ముక్కు మొఖం తెలియని వారితో చాటింగ్ చేయవద్దని పోలీసులు నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా కొందరు వినడం లేదు. అవతలి వ్యక్తి అమ్మాయి అయితే చాలు గుడ్డిగా నమ్మి ఫాలో కావడమే. తరువాత సమస్యల్లో చిక్కుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇక మగవారి వీక్‌నెస్‌ను ఆసరాగా చేసుకున్న ఓ కిలేడి ఏకంగా అదే పనిగా పెట్టుకుంది. తొలుత మారుపేర్లతో ఎఫ్‌బీలో పరిచయం పెంచుకోవడం, తరువాత వాట్సాప్లో నగ్నంగా వీడియో చాటింగ్‌లు చేయడం, వాటిని అడ్డంగా పెట్టుకుని డబ్బులు డిమాండ్ మొదలు […]
Category: Latest News
రవితేజ-రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్?
అపజయమే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన వెంకటేష్, వరుణ్ తేజ హీరోలుగా ఎఫ్3 అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో వచ్చి సూపర్ డూపర్ హిట్టైన ఎఫ్2 చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అనిల్ మరో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని […]
నేడే ఓట్ల లెక్కింపు..అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే?!
దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరిచి లెక్కించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్‌కు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఎన్నికలు జరిగిన […]
ఖాతాదారులకు ఎస్‌బీఐ తీపికబురు..!
తన ఖాతాదారులకు ఎస్‌బీఐ తీపికబురును అందించింది. కేవైసీ, ఇతర పనుల కోసం ఎవరూ కూడా బ్యాంకుకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన గడువును పొడగించింది. ఇదిలా ఉండగా.. ఎస్‌బీఐలో పలు బ్యాంకుల విలీనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులందరూ తమ కేవైసీని సమర్పించాలని సూచించింది. అందుకు మే 31వ తేదీ చివరి గడువుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అక్కడితో ఆగకుండా ఆ తేదీలోగా కేవైసీ సమర్పించకపోతే ఖాతాలను నిలిపివేస్తామనే […]
ఈటలకు బీజేపీ అమిత్‌షా ఫోన్..?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురైన మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతలు అప్పుడే సంప్రదింపులకు తెరలేపారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు షామిర్‌పేట్‌లోని తన ఫామ్ హౌస్‌కే పరిమితమైన ఈటల అక్కడ తన నియోజకవర్గ అభిమానులతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. […]
అనసూయ హాట్ అందాలు..చూస్తే అదరహో అనాల్సిందే!
అనసూయ భరధ్వాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా దూసుకుపోతున్న ఈ భామ.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా మెరుస్తుంటుంది. ప్రస్తుతం ఈమె నటించిన థ్యాంక్ యూ బ్రదర్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా.. పుష్ప, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా కూడా కొన్ని ఫొటోలు షేర్ చేసింది అనసూయ. ఇందులో జీన్స్ ధరించిన […]
గుడ్‌న్యూస్ చెప్పిన మహేష్ బాబు..ఖుషీలో ఫ్యాన్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారు పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉంటుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ మహేష్ గుడ్‌న్యూస్ చెప్పాడు. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లోని […]
కరోనా వైరస్ వల్ల ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్..!
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ బారిన పడి ఎందరో చనిపోతున్నారు. ఈ క్రమంలో అనేక దేశాలు విందులు, వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలు పై నిషేధం విధించాయి. చివరికి ఐపీఎల్ లాంటి టోర్నీలను కూడా ప్రేక్షకులు లేకుండానే జరిగిపోతున్నాయి. ఇలాగే గత సంవత్సరం జరుగాల్సి ఉన్న, టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడింది. కానీ ఈసారి కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రేక్షకులు లేకుండానే జరపనున్నారని సమాచారం. ఈ విషయాన్ని టోక్యో […]
మహారాష్ట్రలో ఫేజ్-3 వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు..!
దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది ఇలా ఉంటె, మహారాష్ట్రలో ఫేజ్-3 వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ అయింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫేజ్-1 టీకా పంపిణిలో భాగంగా 60 ఏళ్ల పైబడిన వారికి, 45 ఏళ్ల పైబడిన రోగులకు వ్యాక్సినేషన్ ఇవ్వటం మొదలు పెట్టారు. అనంతరం ఫేజ్-2లో 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ టీకా ఇవ్వటం షురూ అయింది.ఆ తరువాత ఇప్పుడు ఫేజ్-3లో 18-44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లందరీకి వ్యాక్సినేషన్ […]