ఆ కాశ్మీర్‌ని తీసుకొస్తే మోడీ ధన్యుడే

పాకిస్తాన్‌ ఆక్రమించుకున్న కాశ్మీర్‌ని తిరిగి భారతదేశంలోకి తీసుకురావాలనే మహా సంకల్పంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టిపెట్టారు. అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై నరేంద్రమోడీ చర్చించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా ఆ భూభాగం, పాకిస్తాన్‌ ఆధీనంలో ఉంది. అక్కడ పాకిస్తాన్‌ సైన్యాలు యధేచ్ఛగా తిరుగుతాయి. అక్కడి ప్రజల్ని నాశనం చేస్తుంటాయి. అక్కడే తీవ్రవాదుల స్థావరాల్ని నెలకొల్పుతుంటాయి. కానీ అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందోననే భయంతో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో సంబందం లేని ప్రాంతంగానే చూపుతుంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌ […]

తిక్క TJ రివ్యూ

సినిమా: తిక్క టాగ్ లైన్ :  ఈ తిక్కకి లెక్క లేదు TJ రేటింగ్: 1/5 నటీ నటులు: సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారిస్సా బోనాసి, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, స‌ప్త‌గిరి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేష్… నిర్మాత: రోహిన్ కుమార్ రెడ్డి బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్‌ మ్యూజిక్: ఎస్ఎస్‌.థ‌మ‌న్‌ సినిమాటోగ్రఫీ: కెవి.గుహ‌న్‌ ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్‌ స్టోరీ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : సునీల్ రెడ్డి ఈ మధ్యకాలం లో సినిమా టైటిల్ కి కథకి అసలు సంబంధమే ఉండటం […]

చిన్నారిని చూసి చలించిపోయిన రామ్

విశాఖపట్నం ఎం వీ పి కాలనీ లో 5 ఏళ్ళ చిన్నారి (కుందన పూర్ణచంద్రిక) దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోంది పుట్టిననాటి నుంచి చిన్నారి నడుము కింద భాగం చ చ్చుబడిపోయింది.తల్లిదండ్రులు ఈ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే చిన్నారికి మాత్రం వర్థమాన కథానాయకుడు రామ్ అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లిన రామ్ కు చిన్నారికి గురించి తెలియగానే శుక్రవారం సాయంత్రం కుందనని కలవాటనికి ఎం వీ పి కాలనీ […]

వెయిటింగ్‌ లిస్ట్‌లో నందమూరి మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో నటిస్తాడని టాక్‌ వినవచ్చింది. బాలకృష్ణ కూడా ఈ ఊహాగానాలకు బలమిచ్చేలా వ్యాఖ్యలు చేశాడు గతంలో. వ్యాఖ్యలే కాకుండా, ఈ సినిమానే మోక్షజ్ఞకు తొలి సినిమా అవుతుందని ఫిక్స్‌ చేసేసేలా వార్తలు హల్‌చల్‌ చేశాయి. కానీ ఈ వార్తలకు బ్రేకప్‌ పడిందనే చెప్పాలి. ఎందుకంటే మోక్షజ్ఞ హీరోగానే తొలి సినిమా చేస్తే బాగుంటుందని భావించాడట బాలకృష్ణ. దాంతో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ నుంచి మోక్షజ్ఞని తప్పించాడట. అంటే […]

‘తిక్క’కి లెక్కలు చూపించే టైమొచ్చింది

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ. ‘సుప్రీం’ సినిమా ముందు వరకూ తేజుది ఒక లెక్క, ఆ సినిమా తర్వాత ఇంకో లెక్క. ఎందుకంటే ‘సుప్రీం’ సాధించిన సంచలన విజయం అలాంటిది. మామూలు టాక్‌తోనే పెద్ద హిట్‌ సాధించింది ‘సుప్రీం’. దాంతో, భారీ ఆఫర్లతో ‘తిక్క’ని దక్కించుకున్నారట కొందరు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా రిలీజ్‌కి ముందు పాజిటివ్‌ బజ్‌ రావడంతో, సాయిధరమ్‌ ప్రీ రిలీజ్‌ ప్రాఫిట్స్‌ని ‘తిక్క’తో నిర్మాతకి అందించాడు. […]

మాట తప్పేది లేదంటున్న కెసియార్‌

ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషనుల ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పునరుద్ఘాటించారు. గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినా న్యాయస్థానాల్లో ఆ కేసులు వీగిపోయాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో వెనక్కి తగ్గేది లేదని ఇంకోసారి చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రత్యేక చట్టం తెస్తామని ఆయన అంటున్నారు. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడానికి రెండేళ్ళకుపైగానే కెసియార్‌ సమయం తీసుకున్నారు. […]

భూమిక ఎన్నాళ్ళకెన్నాళ్ళకు?

అందాల తార భూమిక చాలా కాలం తర్వాత ఓ సినిమాలో నటించనుంది. అయితే అతిథి పాత్రలోనే ఆమె నటిస్తోంది. బాలీవుడ్‌ సినిమా ‘ఎమ్మెస్‌ ధోనీ’ చిత్రంలో నటిస్తున్న భూమిక, ఈ సినిమా ట్రైలర్‌లో మెరిసింది. అది చూసి భూమిక అభిమానులు మురిసిపోయారు. తెలుగులో ‘స్నేహమంటే ఇదేరా’, ‘వాసు’, ‘ఖుషీ’, ‘అనసూయ’, ‘ఒక్కడు’ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన భూమిక, బాలీవుడ్‌లో కూడా నటిగా రాణించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన భూమిక, కొంతకాలం నటనకు […]

అమరావతిని అడ్డుకోవద్దు: సుప్రీంకోర్టు

కొత్త రాష్ట్రం రాజధానిని నిర్మించుకోవద్దా? అని సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎబికె ప్రసాద్‌ని ప్రశ్నించింది. అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును కొట్టివేసిన న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్లో, అనేక కీలకాంశాలు ఉన్నాయి. రాజధానిని ఎక్కడ నిర్మించాలో మీరే చెబుతారా? మీరేమైనా రైతా? అని ప్రశ్నించడంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి నోట మాట రాలేదు. రైతులు నష్టపోతున్నారని ఆయన చెప్పినప్పుడు, రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు […]

బాబూ పుష్కర పుణ్యం మాకొద్దు

గత నెల రోజులుగా పాలనా పడకేసిన పట్టించుకోకుండా పుష్కర పనులకే పరిమితమయింది ప్రభుత్వమంతా..అక్కడికేదో చరిత్రలో ఇదే మొదటిసారి పుష్కారాలు అన్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గరినుండి మంత్రిమండలి మొదలు అధికార యంత్రాగమంతా పనులుమానుకొని మరీ రాష్ట్రం లో పుష్కరాలు తప్ప వేరే పనిలేదు అన్నట్టుగా హడావిడి చేశారు.ఈ పైత్యం ఏ రేంజ్ కి చేరిందంటే అదేదో ఫామిలీ ఫంక్షన్ అన్నట్టు మంత్రివర్యలచే ఆహ్వానాలు అందిచిందడం ఈ మొత్తం వ్యవహారానికి పరాకాష్ట. ఏర్పాట్లు అయితే ఘనంగానే చేశారు కానీ జనాలు మాత్రం […]