పొలిటికల్‌గా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే టీడీపీ, వైకాపాల మధ్య ఇప్పుడు హోదా రూపంలో మరింత అగ్గి రాజుకుంది! ప్రత్యేక హోదా కోసం జగన్ నేతృత్వంలో మొన్న తలపెట్టిన శాంతి యుత ప్రదర్శనకు బాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మొగ్గలోనే తొక్కేసిన విషయం కొన్ని మీడియా ఛానళ్లు దాచి పెట్టినా.. సోషల్ మీడియా ఎవరి కొమ్మూ కాయదు కాబట్టి.. దీని ద్వారా అందరికీ అర్ధమైపోయింది. సో.. నిన్న మొన్నటి వరకు ఓ మాదిరిగా ఉన్న జగన్ రేటింగ్ ఇప్పుడు […]
Author: admin
బావపై హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి నందమూరి-నారా కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే! ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కొద్ది కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇంత దూరం ఉన్నా.. ఏనాడూ తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసింది లేదు! కానీ తొలిసారి హరికృష్ణ.. చంద్రబాబుపై నర్మగర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందో.. అందుకు గల కారణాలను ఆయన వివరించారు. టీడీపీని ఎన్టీఆర్ చేతుల్లోంచి బాబు లాక్కున్నతర్వాత ఎన్టీఆర్ రాజకీయ […]
ఏపీకి హ్యాండ్ ఇచ్చిన ఈరోస్
లక్షల కోట్లలో ఎంవోయూలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుల వరద ఖాయం. ఇక లక్షల సంఖ్యలో ఉద్యోగాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి! అంటూ ఒక పక్క ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోంది!! ఇప్పటికి రెండు సార్లు ఏపీలో పారిశ్రామిక సదస్సు జరిగింది. దేశవిదేశాలకు చెందిన కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కూడా కుదుర్చుకుంటున్నాయి. మరి ఇవి అమలవుతున్నాయా? ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలన్నీ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న పర్యాటక శాఖలోని వ్యవహారం […]
ఎన్టీఆర్ – బాలయ్య మల్టీస్టారర్
టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ అయిన నందమూరి ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు యువరత్న నందమూరి బాలకృష్ణ – యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం తెలిసిందే. అయితే నందమూరి అభిమానులు మాత్రం వీరిద్దరు ఎప్పుడు కలిసిపోతారా ? వీరిద్దరి కాంబినేషన్‌లో ఎప్పుడు మల్టీస్టారర్ సినిమా వస్తుందా ? అని ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. నందమూరి అభిమానుల ఆశ ఎలా ఉన్నా ఇప్పుడు ఓ టాప్ ప్రొడ్యుసర్ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా […]
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో లోగుట్టు…!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రం, ఇటు చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి వెనుక ఏదైనా దాగి ఉందా? నిజానికి విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారా? ప‌్యాకేజీ తీసుకోవడం వెనుక ఏదైనా గుట్టు దాగి ఉందా? అంటే ఔననే అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. నిన్న జరిగిన విశాఖ ఆందోళన విఫలం అనంతరం, దీనిపై కేవీపీ ఢిల్లీలో స్పందించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కేవీపీ.. చంద్రబాబు […]
టీఆర్ఎస్ తో పొత్తు పై కేంద్రం క్లారిటీ ఇచ్చిందా..!
అధికార టీఆర్ఎస్‌తో కలిసి అడుగులేయాలా? లేక పాత పద్ధతిలోనే టీడీపీతో జతకట్టాలా? అనే సందిగ్ధ పరిస్థితి తెలంగాణ బీజేపీ నాయకుల్లో నెలకొంది. ఒకపక్క సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. మరోపక్క కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది. మరి ఇలాంటి విభిన్న పరిస్థితుల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో పర్యటన హీట్ పెంచుతోంది. దీంతో టీఆర్ఎస్-బీజేపీ పొత్తు పేచీ ఏ స్థాయికి చేరుతుందోననే సందేహం బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ […]
విశాఖ హోదా ఉద్యమంలో విజేత ఎవరంటే ?
ఉవ్వెత్తున అలలతో ఎగసిపడే సాగర తీరం.. నిరసనలు, దిగ్బంధనలు, పోలీసుల తోపులాటలు, అరెస్టులతో అట్టుడికింది. ఒకనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమించిన విశాఖ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదానికి వేదికగా మారింది. రిపబ్లిక్ డే రోజున బీచ్‌లో యువత చేపట్టిన మౌన నిరసనను ప్రభుత్వం అణిచి వేసింది. అయితే ఈ ఉద్యమంలో గెలిచిందెవరు? జనసేననా లేక ప్రతిపక్ష వైసీపీనా లేక యువతా లేక ప్రభుత్వమా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. మరి దీనికి […]
పవన్ విషయంలో టీడీపీ దొరికిపోతోందిగా..!
జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో టీడీపీ ఆది నుంచి అనుసరిస్తున్న వైఖరే మరోదఫా స్పష్టమైంది! పవన్‌ని విమర్శించేందుకు టీడీపీ నేతలు ఎంతమాత్రం ధైర్యం చేయలేకపోతున్నారనడానికి నిన్న జరిగిన విశాఖ ఆందోళనే పెద్ద ఉదాహరణ. నిజానికి గురువారం విశాఖలో తలపెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం ఏ ఒక్కరిదో కాదు! నిజానికి అది సక్సెస్ అయి ఉంటే.. అప్పుడు తెలిసేది.. మాదంటే మాదని.. అందరూ కొట్టుకు చ చ్చేవాళ్లు. కానీ, పోలీసు నిర్బంధాల బూట్ల చప్పుళ్లలో ఆ ఆందోళన సముద్రంలో […]
ఆ ఇద్దరు మంత్రులను ఆదర్శంగా తీసుకోమంటోన్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీ మంత్రులు, సీనియర్ నేతలకు ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పెద్ద ఎత్తున క్లాస్ ఇచ్చారు. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రావెల కిశోర్ బాబు, పీతల సుజాతలు సహా సీఎంపై నోరు పారేసుకుంటున్న కరణం బలరాం వంటి వారిని ఉద్దేశించి చంద్రబాబు కామెంట్లు చేశారని తమ్ముళ్లు తెగ చెవులు కొరుక్కుంటున్నారు. బాబేంటి ఇలా ఇన్‌డైరెక్ట్‌గా క్లాస్ పీకారేంటి అని కూడా అనుకున్నారట. మొత్తానికి తీవ్ర సంచలనం […]