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ దగ్గరయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి బోర్డర్ అనే […]
సెహరి’ టీజర్ తేదీ ఖరారు..!
టాలీవుడ్లో హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సెహరి. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ […]