ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్! అందుకోసమే జనసేన పార్టీ పెట్టానని చెప్పాడు!! చెప్పినట్టుగానే ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యాడు. టీడీపీ, బీజేపీలకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శించిన వారికి.. ఉద్దానం సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి తగిన సమాధానమిచ్చాడు. అంతేగాక ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు ఒంగోలులో మరో పోరాటానికి సిద్ధమవుతున్నాడు. ప్రభుత్వంపై మరో అస్త్రం సంధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ సమస్య […]
Author: admin
చంద్రబాబుకు మోడీ చేసింది తక్కువ… చేయాల్సింది ఎక్కువ
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు కావొస్తోంది. శక్తివంచన లేకుండా శ్రమిస్తూ.. కేంద్రంతో సఖ్యత పాటిస్తూనే ఏపీకి రావాల్సినవన్నీ రాబడుతున్నారు. ఇప్పటికే పోలవరానికి నాబార్డు రుణం ఇచ్చేలా ప్రధాని మోడీపై ఒత్తిడి తెచ్చి సఫలమయ్యారు. అలాగే ముంపు మండలాలను ఏపీలో కలిపేలా చేసే ఆర్డినెన్స్‌ను కూడా తెచ్చేలా చర్చలు జరిపారు. అయితే వీటితోనే అయిపోయిందేమీ లేదంటున్నారు విశ్లేషకులు. మోడీని అడగాల్సినవి, ఆయనతో చేయించాల్సినవి చాలానే ఉన్నాయంటున్నారు. అవేంటో ఒక్కసారి చూద్దాం… కడప జిల్లా పులివెందులలో జరిగిన […]
జగన్ రోల్‌లో పవన్ హిట్
`ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పాత్రను వైసీపీ సమర్థంగా నిర్వహించలేకపోతోంది`.. ఇది చాలా రోజుల నుంచి మంత్రుల నుంచి విశ్లేషకులందరూ చెబుతున్న మాట. అయితే ఈ విమర్శలు తప్పని ఎప్పుడూ నిరూపించలేకపోయారు ప్రతిపక్ష నేత జగన్. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పాత్రను జనసేనాని సమర్థంగా నిర్వహిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రజాసమస్యపై పోరాటాలు చేస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఆ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నారు. అలాగే ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పోటీకి పక్కా ప్రణాళికతో […]
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన ఖైదీ
భారీ అంచనాలతో వచ్చిన అన్నయ్య మూవీ ఖైదీ నెంబర్ 150 అదే అంచనాలను కొనసాగిస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం అనంతరం వెండితెరపై కనిపించిన చిరు తన రేంజ్‌కి తగ్గట్టుగానే అందరినీ అలరించాడు. ఆడియో సూపర్ హిట్ కావటంతో పాటు చిరు లుక్స్ ఆకట్టుకోవటంతో ఖైదీ నంబర్ 150 భారీ ఓపెనింగ్స్ సాధించింది. మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో ఖైదీ మూవీపై విడుదలకు ముందు ఉన్న అంచనాలు ఇప్పుడూ కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో ఏ మూవీ విడుదలైనా.. జక్కన్న […]
టీడీపీ కంచుకోటలో ఎన్ని కుమ్ములాటలో
ఏపీ అధికార పార్టీ టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల పదవుల కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయి. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారు ఒప్పందం మేరకు రెండున్నరేళ్లలో వేరేవారికి పదవులు అప్పగించాల్సి ఉన్నప్పటికీ.. పదవీ వ్యామోహంతో ఆ ఒప్పందాన్ని తోసిపుచ్చుతున్నారు. దీంతో జిల్లా అంతటా వివాదాలుగా మారింది. జిల్లాలో పలు ఎంపీపీ, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల మార్పు విషయంలో టీడీపీ తమ్ముళ్ల మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయంలో రెండున్నరేళ్ల పదవి […]
మంత్రి సుజాతపై బాలయ్య ఫాన్స్ ఫైర్
నటరత్న నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రదర్శిస్తున్న థియేటర్ సీజ్ చేయడం ఇప్పుడు రాజకీయంగా వివాదానికి దారితీసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి పీతల సుజాత ఇందులో చిక్కుకున్నారు. ప్రోటోకాల్ అంశంలో తలెత్తిన వివాదం అనేక మలుపులు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా పశ్చిమగోదావరిలో ఈ వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో పీతల సుజాతపై బాలయ్య అభిమానులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పండగ ముందు […]
టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
పాలిటిక్స్‌లో ఎవరూ ఎవరికీ శాశ్వత మిత్రులు కారు. శాశ్వత శత్రువులు కారు! అది నేతలు ఒకే పార్టీలో ఉన్నా.. లేక రెండు పార్టీల్లో ఉన్నా. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యమాల జిల్లా ఓరుగల్లులో టీఆర్ ఎస్ కీలక నేతలుగా సీఎం కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసిన ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌లు ఇద్దరూ ఇప్పుడు ఉప్పు నిప్పులా తయారయ్యారట! ప్రజల్లో అభిమానం చూరగొన్న ఇద్దరు […]
సాక్షికి జై కొట్టిన టీడీపీ మంత్రి
వినడానికి, నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజమే! టీడీపీ బద్ధ శత్రువైన వైకాపా అధినేత జగన్ పత్రికను ఆకాశానికి ఎత్తేశారు చంద్రబాబు మంత్రి వర్గంలోని చింతకాయల అయ్యన్నపాత్రుడు. సాక్షి పత్రికను చదవంతే పొద్దు పొడవదని తేల్చి చెప్పడంతో విన్నవాళ్లందరూ ఇది నిజమా?! అని ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వాస్తవానికి సాక్షి పత్రికకు, టీడీపీ నేతలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండే వాతావరణమే ఉంటుంది. పలువురు మంత్రులు, నేతలు సైతం సాక్షి పత్రిక వేస్ట్ అని, […]
టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి
తెలంగాణ అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత కొన్నాళ్లుగా నేతల మధ్య ఒకరంటే ఒకరికి పడడం లేదనే టాక్ వస్తోంది. ఎవరి ఆధిపత్య ధోరణిని వారు ప్రదర్శిస్తుండడం వల్లే.. ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోందని తెలుస్తోంది. అయితే, ఇది మరింత ముదిరితే పరిస్తితి ఏంటనేది ప్రశ్న. తాజాగా జరిగిన ఓ ఘటన.. ఓ మహిళా ఎమ్మెల్యే, ఓ మంత్రిని మీడియాకు ఎక్కేలా చేసింది. పాత ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ […]