ప్రస్తుత లైఫ్ స్టైల్లో మేకప్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చాలామంది డైలీ రొటీన్ లో మేకప్ లేకుండా బయటకు వెళ్లేందుకు ఇష్టపడట్లేదు. కానీ మేకప్ లో ఉండే హానికర కెమికల్స్ వల్ల, చర్మ ఉత్పత్తుల వల్ల చర్మ ఆరోగ్యానికి మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో వివిధ స్కిన్ ప్రాబ్లమ్స్ కు దారితీస్తున్నాయి. కనుక సహజంగా మేకప్ లుక్ పొందడానికి ప్రయత్నించాలి. దీనికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెమిడి పాటిస్తే మేకప్ లేకుండానే సహజంగా వైట్ అండ్ గ్లో తో మెరిసిపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం.
ముందుగా ఒక క్యారెట్ తీసుకుని పీల్ తొలగించి.. వాటర్ తో శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ లో దానిని మెత్త పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. స్టైనర్ సహాయంతో జ్యూసి సపరేట్ చేసి పెట్టుకోవాలి. వేరే బౌల్లో ఎగ్ వైట్ తీసుకొని.. అందులో నాలుగు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్, అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు ఆరబెట్టిన తర్వాత నీటితో చర్మాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల సింపుల్గా ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు.. అదే సమయంలో ఎన్నో లాభాలు చేకూరేలా చేస్తుంది.
క్యారెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్.. ఇందులో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే తెల్లగా, కాంతివంతంగా చేయడానికి సహకరిస్తాయి. ఇక ఎగ్ వైట్ లో ఉండే ప్రోటీన్ చర్మం బిగుతుగా, మృదువుగా మార్చి ముడతలు, ఏజింగ్ లక్షణాలు కనిపించకుండా చర్మానికి అడ్డుకట్ట వేస్తుంది. పెరుగులో సహజమైన ప్రోటీన్లు ఉండడంతో ఇందులో ఉండే విటమిన్స్ చర్మానికి అందుతాయి. దీంతో పెరుగు ముక్క చర్మానికి అద్భుతంగా తోడ్పడుతుంది. తేనే చర్మానికి మంచి గ్లో అందించడంతోపాటు.. తేనెల సహజ యాంటాఆక్సిడెంట్లా ఉండి.. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి యువనంలో బచ్చే వృద్ధాప్యానికి చెక్ పెడుతుంది.