`ర‌ద్దు డ్యామేజ్` కంట్రోల్‌కు మోడీ ప్లాన్‌

దేశంలో 80 శాతానికి పైగా చ‌లామ‌ణీలో ఉన్న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యం దేశాన్ని అత‌లాకుత‌లం చేసింది. అవినీతిని అంతమొందించేందుకేన‌ని ప్ర‌ధాని చెప్పిన మాట‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. అయితే రెండున్న‌రేళ్లుగా ప్ర‌ధాని మోడీని ఆకాశానికెత్తేసిన అంత‌ర్జాతీయ‌ మీడియా.. ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా విమ‌ర్శించింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్‌కి బీజేపీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఈ నిర్ణ‌యం నుంచి ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లించేందుకు తాయిలాలు ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. 50 రోజులు ఆగాల‌న్నారు. ప్ర‌జ‌లు స‌హ‌నంగా […]

టీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కొత్త పేచీ

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ‌ల‌మైన జాతీయ పార్టీగా అవ‌త‌రించాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌ణాళికలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి స‌రికొత్త స‌మ‌స్య‌లు అడ్డువ‌స్తున్నాయి! 2014లో ఏపీలో చంద్ర‌బాబు పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు స్థానాలు కైవ‌సం చేసుకుంది. అదేవిధంగా మంత్రివ‌ర్గంలో రెండు సీట్ల‌ను సైతం కొట్టేసింది బీజేపీ. ఇక‌, ఇదే త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ అధికార కేసీఆర్‌తో చెలిమి చేయ‌డం ద్వారా లాభ‌ప‌డాల‌నేది క‌మ‌ల నాథుల వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే, కొంద‌రు మాత్రం ఏపీ మాదిరిగా టీడీపీతో పొత్తు […]

చంద్రబాబును సెల్వం అడిగింది అదేనా..

త‌మిళ‌నాడు సీఎం ప‌న్నీర్ సెల్వం అమ‌రావ‌తి బాట ప‌ట్టారు. ఆయ‌న బృందంతో క‌లిసి గురువారం ఏపీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. చెన్నైకి నీటి ఇబ్బందులు పెరిగిపోయాయ‌ని, తెలుగు గంగ ద్వారా నీళ్ల‌ను ఇచ్చి ఆదుకోవాల‌ని ఆయ‌న బాబుకు విన్న‌వించారు. చెన్నైలోని నీటి సమస్యపై రెండు పేజీల లేఖను చంద్రబాబుకు సెల్వం అందజేశారు. కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టిఎంసిల చొప్పున నీటిని తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేయాల్సి ఉందని ప‌న్నీర్ చెప్పారు. ఇప్పుడు […]

ఖైదీ వర్సెస్ శాతకర్ణి… ఎవరు గెలిచారు.

తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలైన నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవిలు పందెం కోళ్ల‌లా థియేటర్ల‌లో సంద‌డి చేస్తున్నారు. ఒక‌రిది 150వ సినిమా అయితే మ‌రొక‌రిది 100వ సినిమా!! ఇద్ద‌రివీ ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాలే!! ఒక‌రు సామాజిక అంశాన్ని క‌థాంశంగా తీసుకుంటే.. మ‌రొక‌రు చ‌రిత్రాత్మ‌క చిత్రంతో బ‌రిలోకి దిగారు. ఈ అగ్ర‌హీరోలిద్ద‌రూ ఇలా సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డం ఇదే తొలిసారి కాక‌పోయినా.. ఈసారి మాత్రం ఇద్ద‌రికీ ప్ర‌తిష్ఠాత్మ‌క‌మే! అయితే ఇందులో ఎవ‌రు పైచేయి సాధించారు? ఎవ‌రు గెలిచారు? అనే చ‌ర్చ […]

ఖైదీ నెంబ‌ర్ 150కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4 వేల పైచిలుకు థియేట‌ర్ల‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే క్ర‌మంలో ఓవ‌ర్సీస్‌లో సైతం కేవ‌లం ప్రీమియ‌ర్ షోలతోనే బాహుబ‌లి రికార్డుల‌కు ద‌గ్గ‌రైంది. బాహుబ‌లి ప్రీమియ‌ర్ల‌తో 1.3 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు కొల్ల‌గొడితే ఖైదీ కూడా ఇప్ప‌టికే 1.2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. […]

ఖైదీలో ఆ డైలాగులు చూసి మేథావుల షాక్‌

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ల తర్వాత `ఖైదీ నెంబ‌రు 150` ద్వారా తెర‌పై క‌నిపించారు. మునుపెన్న‌డూ లేని విధంగా చిరు గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంటం అభిమానుల‌ను అల‌రిస్తోంది. త‌మిళ సినిమా క‌త్తి రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాలో.. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌పైనా ప్ర‌భావం చూపేలా కొన్ని డైలాగులు ఉండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు సాధార‌ణంగా క‌నిపిస్తున్నా.. అంత‌ర్లీనంగా వాటికి చాలా అర్థం ఉందంటున్నారు విశ్లేష‌కులు. సినిమాల్లో మెగాస్టార్ సూప‌ర్ హిట్ అయినా… రాజ‌కీయాల్లో మాత్రం […]

జగన్ కి సవాల్ విసిరిన టీడీపీ ఎంపి

వైకాపా అధినేత జ‌గ‌న్‌ని మ‌న‌వాడు.. మ‌న‌వాడు.. అంటూనే స‌టైరిక‌ల్‌గా విమ‌ర్శించే అనంత‌పురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దీవాక‌ర్‌రెడ్డి మ‌రోసారి స్మూత్‌గా ఫైరైపోయారు. జ‌గ‌న్‌వి అన్నీ తాత‌బుద్దులేన‌ని, తండ్రి వైఎస్ బుద్దులు ఒక్క‌టి కూడా జ‌గ‌న్‌కి అబ్బ‌లేద‌ని అన్నారు.  క‌డ‌ప‌ జిల్లా పైడిపాలెంలో గండికోట‌ ఎత్తిపోతల ప‌థ‌కాన్ని బుధ‌వారం చంద్ర‌బాబు ప్రారంభించారు. అనంత‌రం బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా అధినేత స‌హా ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో […]

కడప గడపలో టీడీపీ సవాల్

ఏపీలో అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య స‌వాళ్లు విసురుకోవ‌డం కామ‌న్‌గా మారింది. ఏదైనా విష‌యంపై ఇరు ప‌క్షాల నేత‌లూ స‌వాళ్లు రువ్వుకోవ‌డం.. ఆ త‌ర్వాత పోలీసులు రంగంలోకి దిగ‌డం.. ప‌రిస్తితి స‌ర్దుమ‌ణ‌గడం ష‌రా అన్న‌ట్టుగా మారింది. ఇప్పుడు కూడా ఇలాంటిదే ఒక‌టి క‌డ‌పలో చోటు చేసుకుంది. గ‌డిచిన వారం రోజులుగా సాగునీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల‌ను ఏక‌బిగిన ప్రారంభించ‌డం లేదా శంకు స్థాప‌న‌లు చేయ‌డంతో బిజీ బిజీగా ఉన్న సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లా […]

ఇండియాలో నల్లధనం లెక్క తేలుతోంది

బ్లాక్ క‌రెన్సీపై స్ట్రైక్స్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. త‌న ల‌క్ష్యాన్ని సాధించే క్ర‌మంలో మ‌రింత‌గా దూసుకుపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నోట్ల ర‌ద్దు, కొత్త నోట్ల చ‌లామ‌ణి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి నోట్ల వినియోగం వంటి  విష‌యాల‌పై దృష్టి పెట్టిన మోడీ.. ఇప్పుడు తాజాగా.. న‌ల్ల‌ధ‌నాసుర‌ల‌ను ఏరివేయ‌డంపై క‌త్తిక‌ట్టారు. గ‌డిచిన రెండు రోజులుగా ఆదాయ‌ప‌న్ను అధికారులు వేస్తున్న అడుగులు ఈ దిశ‌గానే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన న‌వంబ‌రు 8, 2016 […]