ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ టైటిల్ & రిలీజ్ డేట్ ఫిక్సే..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స‌యిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. వ‌చ్చే యేడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 10 లేదా 11తేదీల్లో ఈ సినిమాను విడుదల చేయాలని […]

నంద్యాలే కాదు… అక్కడ ఎన్నిక కూడా హోరా హోరీనే

ఏపీలో ఇప్పుడు జనం దృష్టి అంతా కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికపైనే ఉంది. ఈ ఉప ఎన్నిక ఈ నెల 23న జ‌రుగుతుండ‌గా, కౌంటింగ్ 28న జ‌రుగుతోంది. ఆ మ‌రుస‌టి రోజే కాకినాడ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 1న కౌంటింగ్ జ‌రుగుతోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయ‌డంతో ఇప్పుడు కాకినాడ‌లో ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయింది. కాకినాడ […]

టీడీపీ ఎమ్మెల్యే పుత్రికార‌త్నం చేసిన ప‌ని చూస్తే దిమ్మ తిరగాల్సిందే

ఇప్పుడు గుంటూరు జిల్లా అంతా ఇదే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న టీడీపీలో ఓ సీనియ‌ర్ లీడ‌ర్‌. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు జిల్లాలో చ‌క్రం తిప్పుతూనే ఉన్నారు. స‌ద‌రు సీనియ‌ర్ లీడ‌ర్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అయితే ఆయ‌న ఏక‌పోక‌డ‌ల‌తో విసిగిపోయిన జిల్లా టీడీపీ వాళ్లంతా ఆయ‌న్ను ఓ పెద్ద అన‌కొండ‌గా విమ‌ర్శిస్తుంటారు. ఆయ‌న ఎన్నో కీల‌క ప‌ద‌వుల్లో కొన‌సాగారు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు జిల్లాలో త‌న కుటుంబ స‌భ్యుల […]

జీఎస్టీ దెబ్బ‌కు తెలంగాణ విల‌విల‌

జీఎస్టీ దెబ్బకు సామాన్యుడే కాదు.. సర్కారు కూడా హడలిపోతోంది. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా రాష్ట్ర బడ్జెట్ ఫిగర్స్ కూడా మారిపోతున్నాయన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్ర‌శంసించారు. ఇప్పుడు లోక్‌స‌భ‌లో ఆ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి… రాష్ట్రంపై జీఎస్టీ ఎఫెక్ట్‌ను వివ‌రించారు. దీనివ‌ల్ల తెలంగాణ న‌ష్ట‌పోతోంద‌ని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నారు. జీఎస్టీ మీద ఇచ్చిన […]

ఉలిక్కిపడ్డ పార్టీ … టెన్షన్ లో నాయకులు

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో పాతాళానికి ప‌డిపోయిన కాంగ్రెస్‌.. ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతోంది. పార్టీకి వీర విధేయులైన నాయ‌కులు.. అంతోఇంతో క్యాడ‌ర్ త‌ప్ప ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఉన్న వారితోనే నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగుతామ‌ని ప్ర‌కటించినా అంత‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ప్ర‌క‌ట‌న అయితే చేసేసింది కానీ ఇప్పుడు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ఎంతో క‌ష్ట‌ప‌డి.. భూత‌ద్ధంలో వెతికి.. నేను పోటీచేయ‌ను అన్నా బుజ్జ‌గించి మరీ ఒక అభ్య‌ర్థిని బ‌రిలో నిల‌బెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ […]

క‌ల‌క‌లం: బీజేపీలోకి ఆరుగురు టీఆర్ఎస్‌ ఎంపీలు జంప్‌

ప్ర‌త్య‌ర్థుల‌కు అంతుచిక్క‌ని వ్యూహాల‌తో దూసుకుపోతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇవ్వ‌బోతున్నారా? మూకుమ్మ‌డిగా రాజీనామా చేసి.. ఇక బీజేపీ గూటికి చేరిపోయేందుకు ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇటీవ‌ల కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్ చేరిపోతుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. ఇక కేసీఆర్ కూతురు, ఎంపీ క‌విత‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని కూడా హ‌ల్‌చల్ చేశాయి. కానీ త‌ర్వాత అవ‌న్నీ ఊహాగానాలే అని తేలిపోయాయి. అయితే టీఆర్ఎస్‌ ఎంపీల్లో కొందరిని […]

మెగా ఫ్యాన్స్ చూపు మ‌హేష్ వైపు..అస‌లేం జ‌రిగింది

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మెగా ఫ్యామిలీ హీరోలంద‌రికి మెగా ఫ్యాన్స్ ఎంతో స‌పోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే యేడాదిలో ఏకంగా 10కి పైగా రిలీజ్ అవుతుండ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌డం లేదు. ఇదిలా ఉంటే ఈ మెగా ఫ్యాన్స్ చూపు ఇప్పుడు ప్రిన్స్ మ‌హేశ్‌బాబు వైపు ప‌డింది. అదేంట‌ని షాక్ అవ్వొద్దు. ఇది నిజ‌మే… మెగా ఫ్యాన్స్ అంద‌రూ మ‌హేశ్ బాబు వైపు […]

ప్ర‌కాశం టీడీపీలో ఫ‌స్ట్ వికెట్ డౌన్‌.. లైన్లో 2, 3 వికెట్లు

ప్ర‌కాశం జిల్లాలో కొంత‌మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినా క్షేత్ర‌స్థాయిలో మాత్రం వైసీపీ బ‌లంగానే ఉంది. ఇక్క‌డ చంద్ర‌బాబు ఫిరాయింపుల‌తో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుని టీడీపీని చేజేతులా నాశ‌నం చేసేశారు. విప‌క్ష వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోను పార్టీ రెండు గ్రూపులుగా నిలువునా చీలిపోయింది. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులుగా జిల్లాలో నివురు గ‌ప్పినా నిప్పులా ఉన్న అసంతృప్తి అన్నా రాంబాబు రూపంలో ఫ‌స్ట్ వికెట్ రూపంలో ప‌డిపోయింది. అద్దంకిలో […]

సెంటిమెంట్ రిపీట్‌ చేస్తున్న బాలయ్య

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ జెట్‌స్పీడ్‌తో సినిమాలు చేసేస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య ఆ వెంట‌నే పూరి జ‌గ‌న్నాథ్‌తో త‌న 101వ సినిమా పైసా వ‌సూల్ కంప్లీట్ చేసేశాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే బాల‌య్య అప్పుడే త‌న 102వ సినిమాను స్టార్ట్ చేసేశాడు. బాల‌య్య 102వ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. ప్ర‌ముఖ కోలీవుడ్ డైరెక్ట‌ర్ […]