టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు .ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, టైలర్ చూస్తుంటే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది.. ఈ సినిమా థియేటర్లోకి జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈవెంట్ కు ఆది పురుష్ టీం తో పాటు ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరై చిత్ర యూనిట్ ని ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రావణాసుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటించారు.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించకపోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు జరిగిన ప్రమోషన్లు ఇప్పుడు జరిగిన ఫ్రీ రిలీజ్ లో ఎక్కడ సైఫ్ ఆలీ ఖాన్ కనపడలేదు. అందుకు కారణం ఏంటనే విషయంపై అభిమానులు ఆరా తీయగా..
అసలు విషయం ఏంటంటే.. ఆయన బాలీవుడ్ లో చాలా బిజీ హీరో ఉండడంతోపాటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ చాలా బిజీగా సినిమాలలో నటిస్తున్నాడు. ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ సినిమా దేవర లో కూడా విలన్ గా నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ అందుకే ఆది పురుష్ సినిమా ఈవెంట్ కానీ ప్రమోషన్లకు కానీ రాలేదు. అంతేకానీ వారి చిత్ర బృందం తో కానీ ప్రభాస్ తో కానీ ఎలాంటి మనస్పర్ధలు లేవనీ తెలుస్తోంది.