కబాలి రిలీజ్ ఖచ్చితంగా అప్పుడే

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ విడుదల తేది ఎప్పుడుంటుందా అనే దానిపై అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతుండగా, రిలీజ్ డేట్ విషయంలో గంటకొక వార్త పుట్టుకొస్తుంది. మొన్నటి వరకు జూలై 15న రిలీజ్ అన్న వారు ఆ తర్వాత జూలై 29న ఉంటుందని తెలిపారు. అందుకు ఓ కారణం కూడా ఉంది. మలేషియాలో జూలై 29 రిలీజ్ డేట్ తో పెద్ద […]

ఐటీ జాబా:జర భద్రం బ్రదర్!

వచ్చే ఐదు సంవత్సరాల వ్యవధిలో భారత ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 6.4 లక్షల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుగోనున్నారని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న రీసెర్చ్ సంస్థ హెచ్ఎఫ్ఎస్ అంచనా వేస్తోంది. ఐటీ నిపుణుల్లో నైపుణ్యత తగ్గుతుండటం, యాంత్రీకరణ పెరగడమే ఇందుకు కారణమని, పనితీరు మెరుగుపరచుకోకుంటే, ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించింది. 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 9 శాతం మంది, అంటే సుమారు 14 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారని, భారత్ […]

బాబూ సిగ్గు సిగ్గు:ఆఖరికి అదికూడా కాపీ నా!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లను ఏపి ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ ఉన్నతా ధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాపీరైట్స్‌ చట్టం సెక్షన్‌ 63 ప్రకారం హైదరాబాద్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్‌ కోర్టు అప్లికేషన్‌ సమాచారం కూడా కాపీకి గురైందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ తెలిపారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం […]

అనుష్క రామ్ చరణ్ అసలు కథ ఇదీ

రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. సైంటిఫిక్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందనే టాక్‌ వినవస్తుండగా, సబ్జెక్ట్‌ విషయంలో చరణ్‌ – సుకుమార్‌ ఇంకా చర్చోపచర్చల దశలోనే ఉన్నారని సమాచారమ్‌. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రామ్‌చరణ్‌, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క పేరుని ప్రతిపాదించాడట. సుకుమార్‌ కూడా అనుష్క పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ, రెమ్యునరేషన్‌ యాంగిల్‌లో చూస్తే కష్టమేనని అనుకుంటున్నారు. అనుష్క హీరోయిన్‌ అయితే సినిమాకి బాలీవుడ్‌లోనూ మంచి బిజినెస్‌ అయ్యే అవకాశం […]

ముద్రగడ మౌనం అందుకేనా?

ముద్రగడ రెంటికీ చెడ్డ రేవడి నిరాహార దీక్ష ఎపిసోడ్‌ తర్వాత ముద్రగడ పద్మనాభంను ఎవరూ పట్టించుకోవడంలేదట. ఆయన్ను కొందరు నేతలు కలుస్తున్నప్పటికీ ఆ విషయాలకు మీడియాలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదు. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసాలపై కేసులు నమోదవడంతో కాపు ఉద్యమ నాయకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. టిడిపితో సర్దుకుపోతే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లు, ఇతర సహాయాల్ని పొందగలుగుతుందని లేని పక్షంలో వివాదాలు ముదిరి కాపు ఉద్యమం పక్కదారి పడుతుందనే ఆలోచన […]

అమీర్ ఖాన్ మరీ ఇంత చీప్ ఏంటి!

పెద్దోళ్ళయ్యాక బుద్ధులు చిన్నవైపోతాయట. బాలీవుడ్‌ ప్రముఖ హీరో అమీర్‌ఖాన్‌కి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. స్టార్‌డమ్‌ని ‘వెయిటర్‌’తో పోల్చాడీయన. ఇంకో ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్‌కి స్టార్‌డమ్‌ ఉందిగానీ, తనలా ఆయన అంత గొప్పవాడు కాదని అమీర్‌ఖాన్‌ చెప్పాలనుకున్నాడో, పాత్రికేయులను చులకన చేయాలనుకున్నాడో, వెయిటర్‌ అనే జాబ్‌ని తక్కువ చేసి చూడాలనుకున్నాడో తెలియదుగానీ అమీర్‌ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నాలిక్కరచుకున్నాడు. సల్మాన్‌ఖాన్‌ లాంటివారు వస్తే మీడియా అతన్ని స్టార్‌లా చూస్తుందని చెబుతూ తాను వస్తే మాత్రం వెయిటర్‌లా భావిస్తారని […]

చంద్రబాబుకి షాకిచ్చిన నరేంద్రమోడీ

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వకపోవడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చంద్రబాబుకి పెద్ద ఝలక్‌ ఇచ్చారని చర్చించుకుంటున్నారు రాజకీయ వర్గాలలో. టిడిపి నాయకులు కూడా నరేంద్రమోడీ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడున్న రెండు కేంద్ర మంత్రి పదవులతోపాటు కొత్తగా మరో పదవిని టిడిపి ఆశించింది. ఒకరు క్యాబినెట్‌ మంత్రి, ఒకరు సహాయ మంత్రిగా టిడిపి నుంచి కేంద్రంలో ఉన్నారు. వారిని అలాగే ఉంచి, కొత్త ఛాన్స్‌ ఇవ్వాలని చంద్రబాబు […]

‘పోకిరి’ స్టయిల్లో పూరి:ఇజం

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా ‘ఇజం’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని, టైటిల్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్‌రామ్‌ డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రం. ఇందులో కళ్యాణ్‌రామ్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. మామూలుగానే పూరి సినిమాల్లో హీరో డిఫరెంట్‌ మ్యానరిజంతో కనిపిస్తాడు. ఇంతవరకూ తన సినిమాల్లోని హీరోకి ఉండే డిఫరెంట్‌ బాడీలాంగ్వేజ్‌తోపాటు, ఇంకా కొత్తగా కళ్యాణ్‌రామ్‌ క్యారెక్టర్‌ హీరోయిజం ఈ సినిమాలో ఉండేలా పూరి […]

కామినేని తురాణం న సిగ్గు న లజ్జ

విజయవాడ ఆలయాల తొలగింపు వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఆధునీకణ పేరుతో ఆలయాలు తొలగించడాన్ని విశ్వ హిందూ పరిరక్షణ సమితి ఖండించింది. అయితే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా వారు బెజవాడ వినాయక గుడి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు మంత్రి కామినేని ముఖ్య అతిధిగా హాజయ్యారు. సభలో భక్తులకు పలు హామీలు ఇచ్చారు. తొలగించిన ఆలయాలు విగ్రహాలను పునఃప్రతిష్టేంచుదుకు కృషి చేస్తానన్నారు. భక్తులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. అధికారుల తప్పిదం వల్లే ఇదంతా జరిగిందన్నారు. […]