జెనీలియా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మొదట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. `సత్యం` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. చాలా తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా..కొన్నాళ్లు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే జెనీలియా నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను 2012లో ప్రేమ వివాహం చేసుకోగా.. ఈ దంపతులకు రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు […]
Category: gossips
`సలార్`లో శృతీహాసన్ పాత్ర అదేనట?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అపవాదం ఉంది. అయితే దీన్ని సలార్‌తో […]
ఎన్టీఆర్ కోసం మళ్లీ అదే బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్న కొరటాల!?
ప్రస్తుతం ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించబోతున్నాయి. ఎప్రిల్ 29, 2022న విడుదల కానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ పాన్ ఇండియన్ కథ ఎలా ఉండబోతుందనే […]
మెగస్టార్‌తో నటించేందుకు నో.. ఎవరంటే?
తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేంది దర్శకులు, నిర్మాతలు, యువ నటీనటులు ఉవ్విళ్లూరుతుంటారు. ఆయనతో కలిసి నటించడమోక అదృష్టంగానే గాక, అదొక వరంగా భావిస్తుంటారు. కానీ అలాంటి అవకాశం వచ్చినా నటించేందుకు నిరాకరించాడు ఓ యువ నటుడు. కారణాలు ఏమిటో తెలియకపోయినా చిరు సినిమాలో చేసేందుకు మాత్రం విముఖతను వ్యక్తం చేశారు. ఇప్పుడిది చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ […]
బాబాయ్ తర్వాత అబ్బాయే అంటున్న బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మే28న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే అక్కినేని అఖిల్, రామ్, అల్లు […]
కోలీవుడ్ స్టార్ హీరోతో ఎన్టీఆర్ మల్టీస్టారర్..ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే?
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువై పోతున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు కూడా డబుల్ డోస్ మజాని ఇచ్చే మల్టీస్టారర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దాంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ […]
వాయిదా పడ్డా బాలయ్యతో పోటీ తప్పదంటున్న స్టార్ హీరో?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే28న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక బాలయ్యకు పోటీగా అదే రోజు తాను నటిస్తున్న `ఖిలాడి` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు మాస్ మహారాజా రవితేజ ప్రకటించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంల్ మీనాక్షి చౌదరి, […]
నాగ్ చేసిన తప్పు చేయనంటున్న వెంకీ..?!
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకీ.. ఇటీవల దృశ్యం 2 రీమేక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో వెంకీ భార్యగా సీనియర్ హీరోయిన్ మీనా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. […]
`అపరిచితుడు`లో ఛాన్స్ కొట్టేసిన మహేష్ హీరోయిన్!?
ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన `అన్నియన్` చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేసి 2005లో విడుదల చేయగా.. రెండు చోట్ల సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ భారీ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే […]