సీనియర్ సహాయ నటి హేమ గురించి తెలియని వాళ్లుండరు.ఎక్కడ యే సినిమా ఫంక్షన్ జరిగినా అక్కడ వాలిపోయి అంత తానే అన్నట్టు ఉంటుంది.ఈ మధ్యన పరభాషా సహాయనటుల టాలీవుడ్ మీద దండయాత్ర చేస్తుండడంతో పాపం అమ్మడు పోటీలో కాస్త వెనకపడింది.ఇంకేముంది దీన్ని అధికమించడానికి మొత్తం టాలీవుడ్ తో హీరోలపై పొగడ్తల ఉపన్యాసం దంచేసింది. హేమ ఎన్టీఆర్, బన్నీలతో మొదలుపెట్టి నాగార్జున,బ్రహ్మానందం ఇలా అందరిపై పొగడ్తల వర్షం కురిపించింది. బన్నీ ఎనర్జీ అంటే తనకు చాలా ఇష్టం అని […]
Category: Movies
మెగాస్టార్ బోయపాటి :బాక్సాఫీస్ షేకే
మెగాస్టార్ ప్రస్తుతం తన 150వ చిత్రంలో నటించడంలో బిజీగా ఉండగానే అభిమానులు 151 వ సినిమాగురించి ఆలోచనలు మొదలుపెట్టేశారు.దానికి తగ్గట్టే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొత్తానికయితే చిరంజీవి కూడా 151వ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వరుస చిత్రాలను చేయడానికి సిద్ధవౌతున్నారు. మొన్నామధ్య దాసరి నిర్మాతగా చిరు 151 వ సినిమా వుండబొంతోందని వార్త హల్చల్ చేసింది.తాజాగా మాస్ సెన్సేషన్ డైరెక్టర్,బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను […]
బన్నీ మళ్ళీ బుక్ అవుతాడా:’గమ్మునుండవోయ్’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మరోసారి అల్లు అర్జున్ ఝలక్ ఇచ్చాడు.సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుక గురువారం అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు సింగపూర్లో జరుగనున్న ఈ వేడుకల్లో గురువారం తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను అందించగా, శుక్రవారం తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నారు. కాగా అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర […]
ఆడ, మగ కలవకుండానే
సృష్టి ధర్మం ఏంటంటే, ఆడ మగ కలవడం. ఆ కలయిక సంతానోత్సత్తికి దోహదపడటం. కానీ ట్రెండ్ మారింది. ఆడ, మగ ఒకరితో ఒకరికి పని లేకుండానే సంతానోత్పత్తి జరిగిపోతోంది. బాలీవుడ్ నటుడు తుషార్‌కపూర్ ఇటీవల ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. సుస్మితాసేన్‌కి ఇద్దరు పిల్లలున్నారు. వారిని ఆమె పెంచుకుంటోంది. అమీర్‌ఖాన్ సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు. షారుక్‌ఖాన్ తన భార్య ద్వారా ఇద్దరు పిల్లలకు ముందే తండ్రి అయినా, సరోగసి ద్వారా […]
ప్రభాస్‌తో రాజమౌళి మళ్ళీనా?
ఐదారు హిట్ సినిమాలతో వచ్చే పేరుని ‘బాహుబలి’ సినిమాతో సొంతం చేసుకున్నాడు ప్రభాస్. రాజమౌళితో ఇప్పటికే ‘ఛత్రపతి’ లాంటి హిట్ అందుకున్న ప్రభాస్, ఆ అనుభవంతోనే రాజమౌళి అడగ్గాన్నే బల్క్ డేట్స్‌ని అతనికి ఇచ్చేశాడు. డేట్స్ కాదు, కెరీర్ మొత్తాన్ని రాజమౌళికి ప్రభాస్ సమర్పించేశాడనడం కరెక్ట్. ప్రభాస్ అంతలా తనను నమ్మినందుకుగాను ప్రభాస్‌కి ఇండస్ట్రీ హిట్‌ని రాజమౌళి ఇచ్చేశాడు. ఇంకో హిట్ ఇవ్వడానికి ‘బాహుబలి కంక్లూజన్’ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడితో ఆగిపోదట, ఇంకా వీరిద్దరి ప్రయాణం కలిసే […]
బన్నీ వద్దన్నాడు..సాయిధరమ్ ఓకే చేసాడు
‘సుప్రీమ్’తో మంచి మార్కులు కొట్టేశాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘తిక్క’తో బిజీగా ఉన్న ఈ యువహీరో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మల్టీస్టారర్‌కు సంతకం చేశాడు. నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయాల్సిన పాత్ర ఇదట. గౌతమ్ ముందుగా అర్జున్‌నే కాంటాక్ట్ చేశాడని.. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. అర్జున్ కాదన్నా.. ఆయన బంధువే అయిన సాయికి కథ వినిపించగా వెంటనే ఓకే చేసేశాడని అంటున్నారు. గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్‌లో సాయి ధరమ్ […]
‘కబాలి’ కోసం బాబు… వెయిటింగ్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం రిలీజవుతుందంటే మిగతా సినిమాల దర్శక-నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. ఆ సమయంలో తమ మూవీలు థియేటర్స్‌కు రాకుండా ఉండేందుకు కేర్ తీసుకుంటారు. రజనీ మాయే అంత. ఆయన కలెక్షన్ల సునామీలో తమ సినిమాలు డీలా పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా జాగ్రత్తపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి లెక్కల్లోనే ‘బాబు బంగారం’ యూనిట్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రజనీకాంత్ లేటెస్ట్ పిక్చర్ ‘కబాలి’ జులై మూడోవారంలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ‘బాబు బంగారం’ను తెరపైకి […]
కాశ్మీర్ To హైద్రాబాద్:చెర్రీ చమక్
రామ్‌చరణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ`. ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియర్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. కాప్ లుక్‌కి అవసరమైన విధంగా రూపు రేఖలు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో చిత్రీకరణ సాగుతోంది. అక్కడ 10 రోజుల పాటు టాకీతో పాటు, ఓ సాంగ్‌ని చిత్రీకరించారు. కశ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చరణ్ నేటి (గురువారం) […]