సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్. మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్పైడర్ బిజినెస్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ముందుగా ఏపీలోని పశ్చిమగోదావరి రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. స్పైడర్ వెస్ట్ గోదావరి రైట్స్‌ను ఎల్వీఆర్ ఫిలింస్ సంస్థ రూ 5.04 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదే జిల్లాలో ఖైదీ నెంబర్ 150 సినిమాను […]
Author: admin
మూడు జిల్లాల్లో మునిగిపోతోన్న వైసీపీ
విపక్ష వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. జగన్ ప్రయత్నాలు ఎలా ఉన్నా చాలా జిల్లాల్లో వైసీపీ రోజు రోజుకు బలం కోల్పోతుంది. కోస్తాలో కీలకమైన ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అని ప్రశ్నించుకుంటే ఆ పార్టీ వాళ్లే ఒకటి రెండు నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఓ వైపు టీడీపీ దూకుడు, అంతర్లీనంగా స్ట్రాంగ్ అవుతోన్న జనసేన దెబ్బతో […]
లగడపాటి రూటు టీడీపీనా..? వైసీపీనా..?
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ పేరు చెపితేనే మనకు రగడపాటి అన్న క్యాప్షన్ గుర్తుకు వస్తుంది. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేతో నానా హడావిడి చేసిన రాజ్‌గోపాల్ సర్వేలకు పెట్టింది పేరు… రాజ్‌గోపాల్ సర్వే అంటే కాస్త అటూ ఇటూగా తుది ఫలితానికి దగ్గరగా ఉంటుందన్న విషయం చాలాసార్లు రుజువైంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత రాజ్‌గోపాల్ కాంగ్రెస్‌కు దూరమై రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. ఇక కొద్ది రోజులుగా రాజ్‌గోపాల్ పొలిటికల్ రీ […]
బాబుకు బాలయ్య షాక్: హిందూపురంకు గుడ్‌బై
ప్రముఖ సినీనటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోనున్నాడా ? వచ్చే ఎన్నికల్లో ఆయన తన హిందూపురం నియోజకవర్గాన్ని వదులుకోనున్నాడా ? బాలయ్య ఇప్పటికే తీసుకున్న ఈ డెసిషన్‌తో చంద్రబాబు సైతం షాక్ అయ్యారా ? అంటే ఏపీ పొలిటికల్ కారిడాల్ ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ వారసుడిగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా నాలుగు దశాబ్దాలుగా రాణిస్తోన్న బాలయ్య గత ఎన్నికల్లో హిందూపురం నుంచి పొలిటికల్ ఎంట్రీ […]
ఏపీలో అత్తాకోడళ్ల పోరు ఉంటుందా..!
ఏపీలో ఎన్నికలు ఇంకా కాస్త దూరంలోనే వున్నాయి. మోడీ డెసిషన్‌తో 2018లోనే జమిలీ ఎన్నికలు ఉంటాయన్న టాక్ బలంగా వస్తోంది. దీంతో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే ఏపీలో అత్తాకోడళ్లు అయిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి వర్సెస్ నారా బ్రాహ్మణి మధ్య ఆసక్తికరమైన పోరు ఉంటుందా ? అన్నదానిపై ఆసక్తికరమైన సస్పెన్స్ నెలకొంది. అసలు మ్యాటర్ ఏంటంటే గతంలో కాంగ్రెస్ తరపున బాపట్ల, విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వరి గత […]
వైసీపీకి సినీ గ్లామర్ అటాచ్..!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టనుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా 2018లోనే ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వచ్చే యేడాదిలోనే ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సై అన్నట్టు టాక్. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశానికి ఉన్నంత సినీగ్లామర్ మరే పార్టీకి లేదు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం సినిమా రంగం నుంచి రావడంతో ఎక్కువ మంది సినిమా వాళ్లు […]
” జై లవ కుశ ” శాటిలైట్ బిజినెస్ క్లోజ్
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ షూటింగ్ చకచకా జరుగుతోంది. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో జై లవ కుశకు బిజినెస్ పరంగా కూడా ఎన్టీఆర్ కేరీర్‌లోనే తిరుగులేని క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ చివరి సినిమా జనతా గ్యారేజ్ రూ.85 కోట్ల షేర్ రాబట్టి… ఎన్టీఆర్ కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే జై లవ కుశ సినిమాకు రూ. 80 కోట్ల వరకు బిజినెస్ జరుతున్నట్టు ట్రేడ్‌వర్గాల […]
బాహుబలి 2 రిలీజ్ వేళ… ఏపీలో రచ్చ మొదలు
సరిగ్గా రెండు సంవత్సరాల వెయింట్, ఎంతో సస్పెన్స్‌కు తెరదించుతూ మరో మూడు రోజుల్లో బాహుబలి – ది కంక్లూజన్ థియేటర్లలోకి వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 ఏకంగా 9 వేల థియేటర్లలో రిలీజ్ అవుతోంది. టిక్కెట్ల కోసం ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు..రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఇంకా చెప్పాలంటే బాహుబలి 2 టిక్కెట్ల కోసం ఏకంగా మంత్రులు సైతం రంగంలోకి దిగుతున్నారంటే బాహుబలి క్రేజ్ అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే బాహుబలి 2 పై ఏపీలో పెద్ద […]
టీటీడీ చైర్మన్ కోసం టీడీపీలో నాలుగు స్తంభాలాట
ఏపీలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో టీటీడీ చైర్మన్ పోస్టు ఒకటి. ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టుకు మమూలు క్రేజ్ ఉండదు. ఈ ధర్మకర్తల మండలికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. టీటీడీ చైర్మన్ పదవి కోసం తలపండిన రాజకీయ నేతల నుంచి ఎందరో పోటీ పడతారు. ఈ పోస్టుతో పాటు ధర్మకర్తల మండలిలో సభ్యత్వం కోసం ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు కూడా సిఫార్సులు కూడా వస్తాయి. ఈ […]
