ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల […]
Category: gossips
నాగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన మెగా ప్రిన్స్?!
మెగా ప్రిన్స్ వరుణ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే చిత్రం చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అలాగే మరోవైపు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3లో వెంకీతో కలిసి నటిస్తున్నాడు వరుణ్. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. మరో ప్రాజెక్ట్‌ను వరుణ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇటీవల వరుణతో ఓ […]
పెళ్లి విషయంలో సుధీర్ కీలక నిర్ణయం..నిరాశలో ఫ్యాన్స్?!
సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ స్టేజ్ మీద చిన్న ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ బుల్లితెరపై స్టార్‌గా అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవలె హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన గాలోడు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే..బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన సుధీర్ పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. […]
కేజీఎఫ్ హీరోను రాజకీయాల్లోకి దింపుతున్న పూరీ?!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. పూరీ త్వరలోనే కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ్ స్టార్ హీరో యష్‌ను రాజకీయాల్లోకి దింపబోతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ […]
నాని `శ్యామ్ సింగరాయ్`కి భారీ నష్టం..ఏం జరిగిందంటే?
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమచారం ప్రకారం.. ఈ చిత్రానికి భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్‌లో […]
నాగ్‌తో `ఆర్ఎక్స్ 100` భామ ఐటెం సాంగ్?
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే సరికొత్త కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తాత, మనవళ్ల మధ్య సాగే స్టోరీగా ఉంటుందని తెలుస్తుండగా.. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా నటించబోతున్నారు. జూన్, జూలైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం […]
చిరంజీవి అల్లుడితో ఉప్పెన డైరెక్టర్..త్వరలోనే..?
చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజేత సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడీయన. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించగా.. కళ్యాణ్ దేవ్ రెండో చిత్రంగా సూపర్ మచ్చి చేశాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ప్రస్తుతం ఈయన అశ్వద్ధామ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో కిన్నెరసాని సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే కళ్యాణ్ దేవ్ త్వరలోనే […]
లెక్చరర్‌గా రంగంలోకి దిగబోతున్న పవన్ కల్యాణ్?!
లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ చేస్తున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ లెక్చరర్‌గా కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. […]
ప్రభాస్ మూవీలో ఆ స్టార్ హీరో భార్యకు బంపర్ ఛాన్స్?!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక ఓ కీలక పాత్ర పోషించబోతోందట. ఈ […]