మితిమీరిన అభిమానం నాకొద్దు: NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ హత్యపై తారక్ తొలిసారిగా స్పందించాడు. అభిమానం అభిమానంలానే ఉండాలని తారక్ చెప్పాడు. మితిమీరిన అభిమానం ఉండకూడదని సూచించాడు. అలాంటి అభిమానులు నాకొద్దని ఎన్టీఆర్ తెలిపాడు. తాము కేవలం రెండుగంటల వినోదాన్ని అందించే నటులం మాత్రమేనని, అభిమానాన్ని అభిమానంగానే చూడాలని కోరాడు. అందరూ ముం దుగా దేశాన్ని తరువాత తల్లిని, భార్య బిడ్డలని, స్నేహితులని ఆ తరువాతే హీరోలని అభిమానించాలని సూచించాడు.

జనతా గ్యారేజ్ లో ఎవరెక్కువ?

‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు సమంత, నిత్యామీనన్‌లు. అయితే ఈ సినిమాలో సమంతది మెయిన్‌ హీరోయిన్‌ రోల్‌, నిత్యా సెకండ్‌ హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. కానీ ఎక్కడా ఇంతవరకూ సమంత సినిమా ప్రమోషన్‌కి సంబంధించి బయటికి రాలేదు. ప్రోమోస్‌లో కూడా ఎక్కువగా నిత్యా సందడే కనిపిస్తోంది. ప్రమోషన్స్‌లో కూడా నిత్యా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఎక్కువ ప్రాధాన్యత సమంత కన్నా నిత్యాకే ఉండనుందా? అనే డౌట్‌ వస్తోంది ప్రేక్షకులకి. గతంలో ఈ ఇద్దరూ కలిసి […]

జనసేన ఇకపై హైపర్‌ యాక్టివ్‌!

తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఏం సంకేతాలు పంపుతున్నట్టు? ఇకపై జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ఆయన నిర్ణయించుకున్నారా? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే, పవన్‌కళ్యాణ్‌ గత రాజకీయ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సభ తర్వాత మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళకుండా ఉంటారా? అనే అనుమానాలు కలగడం సహజం. ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌, కాకినాడ వేదికగా ఇంకో బహిరంగ […]

‘ధృవ’పై తనీ ఒరువన్‌ ఎఫెక్ట్‌ ఎంత?

‘తనీ ఒరువన్‌’ రీమేక్‌గా వస్తోంది ‘ధృవ’ సినిమా. అయితే ఈ సినిమా అనౌన్స్‌ జరిగినప్పట్నుంచీ అందరి దృష్టి తనీ ఒరువన్‌పై పడింది. ఆ సినిమా సీడీలు తెచ్చుకుని ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసేస్తున్నారు. సో ఆ రకంగా ఈ సినిమా స్టోరీ అందరికీ తెలిసిపోయినట్లే. కానీ సురేందర్‌ రెడ్డి ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి సంబంధించి చాలా మార్పులు చేశాడట. ఆ సినిమాతో పోలిస్తే ‘ధృవ’ సినిమా ఇంకా కొత్తగా ఉంటుందట. అంతేకాదు […]

మాట తప్పను మడమ తిప్పను: పవన్‌

‘ఇంకో పాతికేళ్ళపాటు ప్రజల కోసం పోరాడతాను..’ అని జనసేన అధిపతి పవన్‌కళ్యాణ్‌, తిరుపతి వేదికగా నినదించారు. కేంద్రానికి సీమాంధ్రుల సత్తా ఏంటో చూపిస్తేగానీ, ప్రత్యేక హోదా వచ్చేలా లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వేదికగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం దారుణమని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి ఓటేయలేం, ఉన్నది ఒకటే అవకాశం అదే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని కూడా […]

‘నగ్నసత్యం’ చెప్పిన రాధికా ఆప్టే

‘నా శరీరం గురించి నాకు తెలుసు. కంఫర్ట్‌గా ఉండబట్టే నటించాను. అందులో నేనేమీ ఇబ్బందిగా ఫీలవలేదు, ఫీలవను కూడా’ అని ‘పర్చేద్‌’ సినిమాకి సంబంధించి వెలుగు చూసిన న్యూడ్‌ వీడియోలపై స్పందించింది బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే. ఈ సినిమా విదేశాల్లో ఓ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాగా, అక్కడి నుంచే న్యూడ్‌ వీడియోలు లీక్‌ అయ్యాయి. అందులో రాధికా ఆప్టే నగ్నంగా నటించింది. సెక్స్‌ గురించీ మహిళా లోకం గళం విప్పాల్సిన సమయం ఆసన్నమయ్యిందని రాధిక […]

సింధు బ్రాండ్ వేల్యూ తెలిస్తే షాకె

ఈరోజుల్లో స్పోర్ట్స్ మెన్స్ కి, సినిమా వాళ్ళకి వున్న క్రేజ్ చాలా ఎక్కువ. ఎవరైనా ఒక్క సినిమాలో మంచి గుర్తింపుతెచ్చుకుంటే చాలు వాళ్లకి సినిమాలలో వచ్చే ఆదాయంకంటే బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందు కు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇదే స్పోర్ట్స్ స్టార్స్ కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. స్పోర్ట్స్ స్టార్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గురించే . ఆయన బ్రాండ అంబాసిడర్ గా చాల కంపెనీలకే చేశారు దాని తాలూకు […]

కవిత కౌంటర్ అదిరింది

నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కుమార్తె కవిత ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో అంతా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం.హస్తిన రాజకీయాలతోనే కవిత బిజీ బిజీ గా గడుపుతోంది.ఎప్పుడో అడపా దడపా తెలంగాణా జాగృతి తరపున ఇక్కడ కనిపిస్తోందంతే. దీనికి కారణం లేకపోలేదు.రాష్ట్రంలో తన తండ్రి ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు.ప్రతిపక్షం అనేదే లేకుండా నిర్వీర్యం చేసేసారు.ఏదయినా చిన్న చితకా ఇబ్బందులుంటే అన్న కేటీర్,బావ హరీష్ రావు లు చక్కదిద్దేస్తున్నారు.ప్రభుత్వం పై వ్యతిరేకత బాగా ఎక్కువయినా..ప్రతి పక్షాలకు […]