క‌డ‌ప‌లో ఆయ‌న‌ టీడీపీలోకి…ఈయ‌న‌ వైసీపీలోకి..?

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. విప‌క్ష వైసీపీలో ఉంటే క‌ష్ట‌మే అని భావిస్తోన్న వారు అధికార టీడీపీ వైపు చూస్తుంటే…టీడీపీలో ప‌రిస్థితి బాగోలేద‌ని భావిస్తోన్న మ‌రో కీల‌క నేత వైసీపీ వైపు చూస్తున్నార‌ట‌. ఇప్పుడు జిల్లాలో వీరిద్ద‌రి వ్య‌వ‌హార‌మే హాట్ టాపిక్‌గా మారింది. జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ‌రెడ్డి హ‌వా ముందు మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి తేలిపోతున్నారు. తాజాగా విశాఖ‌లో జ‌రుగుతోన్న మ‌హానాడుకు సైతం ఆయ‌న డుమ్మా కొట్టారు. ఆయ‌న మ‌హానాడుకు రాక‌పోవ‌డం ఒక ఎత్తు […]

ప‌టాస్ ర‌వికి షాక్‌…శ్రీముఖికి జోడీగా కొత్త యాంక‌ర్‌..!

బుల్లితెర మీద యాంక‌ర్ ర‌వి అతి త‌క్కువ టైంలోనే సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. ర‌వి ఎంత‌లా పాపుల‌ర్ అయ్యాడో కాంట్ర‌వర్సీల‌కు అంతే కేరాఫ్ అడ్ర‌స్ అయ్యాడు. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుక‌లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌లిరావు అమ్మాయిలు ప‌క్క‌లోకి ప‌నికివ‌స్తార‌ని చేసిన వ్యాఖ్య‌లు టోట‌ల్ ఇండ‌స్ట్రీలోనే పెద్ద దుమారం రేపాయి. చ‌ల‌ప‌తి వ్యాఖ్య‌ల‌కు ర‌వి సూప‌ర్ అన‌డం కూడా పెద్ద కాంట్ర‌వ‌ర్సీకి దారితీసింది. మ‌హిళా సంఘాలు దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం […]

ర‌జ‌నీ పార్టీలోకి పొలిటిషీయ‌న్లు, హీరోలు, హీరోయిన్లు

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ పార్టీ పెట్ట‌డం క‌న్ఫార్మ్ కావ‌డంతో ర‌జ‌నీ రాజ‌కీయ పార్టీ ఏంటి ? పార్టీ విధివిధానాలు ఎలా ఉంటాయి ? ర‌జ‌నీ బీజేపీతో పొత్తు పెట్టు కుంటారా ? లేదా ? ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో ఉంటారా ? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు మీడియాలో ఎవ‌రికి వారు సంధించుకుని చ‌ర్చ‌లు పెట్టేసుకుంటున్నారు. ఎవ‌రి చ‌ర్చ‌లు, ఆలోచ‌న‌లు ఎలా ఉన్నా ర‌జ‌నీ పార్టీకి అప్పుడే పొలిటిక‌ల్ గ్లామ‌ర్‌, సినీ గ్లామ‌ర్ యాడ్ అయిపోయింది. ఇప్ప‌టికే […]

అవ‌మానాలు ఎదుర్కోలేక పార్టీ వీడనున్న కవిత!

ఈ హెడ్డింగ్ చూసిన వారు బీజేపీలోకి క‌విత ఏంటి ? అని కాస్త క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉంటారు. క‌విత అంటే కేసీఆర్ కుమార్తె క‌విత కాదు…నిన్నటి త‌రం ప్ర‌ముఖ హీరోయిన్‌, ప్ర‌స్తుత టీడీపీ నాయ‌కురాలు అయిన క‌విత‌. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప‌దేళ్ల‌పాటు ఆమె పార్టీ త‌ర‌పున వాయిస్ గ‌ట్టిగా వినిపించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి టీడీపీలోనే ఉన్న అతికొద్దిమందిలో క‌విత ఒక‌రు. టీడీపీ ఆందోళ‌న‌ల‌ను ఆమె ప్ర‌జ‌ల్లోకి బాగానే తీసుకెళ్లేవారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పండ‌గ చేసుకునే న్యూస్. ప్ర‌స్తుతం జైల‌వ‌కుశ సినిమాలో న‌టిస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, కొర‌టాల శివకు క‌మిట్ అయ్యాడు. ఇక రాజ‌మౌళి సైతం ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్ప‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్‌లో మునిగి తేలుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ జోష్ నుంచి ఇంకా తేరుకోక‌ముందే వారికి మ‌రో పండ‌గ చేసుకునే వార్త వ‌చ్చేసింది. ఎన్టీఆర్ హిందీలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన రియాల్టీ […]

కేసీఆర్ స‌ర్వేపై సొంత పార్టీలోనే లుక‌లుక‌లు!

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పాల‌న‌, మంత్రుల ప‌నితీరు, ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలి వంటి ప్ర‌ధాన అంశాల‌పై చేయించిన స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది. ఇక‌, మేన‌ల్లుడు, మ‌రో మంత్రి హ‌రీశ్‌రావు ప‌రిస్థితి ఫ‌ర్వాలేదు..అని స‌ర్వే తెలిపింది. ఇక‌, టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ప‌రిస్థితి దిగ‌జారుతోంద‌న్న‌ట్టుగా స‌ర్వే వివ‌రించింది. ఇంత వ‌ర‌కు బాగానే […]

టీడీపీ ఎంపీకి బీజేపీ ఆఫ‌ర్‌..!

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో చెప్ప‌డం క‌ష్టం. ముఖ్యంగా తాము కోరుకున్న ప‌నులు నెర‌వేర‌క‌పోతే.. నేత‌లు ఎంత‌కైనా తెగిస్తార‌నేది పాలిటిక్స్‌లో మామూలే! ఏళ్ల త‌ర‌బ‌డి కాపు కాచిన పార్టీల‌ను సైతం ఒక్క క్ష‌ణంలో వ‌దిలేసిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌డు ఇదే జాబితాలోకి న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు చేర‌నున్నార‌ట! కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకుని న‌ర‌స‌రావు పేట నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవ‌ల […]

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రెంటికీ చెడ్డ రేవ‌డేనా?

ఏపీ, తెలంగాణ‌ల్లో బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రించి.. 2019లో కుదిరితే క‌ప్పు కాఫీ.. అన్న‌ట్టు.. వీలైతే అధికారంలోకి వ‌చ్చేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్న బీజేపీకి ఆదిలోనే హంస‌పాదులా ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం చాల‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఆ పార్టీ చేస్తున్న, చేసుకుంటున్న ప్ర‌చార‌మేన‌నే వాద‌నా వినిపిస్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందో చూద్దాం… ప‌నిగ‌ట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీని భారీ ఎత్తున ఉరుకులు ప‌రుగులు పెట్టిద్దామ‌ని నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న కోసం తెలంగాణ‌, ఏపీల‌కు వ‌చ్చిన క‌మ‌ల […]

ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న‌… చేతులు దులుపుకున్న చంద్ర‌బాబు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీకి వినిపించిన విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావుకు భార‌త ర‌త్న అవార్డు ఇవ్వాలి అనేది కొన్నేళ్లుగా ఏపీలో విన‌బ‌డుతున్నామాట‌! అయితే, ఇది కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం కావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలే చొర‌వ తీసుకుని ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికే ఈ విష‌యం కేంద్రానికి కూడా చేరింది. ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. ఎన్‌టీఆర్‌కు భార‌త ర‌త్న ఇవ్వాలి అనే అంశంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఓ అభిప్రాయం లేదా? అనే […]