మూడు లిప్ కిస్సులు అయినా కట్ లేదు!

హృతిక్‌రోష‌న్ న‌టించిన మొహంజొదారో సినిమాలో ఘాటైన మూడు ముద్దు సీన్లున్నా సెన్సార్ బోర్డు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. అంతే కాదు సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క క‌ట్ కూడా లేకుండానే క్లియ‌రెన్స్ ఇచ్చేసింది. ఇలాంటి సీన్లే ఉన్న చాలా సినిమాలకు అభ్యంతరం చెప్పిన బోర్టు.. మొహంజొదారో సినిమాకు మాత్రం క్లియరెన్స్ ఇవ్వడంపై బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ కిస్ సీన్లపై స్పందించిన హీరోయిన్ పూజా హెగ్డే.. ‘దాన్నో ముద్దుగా […]

ప్రెజర్‌ పీక్స్ వెంకయ్యకే!

ప్రత్యేక హోదా విషయంలో ఎక్కువ ప్రెజర్‌ ఫీలవుతున్నది వెంకయ్యనాయుడే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు, నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌ని ఈయనే తెరపైకి తెచ్చారు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ద్వారా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించింది వెంకయ్యనాయుడే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అప్పటి ప్రధానితో ఆ ప్రకటన చేయించగలిగారుగానీ, ఇప్పుడు కేంద్ర మంత్రంగా ఉండి కూడా నరేంద్రమోడీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇప్పించలేకపోతున్నారు. […]

మెగాస్టార్‌ కోసం ‘మన్నాభాయ్‌’

మున్నాభాయ్‌ సంజయ్‌దత్‌ జైలు జీవితం ముగిశాక పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్‌ పెడుతున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్నాళ్ళు కుటుంబానికి కేటాయించిన సంజయ్‌దత్‌, ఇక నుంచి వరుస సినిమాలతో బిజీ అవుతాడట. ‘మున్నాభాయ్‌’ సిరీస్‌లో మూడో సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా కాకుండా ఇంకో మూడు సినిమాలకు సంజయ్‌దత్‌ సైన్‌ చేశాడని సమాచారమ్‌. ‘మున్నాభాయ్‌’ సిరీస్‌ తెలుగులోకి రీమేక్‌ అయ్యింది చిరంజీవి హీరోగా. తొలి సినిమా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ పెద్ద విజయం సాధించగా, రెండోది ‘శంకర్‌దాదా […]

గుజరాత్ సీఎం సంచలన నిర్ణయం

తనను సిఎం పదవి నుంచి తప్పించాలంటూ గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ బిజెపి అధిష్టానాన్ని కోరారు. సోషల్ మీడియా ద్వారా ఆమె తన నిర్ణయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించారు. కొంత కాలంగా ఆనందీ బెన్‌ను తప్పిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె తన నిర్ణయాన్ని ఇలా బయటపెట్టారు. నవంబర్‌లో ఆమెకు 75 సంవత్సరాలు రానున్న నేపథ్యంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వచ్చే ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొత్త సిఎం రేసులో నితిన్ పటేల్, […]

శశికళ జయ దోస్తానా కట్!

అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివల వివాదం మరో మలుపు తిరిగి, అన్నా డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వర్సెస్ శశికళగా మారింది. చెంపదెబ్బలుకొట్టినందుకు శివకు క్షమాపణలు చెప్పానన్న శశికళ.. జయలలితపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.జయలలిత తనను బెదిరించారని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శశికళ ఆరోపించారు. రాజీనామా చేయాలంటూ గత రెండు నెలలుగా తనను వేధించారని తెలిపారు. తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించకుండా, పోయస్ గార్డెన్లో […]

ట్రంప్ భార్య నగ్న ఫొటోలివిగో

అమెరికాలో కూడా రాజకీయాలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదివరకెన్నడూ చూడని వింతలు చోటుచేసుకుంటోంటే ప్రపంచం నివ్వెరపోతోంది. రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్య్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన బిలియనీర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కి అతని భార్య న్యూడ్‌ ఫొటోలు ఇబ్బందిగా మారాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా కొన్నేళ్ళ క్రితం మోడల్‌గా పనిచేశారు. మనదేశంలోనే మోడలింగ్‌ అంటే చాలీచాలని దుస్తుల్లో కనిపిస్తుంటారు. విదేశాల్లో అయితే మోడలింగ్‌ అనగానే నగ్నత్వం గుర్తుకొస్తుంది. మెలానియా కూడా […]

ఈ సారి 1st తెలంగాణ నెక్స్ట్ ఏపీ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  ర్యాంకులలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉంది. ఈఓడీబీ ప్రాథమిక ర్యాంకులను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విధాన విభాగం ప్రకటించింది. 60.24 శాతం స్కోరుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, 55.75 శాతం స్కోరుతో ఏపీ రెండో స్థానానికి పరిమితమైంది. గత ఏడాది ఏపీ రెండోస్థానంలో ఉండగా తెలంగాణకు 13వ స్థానం వచ్చింది. అయితే 2016 జూన్ లో వెలువడిన ప్రాథమిక ఫలితాలలో తెలంగాణ రెండో స్థానంలో […]

ఎంసెట్ ప్రకంపనలు-ఆ ఇద్దరు అవుట్!

ఎంసెట్-2 లీకేజీ తెలంగాణ ప్రభుత్వంలో ప్రకంపనాలు సృష్టించబోతున్నది. విద్యార్థుల బంగారు భవి ష్యత్‌కు సంబంధించిన అంశం కావడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ విష యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రెండేళ్లుగా ప్రజా సంక్షేమపథకాలు ప్రారంభిస్తూ దేశ, విదేశాలను ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సం బంధించిన అంశం కావడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో, అటు విపక్షాల నుంచి ప్రభు త్వం తీవ్ర […]

ప్రీ రిలీజ్ ‘బంగారం’ వెంకీ రికార్డు!

కొన్నేళ్లగా  సోలో హీరోగా విక్టరీ వెంకటేష్ ఇమేజ్ దెబ్బ తింది. కుర్ర హీరోల జోరు మధ్య ఆయన హవా తగ్గిపోయింది. వేరే హీరోలతో తెర పంచుకుంటూ సోలో హీరోగా వెనకబడిపోయాడు వెంకీ. ఆయన మార్కెట్ కూడా దెబ్బ తింది. దృశ్యం సినిమా బాగా ఆడినా సరే.. దానికి పెద్దగా బిజినెస్ జరగలేదు. లాభాలు కూడా భారీగా ఏమీ రాలేదు. ఐతే బాబు బంగారం సినిమాతో వెంకీ ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు వెంకీ కెరీర్ లోనే […]