టాలీవుడ్ సీనియర్ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గాను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కోట శ్రీనివాస్‌కు తెలుగు ఆడియన్స్‌లో పరిచయం అవసరం లేదు. తన నటనత ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. జూనియర్ ఎన్టీఆర్ ను మొదటినుంచి ఎంతగానో అభిమానిస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమానాన్ని.. ఎన్నో ఇంటర్వ్యూలో తెలియజేసిన కోట శ్రీనివాస్.. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోల అందరిలో తనకు నచ్చిన హీరో ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్నింటిలోనూ తన సత్తా చాటుకోవడంలో ఎన్టీఆర్ కు ఎవరు పోటీ కాదని.. ఎన్టీఆర్ లోని టాలెంట్‌ని చిన్న వయసులోనే తన తాత సీనియర్ ఎన్టీఆర్ గుర్తించారని వివరించాడు.
అందుకే మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి విజయ తిలకం దిద్ది అన్నగారు ఇండస్ట్రీకి ఆహ్వానించారని చెప్పుకొచ్చాడు. మహేష్, అల్లు అర్జున్ కూడా మంచి నటులే అని.. అయితే వాళ్లంతా ఎన్టీఆర్ తర్వాతే అంటూ కోట శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ పొట్టిగా ఉంటాడని.. అలాగే చంద్రమోహన్ కూడా పొట్టిగానే ఉంటారు.. కానీ ఆయన నటన ప్రస్థానం అందరికీ తెలుసు. ఎవ్వరికి చంద్రమోహన్ పోటీ కాదు. ఆయన చాలా గ్రేట్ యాక్టర్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ కోట శ్రీనివాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. మిగతా హీరోల ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్‌ను పొగుడుతూ.. తమ హీరోని కించపరిచినట్లుగా కోటా శ్రీనివాస్ మాట్లాడాడని అతనిపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో తమ సత్తా చాటుతున్నారు.
ఇలాంటి టైం లో ఎన్టీఆర్ మాత్రమే గొప్ప నటుడు అనడం అసలు సరికాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కోట శ్రీనివాస్ వయస్సు రిత్యా గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు.. ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలోను నటిస్తున్నాడు. ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ లెవెల్ లో ఉండనుంది.