జగన్ మళ్లీ ఔదార్యం ప్రదర్శిస్తారా?

రాజకీయంగా పొందగలిగిన ఉన్నతమైన పదవుల మీద పార్టీలో చాలా మందికి కన్ను ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్కువ మంది ఆశించేవి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు. సాధారణ నాయకుల కంటె పార్టీకి అత్యంత ముఖ్యమైన వారు ఆశించేది రాజ్యసభ సభ్యత్వం! అంతూ దరీ లేకుండా పార్టీనే నమ్ముకుని.. రాత్రింబగళ్లూ పార్టీకే సేవ చేస్తూ ఉండే నాయకులు అనేక మంది ఉంటారు. అలాంటి వారు.. తమకు పార్టీ ఏదో ఒక సందర్భంలో సముచితమైన పదవులు కట్టబెడుతుందనే.. ఆశతో బతుకుతుంటారు. […]

నడిరోడ్డు పై ప్రధాని.. ప్రపంచం నవ్వుతోంది!!

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన పలు వివాదాలకు దారి తీసింది. ఇది వివాదం అనేకంటే ఘోరమైన భద్రతా వైఫ్యలం అనటం కరెక్ట్. ఇక్కడ ముందుగా రెండు విషయాలు చెప్పదలచుకున్నాను. ఒకటి మనమందరం కచ్చితంగా ఒప్పుకు తిరాల్చిన అంశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా నట్ట నడిరోడ్డు లో ఒక ఫ్లైఓవర్ పైన రైతుల నిరసన కారణంగా దేశ ప్రధాని 20 నిమషాల పాటు వేచి చూసి పర్యటనను రద్దుచేసుకుని తిరిగి […]

పేర్ని నాని మరియు రెండు మాటలు..

సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు. చాలా మాటలు తలాతోకాలేకుండా, తర్కానికి నిలవలేకుండా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేర్ని నాని చెప్పిన రెండు మాటలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు రెండు మాటల సంగతి చూద్దాం.. (1) టికెట్ ధర పెంచి అమ్ముకోవడాన్ని […]

వర్మ మా వాడు.. కాదు కాదు మా వాడే..

రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ పరిచయాలు అక్కర్లేని సెలబ్రిటీ అలాగని రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే వివాదాలు ఎక్కడుంటే అక్కడే రాంగోపాల్ వర్మ ఉంటారు. తాజాగా ఏదైనా అతిపెద్ద అనవసరపు వివాదం ఏదైనా ఉంది అంటే అది ఏపీలోని ప్రభుత్వం వర్సెస్ థియేటర్స్ మరియు సినిమా పరిశ్రమ మామూలుగానైతే వర్మ ఈపాటికే ఈ విషయంలో దూరి నానా రభస చేయవలసింది. కానీ ఎందుకో చలికాచుకునే అవకాశం ఉన్నా కాస్త […]

సినిమా రాజకీయాలు.. ప్రమాద ఘంటికలు!!

ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కేపీహెచ్బీ కాలనీ లోని శివ పార్వతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి థియేటర్ మొత్తం దాదాపు అగ్నికి ఆహుతి అయింది. అదృష్టవశాస్తూ అగ్నిప్రమాద సమయంలో ప్రేక్షకులు ఎవ్వరు థియేటర్లో లేకపోవడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం పలు విషయాల చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం వర్సెస్ ప్రభుత్వం అన్నంత రేంజ్ […]

ఆర్ఆర్ఆర్.. సీఐడీ కాదు, ఈసారి సీబీఐ కేసు!

సీఐడీ- సీబీఐ కేసు అనగానే .. ఇదేదో సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన వ్యవహారం కాదని.. వివాదాస్పద రాజకీయ నాయకుడు రఘురామక్రిష్ణ రాజుకు సంబంధించిన గొడవ అని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది. ఆయన ప్రస్తుతం దాదాపు 1300 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలను ఎగవేసిన కేసుల్లో సీబీఐ కేసులో ఇరుక్కున్నారు. గతంలో ఆయన మీద ఏపీ సీఐడీ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే.. ప్రతిసారీ.. జగన్మోహన్ రెడ్డి సీఐడీ పోలీసుల […]

దోపిడీని అడ్డుకుంటే సినిమా ఆపేస్తారా?

భారీ చిత్రాల ముసుగులో.. సినిమా ఇండస్ట్రీ సాగిస్తున్నది కేవలం దోపిడీ మాత్రమే అని చెప్పడానికి ఇది మరొక స్పష్టమైన ఉదాహరణ. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదాపడడం ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. ఎన్నడో అక్టోబరులోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రాన్ని.. అటూ ఇటూ చేసి.. సంక్రాంతి బరిలోకి తెస్తున్నాం అంటూ మొత్తానికి జనవరి 7న విడుదల అయ్యేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం అది కూడా వాయిదా పడింది. చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో […]

దొందూ దొందే.. ఎన్ని సార్లు కలిసినా ఏమీ తేలదు!

సాధారణంగా మనం దొందూ దొందే అనే సామెతను ఒకే రకంగా బుద్ధులు ప్రదర్శించే ఇద్దరు వ్యక్తుల గురించి అంటూ ఉంటాం. అయితే ఇక్కడ వ్యవహారం అది కాదు. రెండు సమస్యల గురించి. అవి స్తంభించిపోయిన తీరు గురించి. ఏపీ రాష్ట్ర వ్యవహారాల్లో రెండు కీలకమైన విషయాలు.. ఒకేరీతిగా స్తంభించిపోయి ఉన్నాయి. ఇవి మాత్రం దొందూ దొందే. ఇప్పట్లో అవి తేలి, ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అవేంటంటే.. (1) ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న […]

జిన్నా టవర్ బీజేపీ పుట్టి ముంచుతుందా?

హిందువులు భారతీయ జనతా పార్టీని- తమ సొంత పార్టీగా అభిమానించి ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ.. ఇతర మతాలు- అంటే ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం అపరిమితంగా ద్వేషించే వాతావరణాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థంగా తయారు చేస్తున్నారు. భారతదేశమే పరమత సహనానికి పుట్టినల్లు. అయితే.. సోము వీర్రాజు మాత్రం.. ఇతర మతాల మీద ద్వేషబీజాలు ప్రజల్లో నాటి.. తద్వారా.. పబ్బం గడుపుకోవడానికి.. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మూటగట్టుకోవడానికి తెగిస్తున్నారు. అయితే.. […]