మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల ఫ్యూచ‌ర్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

ఇంట గెలిచి ర‌చ్చ‌గెల‌వమ‌న్న‌ట్టు.. టాలీవుడ్‌ను ఊపేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బాహుబ‌లితో మూవీ ఫీవ‌ర్ క్రియేట్ చేసిన ప్ర‌భాస్‌ల గురించే ఇప్పుడు ఫిలింన‌గ‌ర్‌లో ఎక్క‌డ చూసినా చ‌ర్చ న‌డుస్తోంది. సొంత భాష‌లో హిట్ట‌యిన హీరోలు ప‌క్క భాష‌ల్లోనూ న‌టించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. దీనికి త‌మిళ‌నాడు హీరోలే పెద్ద ఎగ్జాంపుల్‌. అయితే, తెలుగులో మాత్రం ఆ ఒర‌వ‌డి పెద్ద‌గా క‌నిపించ‌దు. ఆ మ‌ధ్య బ‌న్నీ కేర‌ళ‌లో కొంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా.. త‌మిళ‌నాట […]

టాలీవుడ్ లో మరో మల్టీ స్టారర్ సినిమా!

హ్యాట్రిక్ హిట్స్ ఎవరివి అని తెలుగు ఇండస్ట్రీలో అడిగేతే తడుముకోకుండా చెప్పే సమాధానం నాని. కెరీర్ పరంగా చూసుకుంటే నాని హిట్ శాతం 90% ఉంటుంది. ప్రస్తుతం నాని నటించిన ‘నిన్ను కోరి’ అనే కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, ఈ సినిమా కూడా నాని హిట్ ఫార్ములా లో పడి పెద్ద హిట్ అయిన పెద్ద ఆశ్చర్య పడనవసరం లేదు. ఎందుకంటే నాని కథని యాక్టింగ్ ని నమ్ముకొని పైకి వచ్చాడు అనటం లో […]

పాల‌న‌లో వెనుక‌బ‌డిన రెండు రాష్ట్రాలు

విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయ‌ని. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందిస్తున్నాయ‌ని టీడీపీ, టీఆర్ఎస్ నాయ‌కులు ఊద‌ర‌గొడుతున్నారు. అయితే ఇది ప్ర‌చార ఆర్భాట‌మేన‌ని పబ్లిక్‌ ఎఫైర్స్‌ సెంటర్‌ విడుదల చేసిన ఇండెక్స్ లో బట్ట‌బ‌య‌లైంది. కొన్ని అంశాల్లో ముందు వ‌రుస‌లోనూ, మ‌రికొన్ని అంశాల్లో చివ‌రిస్థానంలోనూ ఏపీ, తెలంగాణ ఉండ‌టం గ‌మ‌నార్హం! పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని తేల్చింది. ఏపీ కూడా ఇదే బాట‌లో ఉంద‌ని వెల్ల‌డించింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 10 అంశాల […]

గ్రామ‌స్థాయిలో బలోపేతానికి జ‌న‌సేనాని దూకుడు 

రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో.. పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసేందుకు జ‌న‌సేనాని అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేస్తున్నాడు. పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు శ‌ర‌వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. పార్టీని బ‌లోపేతం చేయ‌డం లేద‌ని, అస‌లు గ్రామ‌స్థాయిలో పార్టీ ఎక్క‌డ ఉందో తెలియ‌డం లేదంటూ వస్తున్న‌ విమ‌ర్శ‌ల‌కు చెక్ చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇటీవ‌లే త‌న భవిష్య‌త్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ప‌వ‌న్‌.. ఇప్పుడు అంతేవేగంగా రంగంలోకి దిగిపోయారు. జ‌న‌సేన సేవాద‌ళ్‌ను ప్రారంభించి.. మ‌రోసారి దూకుడును ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌జాసేవ చేసేందుకు […]

సోషల్ మీడియాకు లోకేష్ మ‌ళ్లీ దొరికారా?

పార్ట్ టైం పొలిటీషియ‌న్.. ఈ ప‌దం ఏపీ రాజ‌కీయాల్లో విప‌రీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ కొంత‌మందిని ఉద్దేశించి `పార్ట్‌టైం పొలిటీషియ‌న్‌` అని చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. దీనిపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ట్రాంగ్‌గా కౌంట‌ర్ ఇచ్చాడు. మ‌రి ప‌వ‌న్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియ‌ర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చ‌ర్చ మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోనూ లోకేష్‌పై సెటైర్లు ప‌డుతున్నాయి. పార్టీలో […]

టీడీపీ మంత్రిని టార్గెట్ చేసిన బీజేపీ మంత్రి

ఏపీ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-టీడీపీ మ‌ధ్య మిత్ర బంధం తెగిపోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌..ప్ర‌ధాని మోదీతో భేటీ అనంత‌రం అటు బీజేపీ, ఇటు టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అస‌లే హీట్ పెరిగిపోతున్న స‌మ‌యంలో కేబినెట్లోని బీజేపీ మంత్రి.. మ‌రో టీడీపీ మంత్రిని టార్గెట్ చేయ‌డం అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు మారింది. మ‌ద్యం అమ్మ‌కాల విష‌యంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ఇప్పుడు చర్చ‌నీయాంశ‌మైంది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న […]

మాట‌లతో కానిది భేటీతో సాధ్య‌మైందా? 

మాట‌ల వ‌ల్ల చెప్ప‌లేనిది మీటింగుల వ‌ల్ల సాధ్య‌మ‌వుతుంది. ఇప్పుడు అలాంటి ఒకే ఒక్క మీటింగ్ ఏపీ రాజ‌కీయాల్లో సెగ‌లు పుట్టిస్తోంది. వైసీపీ నేత‌ల్లో జోష్ నింపుతోంది. ఇదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లను తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ప్ర‌ధాని మోదీతో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ భేటీ.. ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మార్చ‌బోతోంది. 2019లో జ‌గ‌న్ జైలుకు ఖాయ‌మ‌ని, ఇక అధికారం శాశ్వ‌తమ‌ని భావిస్తున్న నేత‌ల‌కు ఒక్క‌సారిగా గొంతులో వెల‌గ‌పండు ప‌డినంత ప‌నయింది. ఇదే సంద‌ర్భంలో పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకునే […]

ప‌వన్ అభిమానుల‌కు తీపి, చేదు క‌బురు

అనుకున్న‌దంతా అయింది. రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేస్తాడ‌నుకున్న తమ నాయ‌కుడు పెద్ద బాంబు పేల్చాడు. అవ‌స‌ర‌మైతే సినిమాలు కూడా మానుకుంటాన‌ని తేల్చిచెప్ప‌డంతో ఆయన అభిమానులంతా నిరాశ చెందారు. జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు తీపి క‌బురుతో పాటు చేదు క‌బురు కూడా అందించాడు. ఇప్పుడు సంబ‌ర‌ప‌డాలో లేక నిరుత్సాహ‌ప‌డాలో తెలియక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. రాజ‌కీయాల‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ప‌వ‌న్‌. భ‌విష్య‌త్తు కార్యాచర‌ణ‌ను ప్ర‌క‌టించాడు. అంతేగాక త‌న‌ను పార్ట్‌టైమ్ రాజ‌కీయనాయకుడ‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న […]

రైతుల‌కు బేడీలు.. దిగొచ్చిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు కార‌ణ‌మైన ఖ‌మ్మం రైతుల‌కు బేడీల వ్య‌వ‌హారంపై సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. త‌న‌ను తాను ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డేసుకున్న ఈ వ్య‌వ‌హారం నుంచి చాలా సున్నితంగా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. రైతుల‌కు బేడీలు వేయ‌డాన్ని కేసీఆర్ మంత్రి వ‌ర్గం తీవ్రంగా ఖండించి, దానిని త‌ప్పేన‌ని ఒప్పుకుంది. అదేసమయంలో బాధ్యులైన ఇద్ద‌రు ఎస్పైల‌ను సస్పెండ్ చేసింది. అయితే, కేసీఆర్ మాత్రం.. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందికాద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రైతాంగాన్ని ఊర‌డించేందుకు […]