మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే పాపులర్ హీరోగా ఎదుగుతున్నాడు. తెలుగుతో పాటు మళయాళంలోను మంచి ఇమేజ్ తెచ్చుకుని అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న బన్నీ శాటిలైట్ విషయంలో అరుదైన ఫీట్‌కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హరీష్‌శంకర్ డైరెక్షన్‌లో దువ్వాడ జగన్నాథమ్ (డీజే) సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత స్టార్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను […]
Author: admin
నోరుజారారు.. పదవి పోగొట్టుకున్నారు
అధికారిక రహస్యాలు బయటికి వెల్లడించకూడదు.. అందులోనూ పార్టీలో అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు అందరికీ చెప్పేస్తే ఎలా ఉంటుందో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాగా తెలిసి వచ్చుంటుంది. రాజకీయాల్లో నోరుజారకూడదు.. పాపం అలా చేసినందుకే ఆయనకున్న చీఫ్ విప్ పోస్టు కూడా పోయిందనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పల్లె రఘునాథరెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు ఆయనకున్న ఒక్కగానొక్క పదవి కూడా పోయేలా చేసిందనే గుసగుసలు అసెంబ్లీ లాబీల్లో వినిపిస్తున్నాయి. మంత్రి పదవి పోయినందుకే తీవ్ర మనోవేదనతో ఉన్న పల్లె […]
ఆ జిల్లా అధ్యక్ష పదవికి ఇంత పోటీనా?
ప్రకాశం జిల్లా టీడీపీలో నాలుగు స్తంభాలాట మొదలైంది. దీనికోసం పార్టీలోని సీనియర్లు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు జోరుగా పావులు కదుపుతున్నారు. ఈ పీఠాన్ని దక్కించుకుని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటూ.. హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం ఒకరు.. గుర్తింపు కోసం మరొకరు.. ఇలా ఎవరి అవసరాలు వారివి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. హైకమాండ్ ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకాశం […]
నిఖిల్ కేరీర్‌లోనే కేశవ హయ్యస్ట్
టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నిఖిల్. స్వామిరారా నుంచి ప్రారంభమైన నిఖిల్ జైత్రయాత్ర మధ్యలో ఒక్క శంకరాభరణం మినహాయిస్తే కొనసాగుతూనే ఉంది. ఈ దూకుడుతోనే నిఖిల్ ఈ శుక్రవారం కేశవగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నిఖిల్ కేరీర్‌లోనే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ చేయడంతో పాటు అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతోంది. నిఖిల్ సినిమా తొలిసారి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 800 స్క్రీన్లలో రిలీజ్ అవుతోంది. నైజాంలో 250, సీడెడ్, ఆంధ్రల్లో 400, […]
సినిమాల్లో అన్నయ్య.. రాజకీయాల్లో తమ్ముడు
టాలీవుడ్ టాప్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇటీవల సంక్రాంతి బరిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నాడు. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్.. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాలయ్య బరిలో ఉండటం, ఆయనపై ఇటీవల […]
రాధా.. జగన్‌ల బంధానికి బీటలు..
విజయవాడలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి వంశ వారసుడు వంగవీటి రాధాకృష్ణకి వైసీపీ అధినేత జగన్‌కి బెడిసి కొట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయంగా వైసీపీకి కొంతకాలంగా తటస్థంగా ఉంటూ వస్తున్న రాధాని యువ నాయకత్వం నుంచి జగన్ ఇటీవల తప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా.. జగన్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వాస్తవానికి తండ్రి రంగా నుంచి వచ్చిన వారసత్వంతో కాంగ్రెస్‌లో తన కంటూ గుర్తింపు పొందిన […]
వసూళ్లలోనూ బాహుబలే!!
ప్రపంచాన్ని తన మాయాజాలంతో అల్లాడిస్తున్న బాహుబలి-2 మూవీ అనుకున్న అంచనాలను దాటి శరవేగంగా ముందుకు పోతోంది. సగటు ప్రేక్షకుడిని మంత్రముగ్థుడిని చేయడంతోపాటు.. ఆల్‌టైం రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ మూవీ అటు హిందీలోనూ ఇటు ప్రాంతీయ భాషల్లోనూ సాధ్యం కాని విధంగా వసూళ్లు కొల్లగొట్టింది. పట్టుమని 17 రోజుల్లో మొత్తంగా 1340 కోట్లు వసూలు చేసి రికార్డు సొంతం చేసుకుంది. దీంతో అటు బాలీవుడ్ సహా అన్ని వర్గాల మూవీ మేధావులు నోరెళ్ల […]
తమిళనాట బీజేపీ ఆట షురూ?!
`తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో అస్సలు కేంద్రం వేలు పెట్టదు. తమిళనాట జరుగుతున్న పరిణామాలకు కేంద్రానికీ ఎటువంటి సంబంధం లేదు` ఇదీ కొంతకాలంగా బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు పదే పదే చెబుతున్న మాట. కానీ ఆ మాటలన్నీ నీటి మూటలేనని తేలిపోయింది. ఏకంగా సచివాలయంలోనే కేంద్రమంత్రి.. రాష్ట్ర మంత్రులతో సమావేశమయ్యే స్థాయిలో ఉన్నారంటే.. తమిళనాట పరిస్థితులను కేంద్రం ఎంతవరకూ తన చెప్పు చేతల్లో పెట్టుకుంటే అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. `అమ్మ` […]
`ఉయ్యాలవాడ` ఆలస్యానికి రీజన్ ఇదేనా?
దాదాపు పదేళ్ల తర్వాత తెరపై కనిపించినా తనలో స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి! తన 150వ సినిమా ద్వారా సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఇదే ఊపులో 151వ సినిమాగా డ్రీమ్ ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సైన్ చేసేశాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కనుక.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా త్వరగా ప్రారంభించాలని ప్రయత్నించినా.. బాహబలి-2 ఎఫెక్ట్ తో వెనక్కి […]