నిద్ర అనేది మనిషి ఆరోగ్యంలో కీలకపాత్ర వహిస్తుంది. వయసును బట్టి నిద్ర ఎన్ని గంటలు అవసరమో తెలుపవచ్చు. జీవితంలో ఎంతో కీలకమైన 30 – 40 ఎలా వయసు వారిలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఇలాంటివారు రోజుకు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నిద్రపోవాలని నిపుణులు సైతం చెబుతున్నారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మెదడు పనితీరు బాగుండాలంటే నిద్ర చాలా అవసరం. 30 – 40 ఏళ్ల వయసులో సరైన నిద్ర లేకపోతే అది జ్ఞాపకశక్తిపై నెగిటివ్ ప్రభావం చూపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
2. 30-40 ఎల్ల వయసులో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇది మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. దానిని నివారించాలంటే రోజుకు సరిపడా నిద్రపోవడం అవసరం.
3. 30 నుండి 40 ఏళ్ల వయసు వారిలో డయాబెటిస్ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణాలలో సరైన నిద్ర లేకపోవడం కూడా ఒకటి. రోజుకి సరిపడా నిద్ర లేకపోవడం కూడా ఇందుకు కారణం అవుతుంది.
4. రక్తపోటు సమస్య 30 నుంచి 40 ఏళ్ల వయసులో అధికంగా కనిపిస్తుంది. ఒత్తిడితోపాటు సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. అందువల్ల రోజుకు కనీసం 8:00 నిద్రపోతే రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.
నిద్ర లేకపోవడం కారణంగా మీ ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా రోజుకి సరిపడా నిద్రను ప్లాన్ చేసుకోండి.