`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్టర్లు కృతి వైపే చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ భామ.. నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే లింగుసామి, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న […]
Category: gossips
వెంకీకి రేచీకటి, వరుణ్‌కు నత్తి..ఇక ఎంటర్టైన్మెంట్ పీక్సే?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె మళ్లీ ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. […]
ఎన్టీఆర్ అభిమానిగా మారిన మెగా హీరో..గుర్రుగా ఫ్యాన్స్?!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ తేజ్ కొణిదెల ఒకరు. కానీ, మెగా అభిమానులు ఇప్పటి వరకు పవన్‌ను పట్టించుకోలేదనే చెప్పాలి. `ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంతో పవన్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశపడుతున్నాడు పవన్. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. పవన్ తన రెండో సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించబోతున్నాడట. […]
నాని మనసు మార్చిన యంగ్ హీరో..ఖుషీలో ఫ్యాన్స్?!
న్యాచురల్ స్టార్ నాని మనసు మార్చుకున్నాడు.. అది కూడా ఓ యంగ్ హీరోను చూసి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. […]
ప్రభాస్ కోసం బరిలోకి దిగిన జగ్గూభాయ్..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిపిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
ఎస్.. నేనంటే నేనే అంటున్న కేసీఆర్, ఈటల
పేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల నగదు.. ఈ మొత్తంతో దళితులు అభివద్ది చెందుతారు.. అనేక రోజులుగా ఇది నా కల.. ఇప్పటికి ప్రారంభమైంది అని సీఎం కేసీఆర్ చెబుతుండగా.. నేను రాజీనామా చేయడం వల్లే దళిత బంధు వచ్చింది.. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేస్తారా? రాష్ట్రం మొత్తం ఇవ్వాలి.. ఇది నా క్రెడిట్ అని స్పీచ్ లిస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఎవ్వరి వల్ల పథకం వచ్చిందనే విషయం పక్కన […]
ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?!
రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్రభాస్.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాలు చేస్తున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే.. ప్రభాస్ కు భారీగా ఆస్తులు ఉన్నాయట. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణరాజు గారు […]
పవన్‌కు కలిసిరానిది..చిరుకు కలిసొస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. వేణు శ్రీరామ్ ఈ రీమేక్ కు దర్వకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో పవన్-శ్రుతి హాసన్ ల ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకు మెప్పించడంలో ఘోరంగా విఫలమైంది. […]
బిగ్ బాస్ -5లోకి టాలీవుడ్ హీరోయిన్?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఐదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుండగా.. కంటెస్టెంట్స్ ఎంపిక గత సీజన్ మాదిరే జూమ్ యాప్‌లో ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ ఇప్పటికే బోలెడన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే […]









